Our Health

Archive for సెప్టెంబర్, 2013|Monthly archive page

చుంబన రహస్యాలు. 13. అడ్వాన్స్ డ్ కిటుకులు !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 29, 2013 at 1:49 సా.

చుంబన రహస్యాలు. 13. అడ్వాన్స్ డ్  కిటుకులు !   

కలగలుపు ! : అంటే,  మిక్స్ అండ్ మ్యాచ్ !  ముద్దులు మంచు పూవుల లాంటివి ! అంటే , ఏ ఒక్క మంచు పూవూ ఇంకో దానిని పోలి ఉండదు ! కానీ అన్నీ మంచు పూవులే ! ఒక మారు, మీరు ఫ్రెంచ్ కిస్ ( ఇవ్వడానికీ , తీసుకో డానికీ ) కు కనుక అలవాటు పడితే , మళ్ళీ , మళ్ళీ అదే ఫ్రెంచి ముద్దు పెడదామని తహ తహలాడడం సహజమే !  వేగం మారుస్తూ , ఆమెలో  కామాతురత కు కళ్ళెం వేస్తూ  ముందుకు సాగడం !  మీరు ఇప్పుడు నిదానం గా ఫ్రెంచి ముద్దు ఇవ్వడం తెలుసుకున్నాక ,  ‘సమయానుకూలం ‘ గా మీ చుంబన వేగం మారుస్తూ , వివిధ వేగాలతో ముద్దులు ‘గుప్పిస్తూ ‘ ఉంటే ,  ఆ చేసే పని లో కాస్త  వెరైటీ వస్తుంది ! ఉద్వేగం వేస్తుంది , ఇరువురిలోనూ ! 
లోతు గా :  కొంత సేపు పై పై ముద్దులు ఇచ్చాక , చిలిపి గా  డీప్ కిసెస్ , అంటే గాఢమైన ముద్దులు ఇవ్వడం చేస్తే , మీ ప్రేమ రస పాకం లో పడుతుంది ! 
వత్తిడి గా : మీ ప్రేయసి తో పరిచయం పెరుగుతున్న కొద్దీ , మీ ముద్దులలో గాఢ త కూడా పెంచితే మీ తప్పు ఏమీ ఉండదు !  మీరిరువురూ ,  ఒకరి పొందులో ఇంకొకరు స్వాంతన పొందే స్థితికి వచ్చే ఉంటారు కదా  , ఈపాటికి !  దానితో లోతైన ముద్దులతో పాటుగా , ఆముద్దులను  శక్తి వంత మైనవి గా కూడా మీరు మార్చవచ్చు  , కాస్త వత్తిడి పెంచి !  కానీ మీ నాలుక ను ఆమెలో మెది లించడం మాత్రం మాన కూడదు ! 
దంత స్పర్శ :  కేవలం ఆమె పెదవులే కాకుండా , ఆమె దంతాలను కూడా మీ నాలుకతో  తాకవచ్చు ! అది కూడా ఒకరకమైన చక్కిలి గింతలు కలిగిస్తుంది మీ నెచ్చెలి లో ! 
చేతులతో !:  మొదటి ముద్దు సమయం లో, మీ చేతులను బుద్ధిగా మీకు ఇరు ప్రక్కలా ఉంచడమే శ్రేయస్కరం అంటారు !  మరి ఆ ముద్దు మొదటిది కానప్పుడు , మీ చేతులకు  పని కల్పించడం మీ బాధ్యత !  ప్రేయసి చెక్కిలి మీదనో , లేదా ఆమె శిరోజాలను సుకుమారం గా దువ్వుతోనో , లేదా ఆమెను మీ కౌగిలి లో ‘ బంధించో ‘  మీ ముద్దును ఆస్వాదించ వచ్చు , ఆమెతో కూడా ! 
దేహ భాష ! :  ముద్దులకు విశ్వ వ్యాప్త వైవిధ్యం ఉంది ! అంటే , ప్రపంచం లో ఏ ఒక్క ముద్దూ , ఒకే రుచి తో ఉండదు ! దానికి కారణాలు అనేకం ! దానిలో ముఖ్యమైనది , మనుషులంతా ఒక్కటే కాదు కదా ! అదే విధం గా,  ఏ ప్రేయసీ ఎప్పుడూ , ఒకే లా చుంబించ బడాలని అనుకోదు ! అంటే, వారికి కూడా వైవిధ్యం కావాలి !  ఏ ముద్దు ఆమెకు , ఇష్టమో , ఏ ముద్దు ఇష్టం లేదో  తెలుసుకోవడం ఒక కళ ! ఇంకో వంద టపాలు రాసినా , అది తెలుసుకోవడం సాధ్యపడదు !  కేవలం ,  ఆ ముద్దు పెట్టే వారి సమయ స్ఫూర్తి , వివేకం తోనే , అది సాధ్యం అవుతుంది !  కానీ ‘ సాధనమున పనులు సమకూరు ధరలోన !’  అనే సూక్తి ని , ‘  సాధనమున పనులు సమకూరు అధరాన ‘ అని గుర్తుంచుకుంటే !  మీరు విజయులే !  అప్పుడు మీకు , ‘ ఆమె ‘ ముద్దు మురిపాల తీరు తెన్నులు బాగా తెలుస్తాయి !  ప్రాక్టిస్ మేక్స్  పర్ఫెక్ట్ ! 
కమ్యునికేషన్ ! :  మీ ఇరువురి మధ్యా , పరిచయమూ , చనువు ఎక్కువ అవుతూ  ఉంటే , ముద్దు కూడా మురిపెం గా  అవుతూ ఉంటుంది !  ఆ స్థితి లో  అతడి ముద్దు మీకు నచ్చితే , ఆ సంగతి అతనితో చెబితే , మీ ఆనందం అధికం అవుతుంది ! ఒక వేళ ‘  ఆ ముద్దు’  నచ్చక పోయినా ,  మీ మనసులు కలిస్తే ,  మీరిరువురూ, సరదాగా ,  హాయి గా నవ్వుకుని,  మలి ప్రయత్నం చేయవచ్చు ! అందుకే ,   ప్రాక్టిస్ !  — — !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

చుంబన రహస్యాలు.12. ఫ్రెంచి ముద్దు ప్రేమైకం !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our mind, Our minds on సెప్టెంబర్ 27, 2013 at 9:37 సా.

చుంబన రహస్యాలు.12.  ఫ్రెంచి ముద్దు ప్రేమైకం !

మీ పెదవులతో, ఆమె పెదవులను  నెమలి ఈకతో  తాకినట్టు తాకడం :   మీ ఇరువురి పెదవులూ చేరువ అయిన తరువాత , మీ పెదవులతో, ఆమె పెదవుల మీద అతి సున్నితం గా తగలాలి !  ఆ టచ్, కేవలం,  మీరు ఒక నెమలి ఈక తో ఆమె పెదవులు తాకు తున్నంత సుకుమారం గా ఉండాలి !   ఎందుకు  అట్లా ? పెదవుల లో అనేక వందల నాడీ తంత్రులు గజిబిజి గా అల్లుకుని ఉంటాయి !  ఆ నాడీ తంత్రులు , అతి సున్నితమైన స్పర్శకు కూడా తక్షణమే స్పందించే  ధర్మం కలిగి ఉంటాయి !  మీ పెదవుల నెమలి ఈకలు ఆమె పెదవులను తాకగానే , ఆమె లో నూ , తద్వారా  ఆమె పెదవులలోనూ , విపరీతమైన యాంటిసిపేషన్ , ఎగ్జైట్ మెంట్ , కలుగుతాయి. అంటే ఆమె పెదవులు ,  మీ పెదవుల స్పర్శ తో ఉత్తేజం చెందడమే కాకుండా ,  మీ పెదవులతో బంధం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి కూడా ! ఈ దశలో , పూర్తి ముద్దు కోసం కాదు ఆ ఎదురు చూపు !   ఈ పరిస్థితి లో, మీరు విపరీతం గా ఉద్రేక పడి పోకుండా , మీకు ఇప్పుడు ప్రపంచం లో  ఉన్న సమయం అంతా , మీ ఆధీనం లోనే ఉన్నట్టు భావించి , అతి నిదానం గా నింపాది గా  మీ నెమలీక  స్పర్శ ,  ఆమె పెదవులకు కలిగించాలి ! 
ఈ విధం గా కొంత సేపు ( ఎంతో సేపు ) చేసిన తరువాత , మీ ఉద్దేశం తెలియ చేయండి , ఫ్రెంచి ముద్దు కోసం ! అందుకు మీ సన్నద్ధత ను కూడా ఈపాటికి తెలియ చేసే ఉంటారు ! ఇప్పుడు, మీ నోరు విశాలం గా తెరచి , ఆమె కింది పెదవిని , మీ రెండు పెదవులతో లాక్ చేయండి అంటే బంధించడం !  ఆ తరువాత మీ నాలుక తో ఆమె క్రింది పెదవిని  ఇక్క సారిగా కేవలం కొన్ని క్షణాల పాటు స్వీప్ చేయండి , అంటే ఆమె క్రింది పెదవి మీద , మీ నాలుకతో వెన్న పూస్తున్నట్టు తాకడం !  ఆమెకు మీ చర్య ఇష్టం అవుతే ,  ఆమె నాలుక కూడా క్రియా శీలం అవుతుంది అంటే యాక్టివ్ గా మీ పెదవుల కోసం సాగుతుంది ! లేక , ఆమెకు ఇష్టం లేక పొతే  మీరు ఏ చర్యనూ ఫీల్ అవరు !  అప్పుడు , మీ ప్రయత్నం తాత్కాలికం గా విరమించుకుంటే మంచిది !  
ఆమె ఉత్సాహం చూపుతూ ఉంటే , మీ నాలుకకు పని పెట్టడం మీ తరువాతి కార్యక్రమం !   ఆమె నాలుకను మీ నాలుక తో తడిమి ( రుచి ) చూడడం , కొద్దిగా ఆమె నాలుకను తాకి , మళ్ళీ మీ నాలుక వెనుకకు పొతే , ఆమె దానిని అందుకోడానికి తన నాలుకను సాగ దీయడం ,  నోటి లో ఒక ప్రేమాట లా ఉంటుంది !   ఆనంద దాయకం గా , చిలిపి గానూ ఉంటుంది !  గుర్తు ఉంచుకోవలసినది, నాలుకను ఎప్పుడూ సాఫ్ట్ గానే ఉంచాలి ! దృఢ మైన కండరం గా చేయకూడదు !  అంతే కాకుండా , అత్యుత్సాహం తో మీ నాలుకను వీలైనంత పొడవు గా చాచి  ఆమె గొంతు కు అడ్డం గా పోనీయ కూడదు ! అప్పుడు ఆమె ఉత్సాహం నీరు కార్చిన వారవుతారు  మీరు ! 
మరి ఈ ఫ్రెంచ్ చుంబన కార్యక్రమం ఎక్కువ సమయం సాగుతుంటే , మీ   రిరువురూ శ్వాస తీసుకోవడం మరచి పోకూడదు !  మొహమాట పడకుండా , తరచూ శ్వాస తీసుకుంటూ ఉండాలి కూడా !  సరిపడినంత ఆక్సిజన్ అందితే , మీ మెదడు తో పాటుగా , మీ పెదవులూ , నాలుకా కూడా  ఉత్సాహం తో ‘ పని చేసి ‘ మీకు అధిక ఆనందాన్ని కలుగచేస్తాయి ! 
 
ఈ ఫ్రెంచి ముద్దులో కూడా కొన్ని అడ్వాన్స్ డ్  టెక్నిక్ లు ఉన్నాయి ! వాటి గురించి వచ్చే టపాలో ! 

చుంబన రహస్యాలు. 11. ఫ్రెంచి ముద్దు ఎట్లా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 26, 2013 at 11:04 సా.

చుంబన రహస్యాలు. 11. ఫ్రెంచి ముద్దు ఎట్లా ? 

కనులు కలిపి వలపు తెలుపు ! :  కనులు కలపడం అంటే  మీ కళ్ళు ‘ ఆమె ‘ కళ్ళ తో అనుసంధానం చేయాలి ! అంటే ఐ కాంటాక్ట్  చేయాలి ! మామూలు గా మనం ఎవరినైనా చూస్తున్నప్పుడు,  వారి కళ్ళ లో చూస్తాము కదా మరి ఆ చూపులకూ , ప్రణయ చూపులకూ అంటే రొమాంటిక్ చూపులకూ తేడా ఏమిటి ? ప్రణయ చూపులలో , అందాలను  ( కళ్ళ తో ) ప్రశంసిస్తూ కూడా , ఇంకా చిలిపి భావనలు కూడా తెలియ బరచడం !  మరి ముద్దు పెట్టుకోవాలని తెలపడం ఎట్లా ? 
అందుకు మీ చూపుల రూటు :   మొదట ఆమె కళ్ళతో జత కడతాయి , అక్కడ కొన్ని క్షణాలు ఉండి ,  నేరుగా ఆమె పెదవుల మీద పడతాయి  మళ్ళీ పెదవులనుంచి రూటు నేరుగా ఆమె కళ్ళలోకి వెళతాయి మీ చూపులు ! దానితో  మీ చుంబ న సందేశం  , ఆమె చూపుల ద్వారా , ఆమె మనసు టపా కు చేరుకుంటుంది, మీ మెసేజ్  ! 
చిలిపి నవ్వు : మీకు మీ ఉద్దేశం ఆమె కు తెలియ చేయగానే , మీ మనసు ఆనంద తాండవం చేస్తుంది , ఆ తాండవం ఆమెకు మీ చిరు నవ్వు ద్వారా తెలియ చేయండి !  మీ చిలిపి నవ్వు , ఆమెకూ ఆనందం కలిగించడం తో పాటుగా ,  ఆమె ను రిలాక్స్ చేసి , ఆమె లో చుంబనం చేయ బోతున్నందుకు కలిగే ఆందోళనలను నివారించ డమూ , లేదా తగ్గించడమూ చేస్తుంది !  ఆమెలో కానీ , అతనిలో కానీ భద్రతా భావాన్ని కూడా కలిగిస్తుంది  మీ పొందులో !  ఆ చిరునవ్వు , చిలిపి గా ఉన్నా , నిజాయితీ గా , స్వచ్ఛ మైనది గా ఉంటే ,  మీ చుంబనం రుచి మధురం గా ఉంటుంది ! ఆమె పాజిటివ్ గా స్పందించ గానే,  మీరు మరో అంగుళం ముదుకు వెళ్ళాలి ! అంటే అతి త్వరగా కాక , మరీ అంత నిదానం గానూ కాక ,  ఆమె పెదవులకై మీరు చేరువ కావాలి , ఆమెకు !  అదే సమయం లో ఆమె కూడా మీ పెదవులకు చేరువ కావడం గమనించండి ! 
మీరు నేరుగా ఆమె పెదవుల మీదనే దృష్టి పెట్టినా కూడా , మీ ముఖం ఆమె ముఖానికి సరిగ్గా ఎదురు గా ఉంచ కూడదు ! ఎందుకంటే , మీ ఇరువురి నాసికలూ ‘ విలన్ ‘  లవుతాయి ముద్దుకు ! అంటే  మీ ఇరువురి ముక్కులూ కలబడి,  మీకు,  ముద్దు దూరం అవుతుంది ! అందుకని,  మీరు ఆమె చేరువ అవుతున్న సమయం లో నే మీ తలను,  కొద్ది గా వంచాలి  నలభై అయిదు డిగ్రీలు ఒక ప్రక్కకు వంచితే , సరిగ్గా  మీ పెదవులు ఆమె పెదవులను చేరుకోగలవు !  మీరు ఆత్రుతగా,  తొంభై డిగ్రీలు కనుక మీ తల వంచితే , మీకు ఆమె పెదవుల పట్టు దొరకక పోగా , మీ చుంబ నోద్వేగం  కాస్తా చల్లారుతుంది !   ఆమె కానీ అతడు కానీ ఒక ప్రక్కకు తల వంచితే , మీరు ఆ డైరెక్షన్ కు ఆపోజిట్ అంటే , అభిముఖం గా మీ తల తిప్పాలి అప్పుడు మీ పెదవులు లంకె పడడానికి సరి అయిన పరిస్థితి ఏర్పడుతుంది ! 
కనులు మూసుకోవడం : మీ పెదవులు కలిసే సమయం లో మీ కనులు విశ్రాంతి తీసుకోవాలి , కను రెప్పలు మూసి ! అంటే మీరు కళ్ళు మూసుకోవడం జరగాలి !  కనులు తెరచి ముద్దు పెట్టుకోవడం ,  మీ నిజాయితీని శంకించే చర్య !  కనులు మూసుకుని  మీరు  చేసే చుంబనం మిమ్మల్ని , ఫ్లైట్ లో తీసుకు పోతుంది , ప్రణయ లోకానికి ! 
మీ పెదవులను చుంబన పొజిషన్ లో ఉంచడం:   సామాన్యం గా  బామ్మ లకు కానీ , నానమ్మ లకు కానీ ప్చ్ , ప్చ్ , ప్చ్ అని  ముద్దు ఇచ్చే సమయం లో లా , పెదవులను ముడి వేసి ఉంచకూడదు ! ఎందుకంటే ,  నానమ్మకు ఇప్పుడు ముద్దు ఇవ్వట్లేదు కనుక !  ప్రేయసికి ముద్దు ఇచ్చే సమయం లో మీ పెదవులను ఓపెన్ గా తెరచి ఉంచాలి !  అట్లాగని మీ నోటిని పూర్తి గా తెరచి ఉంచకూడదు ! ఒక మాదిరి గా తెరిచి , పెదవులను కొద్దిగానే,  బిగుతు గా ఉంచి   మీ బ్రహ్మాస్త్ర ప్రయోగానికి ఉపక్రమించాలి ! 
మిగతా సంగతులు వచ్చే టపాలో ! 

చుంబన రహస్యాలు.10. ఫ్రెంచి ముద్దు, మనకు వద్దా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 25, 2013 at 9:22 సా.

చుంబన రహస్యాలు.10. ఫ్రెంచి ముద్దు మనకు కాదా ?

ఫ్రెంచి ముద్దు ! 
తెంచు, ప్రేమ సరిహద్దు ! 
రేగు కోరికలు, ఉవ్వెత్తు ! 
చేయు ప్రియులను , ఉన్మత్తు ! 
అనేక సినిమాలలో చూసి ఉంటాము ! ఫ్రెంచి ముద్దు !  స్త్రీ పురుష  రమణీయ ప్రేమకు సయ్యాట !  చిరకాలం నుంచీ ప్రసిద్ధి చెందినది !  ఆ ముద్దు , కేవలం ఫ్రెంచి వారి ఆస్తి కాదు !  ప్రేమికులందరిదీ ! మరి ముద్దులలో రకాలు ఏమిటి?  ఫ్రెంచి ముద్దు లో తేడా ఏమిటి ? ఈ క్రింద స్టెప్పులు పరిశీలిస్తే, తెలుస్తాయి వివరాలు ! 
1. ముందు గా మీ పెదవుల తడి ఆరనీయకండి !:  పొడి గా ఉన్న పెదవులతో చుంబనం ,  దాహాన్నే తెలియ చేస్తుంది కానీ ,  ప్రేమనూ మొహాన్నీ కాదు ! అప్పుడు ప్రేమ కూడా పొడి పొడి గా కనబడుతుంది !  పెదవులను తడి ఆరకుండా  చేయ వలసినది,  డీ హైడ్రేట్ అవకుండా రోజులో క్రమం గా నీరు త్రాగడం ! కావాలనుకుని డీ హైడ్రేట్ అవక పోయినా , చదువు , పని , లేదా  ప్రయాణ వత్తిడి లో  రోజూ అవసరమయే  రెండు మూడు లీటర్ల నీరు ( ఎండాకాలం లో ఇంకా ఎక్కువ గా ! ) త్రాగక పోవడం వల్లనే  , తెలియకుండా డీ హైడ్రేట్ అవడం జరుగుతుంది. పెదవులు తడి ఆరడానికి ఒక ప్రధాన కారణం , డీ హైడ్రేషన్ !  ఆ తరువాత , మీకు ఇష్టమనిపిస్తే , పెదవుల మీద , మార్కెట్ లో లభ్యం అయే  ఒక మంచి బామ్ పూసుకుంటే కూడా  ముద్దు ‘ రుచి ‘ పెరుగుతుంది ! పెదవులను , నాలుక ద్వారా , లాలా జాలం తో తడి గా ఉంచితే ,  ముద్దు ‘ రస మయం ‘ గా ఉంటుంది !
2. తాజా శ్వాస ! : స్వచ్ఛ మైన గాలిని పీల్చిన శ్వాస , మీ ప్రేమ స్వచ్ఛతను కూడా తెలియచేస్తుంది ‘ ఆమెకు ‘ !  జర్దా నమిలిన శ్వాసా , ధూమ పానం చేసిన శ్వాసా , బాగా మసాలాలు దట్టించిన ఆహారం తిన్న తరువాత శ్వాసా , ఉల్లి పాయలో,వెల్లుల్లో వేసిన ఆహారం తిన్న శ్వాసా ,  ఆల్కహాలు ( ఏరూపం లో నైనా , అంటే బీరు కానీ , వైన్ కానీ , విస్కీ కానీ ), కాఫీ కూడా , తాగిన తరువాత శ్వాసా , ఇవన్నీ  ముద్దును ‘ కలుషితం’ చేస్తాయి ! ఆ పరిస్తితులలో  ‘ ఆమె ‘ కు పెట్టే ముద్దు , ఒక మరపు రాని అనుభూతి అవ్వదు ! ‘  ముద్దు ‘ ను ఆమె కు ‘ బలవంతం ‘ గా ‘రుద్దుతున్నట్టు ‘ అవుతుంది ! పైన చెప్పినవి కొన్నీ కానీ , అన్నీ కానీ చేస్తున్న వారు , ముద్దు పెట్టాలని అనుకుంటే , ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి !  వాటిని తినడం , తాగడం చేశాక , దంత ధావనం చేసుకోవాలి , పలు మార్లు నోటిలో నీటి తో  రిన్స్ చేసుకోవాలి, పళ్ళు బ్రష్ చేసుకున్నాక !  నోటిలో ఎప్పుడూ ఫ్రెష్ మింట్ ను చప్పరించడం చేయాలి ! 
3. సుముహూర్తం : ఫ్రెంచి ముద్దు , మది లో మెదిలే తీవ్ర ప్రేమోద్వేగాన్ని ప్రేయసి కి తెలిపే చర్యలో పరాకాష్ట గా చెప్పుకో బడుతుంది !  అంటే, ముద్దులలో బ్రహ్మాస్త్రం అనుకోవచ్చు !  మరి ‘ అంతటి ‘ విలువైన’ బ్రహ్మాస్త్రాన్ని సమయం సందర్భం లేకుండా ‘విడుదల ‘ చేస్తే  , ఆ ముద్దు శక్తి ని మీరు పూర్తి గా పొంద లేరు !  మీకు ఆమె తో కానీ అతనితో కానీ పరిచయం బాగా పెరిగినప్పుడు , ఆమె కానీ, అతడు కానీ,  మీకు చాలా చేరువలో ఎక్కువ సమయం ఏకాంతం గా గడుపుతున్నప్పుడు కానీ , ఆమె దేహ భాష ను గమనించి, మీరు ‘ ముందడుగు ‘  వేసే  సుమూహూర్తం మీరే నిర్ణయించు కోవాలి , ( ప్రేమ ) పురోహితులను సంప్రదిస్తే , విలువైన దక్షిణ సమర్పించుకోవాల్సి ఉంటుంది ! మీకు అనుమానం గా ఉంటే , ఆమెనే  , మీ బిడియం వదిలి అడిగితే ఉత్తమం ! 
మిగతా ముద్దు,  వచ్చే టపాలో ! 

చుంబన రహస్యాలు. 9. ‘ అధర బంధం ! ‘

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 22, 2013 at 10:23 ఉద.

చుంబన రహస్యాలు. 9. ‘ అధర బంధం ‘ 

 
ఆమె బుగ్గల ముందుకు వంగడం :
నింపాది గా ఆమె బుగ్గల ముందుకు మీరు వంగి, ఆమె రెస్పాన్స్ కోసం వేచి చూడండి. ఇట్లా చేయడం, ఆమె కు సరిపోయినంత సమయాన్ని ఇస్తుంది , ఒక వేళ ఆమెకు ‘ ఆ పని ‘ నచ్చక పొతే , ఆమె కనుక తన చెక్కిలి ని దూరం జరుపుతూ , సంభాషణ ఇంకో దిశ లో కొనసాగిస్తూ ఉంటే , మీరు ఆ ప్రయత్నాన్ని , ప్రస్తుతం విరమించడం మంచిది ! ఇంకో సారి ప్రయత్నం చేయవచ్చు ! అట్లా కాక , ఆమె మీ చుంబ నాన్ని స్వీకరిస్తే  మీరు విజయులయినట్టే ! 
ఆమె బుగ్గల మీద ఉన్న మీ పెదవులను మెల్లిగా ఆమె పెదవుల మీదకు జార్చ వచ్చు . 
మెల్ల , మెల్ల మెల్లగా ! : 
మీ మొదటి ముద్దు ఇచ్చిన తరువాత , విపరీతమైన ఉత్సాహం తో , ఆమె ను మీ శక్తి అంతా  మీ పెదవుల మీద కేంద్రీకరించి , ఆమె పెదవులను గట్టి గా ముద్దాడడం కూడదు !  మొదటి ముద్దులు మెత్త గా సున్నితం గా , తాకీ తాకనట్టు , లేదా కేవలం ఆమె పెదవులను మీరు స్పృ సిస్తున్నట్టు మాత్రమే ఉండాలి ! ‘ సాఫ్ట్ అండ్ లైట్ ‘  ఆమె క్రింది పెదవి ని, మీ రెండు పెదవులతో సున్నితం గా ముద్దాడితే కూడా సున్నితం గానే ! 
నిశ్శబ్దం గా : ముద్దులు కుమ్మరించు తున్నపుడు ,  నిశ్శబ్ద వాతావరణా న్ని  భంగం చేయకండి ! అంటే , ముద్దులు  చ్ చ్ ప్చ్ ,ప్చ్  అని శబ్దం చేస్తూ పెట్టడం కూడదు ! అట్లా చేయడం , ప్రణయ వాతా వరణానికి భంగ కరం ! 
చేతులకు ‘ పని ‘ చెప్పడం : 
ఆమె ను ముద్దాడే సమయం లో, మీ చేతులను, కేవలం మీకు ఇరు వైపులా వేలాడే అవయవాలు గా భావించ నవసరం లేదు ! వాటి పని అవి చేసుకుంటూ పోవాలి ! 
కొన్ని  కీలక ప్రదేశాలు, ఉదాహరణకు : 
ఆమె ముఖం మీద ,
ఆమె చుబుకం అంటే చిన్ మీదా ,
ఆమె శిరోజాలలో,  ఏదో వెతుకుతున్నట్టు ,
ఆమె భుజాల మీదా !
ఆమె నడుము మీదా !  
పైన ఉదహరించిన స్థానాలలో  మీ చేతులు  ఆమెను లావణ్యం గా  పొదివి పట్టుకొని చుంబనం సాగించితే ,  అనురాగం , ఆనందం రెట్టింపవుతుంది !  ఈ విషయం లో ఆమె  ఇంట్రస్ట్ కనుక్కోవడం కూడా ఒక కళ ! అంటే , ఆమెకు పైన చెప్పిన స్థానాలు కాక , మరికొన్ని ‘ కీలక ‘ స్థానాలు ఉండి ఉండ వచ్చు ! అవి మీరే తెలుసుకుని , చిలిపి గా  ఆ యా స్థానాలలో  మీ ‘ పట్టు ‘ ‘ బిగించాలని ‘ ఆమె అనుకుంటే , మీ మెదడుకు కూడా   పని పెట్టాలి మరి, కేవలం పెదవులకే కాక ! 
ఆమె  మీ ముద్దుకు ఉత్సాహ పడుతూ ఉన్నా , బిడియ పడుతూ సిగ్గు గా ఉంటే,   మీరు ముందుగానే ఆమె మీ చేతులతో ఆమె చేతులను మీ భుజాల మీద ఉంచి  ముద్దుకు ‘ ఉపక్రమించ వచ్చు ‘ దీనితో ‘,  మీరే ఆ పని చేస్తున్నారని , ఆమె లో ‘ అపరాధ ‘ భావం తగ్గుతుంది ! 
ఆమె మీ దీర్ఘమైన ముద్దులకు  క్రమం గా అలవాటు పడుతూ ఉంటే , ఇక మరి ఆ ముద్దులలో కొత్త దనం కోసం ప్రయత్నించ వచ్చు !  ఉదా: ఫ్రెంచ్ కిస్! 
వాటి గురించి వచ్చే టపాలో ! 

 

చుంబన రహస్యాలు. 8. ఆమె పెదవులను చేరుకోవడం ఎట్లా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 21, 2013 at 9:06 సా.

చుంబన రహస్యాలు. 8. ఆమె పెదవులను చేరుకోవడం ఎట్లా ? 

క్రితం టపాలలో, చుంబనం ముందు , ఆమె  అనుభూతుల ప్రాంగణం లో, కుతూహల చందనం ఎట్లా చిమ్మాలో తెలుసుకున్నాం కదా ! మరి ఆ తరువాత ?  మరి, మీ ముద్దు స్వీకరిస్తుందో లేదో ఎట్లా తెలుసుకోవడం ? 
1. ఆమె ను తాకి చూడడం : ఆమెను సున్నితం గా తాకితే , ఆ ‘ మెరుపు తీగ ‘,  కరెంటు షాక్ తగిలినట్టు ఉలిక్కి పడుతుందా ?  లేక  మీ స్పర్శ , ఆమె లో కొత్త శక్తి ని ఛార్జ్ చేస్తుందా? అన్న విషయం తెలుస్తుంది !  మరి ఎట్లా తాకాలి ? 
a . ఆమె తో నడుస్తూ ఉన్నప్పుడు ,  ఆమె ముని వెళ్ళను కానీ , ఆమె చేతిని కానీ తాకి, లేదా మెత్తగా పట్టుకోవడం గానీ చేయ వచ్చు ! 
b . ఆమె ప్రక్క న కూర్చున్నప్పుడు , ఆమె చేతులు కట్టుకుని కూర్చోకుండా , చేతులు ఇరు ప్రక్కలా పెట్టి , మీతో సంభాషిస్తున్నపుడు , ఆమె చేతులు పట్టుకోవడం !  
c. ఆమె ప్రక్కగా కూర్చున్నప్పుడు , ఆమె భుజాల మీదుగా మీ చేయి యదాలాపం గా పోనివ్వ వచ్చు !  ఆమె భుజాల మీద సున్నితం గా మీ చేయిని ఉంచి , ఆమెతో సంభాషణం కొనసాగించ వచ్చు , ఏమీ జరగనట్టుగా ! 
d. అదే సమయం లో , ఆమె మీ పొందును అంగీకరిస్తుంటే , ఒక్క సారి  మీ చేతి తోనే మీ అక్కున చేర్చుకోవచ్చు , ఆమెను, వెచ్చగా !   మీ  ఆలింగనం లో వెచ్చదనం చవి చూసిన ఆమెను , ఆ తరువాత , తరచుగా  కౌగిలించుకోవచ్చు ! 
e . ఇక ఆలింగనాలు తరచూ అవుతూ ఉంటే , పెదవులు పులకరిస్తూ ఉంటాయి ! కానీ అందరు వనితలూ , బిడియం తో , తమ పెదవులు మీ పెదవులతో కలవాలని చెప్పరు , కానీ ఈ క్రింది విషయాలు మీరు గమనించ గలిగితే మీరు ‘ సన్మార్గం ‘ లో పడుతున్నట్టే లెక్ఖ ! 
a . ఆమె, తనంత తానుగా , సంభాషణ కొన సాగించడమూ , తరచూ జోక్స్ వేసి మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేయడమూ జరుగుతుంటే !
b . మీ వంక ఓర చూపులు చూడడమూ , మీరు గమనించే లోగా , ఆమె దృష్టి మరల్చుకోవడమూ ! 
c. ఆమె తన పెదవులను , అప్రయత్నం గా కొరుకుతూ  ఉంటే ,  మీ పెదవులను తాకి తన్మయత్వం చెందాలని, తహ తహ లాడుతున్న ఆ పెదవులను , అదుపు లో ఉంచుకోవాలని ఆమె చేస్తున్న ప్రయత్నమే ! 
d . ఆమె తన పెదవులను తరచుగా , తన నాలుక తో తడుపుకుంటూ ఉంటే ! (  ఆ ప్రయత్నం , మీ పొందులో  పరవశించి పోతున్న ఆమె ఆధారాల తడి , ఆరుతూ ఉంటున్నందుకు ! ) 
e . మీరు ఏ విషయమైనా చెబుతున్నప్పుడు కానీ , లేదా మీరు ఆమెను తాకుతున్నప్పుడు కానీ , ఆమె అప్రయత్నం గా మీకు ఇంకా చేరువ అవుతూ , మీ స్పర్శ ను ఆస్వాదిస్తూ ఉంటే ! 
f . ఆమె శ్వాస బరువు గా అవుతూ , ఆమె గుండె చప్పుళ్ళు మీకు వినబడుతుంటే !  మీ అమూల్యమైన , పవిత్రమైన చుంబనానికి సుముహూర్తం సమీపించినట్టే !  
1. ఆ సమయం లో ఆమె చేతిని అందుకుని , ఆ ‘ అమృత హస్తం’ వెనుక భాగాన,  అతి సున్నితం గా  ఒక ముద్దు ఇవ్వడం  ఆమెకు బాగా రుచిస్తుంది ! ఒక్క సారిగా కౌగిలి నుంచి ఆమె పెదవులను ‘ ముట్టడి ‘ చేయడం కన్నా ! 
2. ఆ తరువాత కూడా పెదవుల ను చేరుకోవాలని ఆతృత పడే  మీ పెదవులను, హద్దులు దాటనీయ కుండా , ఆమె చెక్కిలి మీద ముద్దాడడం చేయడం శ్రేయస్కరం ! ఇక్కడ మీ పెదవులు కేవలం ఆమె చెక్కిలి ని కేవలం తాకుతున్నంత సున్నితం గా ఉండాలి ఆ చుంబనం ! 
3. ఇప్పుడు, తరువాతి ప్రయత్నం చేసే ముందు ఆమె కళ్ళ లోకి  చూడండి ! ఆమె మీ కళ్ళతో తన కళ్ళు కలిపి  ‘ నయన బంధనం ‘ జరిపితే , మీరు చుంబనం నిరభ్యంతరం గా చేయవచ్చు ! అదే ఆమె తన దృష్టి మరల్చి , మాట కూడా మారుస్తూ ఉంటే , ఆమెకు ( కనీసం ప్రస్తుతం ) ఆ ఆసక్తి లేదని అనుకోవాలి ! 
 
మరి అసలు చుంబన ముహూర్తం వివరాలు  వచ్చే టపాలో తెలుసుకుందాం ! 
 
 

చుంబన రహస్యాలు.7. సరస సంభాషణం ……

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 19, 2013 at 8:40 సా.

 చుంబన  రహస్యాలు.7. సరస సంభాషణం …… 

ప్రపంచం లో ప్రతి వారూ , ప్రశంసా పాత్రులే !  అందుకు యువతులు మినహాయింపు కాదు !  చక్కని ప్రశంస లు, యువతులు మీ మీద మక్కువ పడే లా చేయగలిగే మంత్ర దండాలు !
 మరి ఆ ప్రశంస లు ఎట్లా చేయాలి ?
ప్రశంస ఎప్పుడూ కృత్రిమం గా ఉండకూడదు ! మీకు  ‘ ఆమె ‘ లో నిజం గానే నచ్చిన  విషయాన్ని తీసుకోండి ! ఆమె లో ఉన్న ఆ లక్షణం, మీకు నిజం గానే, బాగా నచ్చి ఉండాలి ! ఉత్తుత్త గా కాదు !  ఆ ప్రత్యేకత ఆమె లోనే మీకు కనబడాలి ! మీ ఇరువురికీ పరిచయమున్న ఇతర అమ్మాయిల తో పోలిస్తే !  అట్లాంటి ప్రశంస , సహజం గానే బాగుంటుంది ! మీరు, ఆమెను పొగడడానికై చేసిన ప్రశంస లా ఉండదు !  ప్రశంసించే సమయం లో చేయ కూడనివి :ఆమె వక్షోజాలను కానీ , ఆమె ఫిగర్ ను కానీ , లేదా ఆమె బరువు ను కానీ , ప్రశంసించడం చేయకూడదు !  మీరు ఆమె చూపుల గురించి కనుక ప్రశంసిద్దామని అనుకుంటే , మీరు ఫోకస్ చేయ వలసినది , కేవలం ఆమె కళ్ళూ , కేశాలూ , ఇంకా ఆమె చిరు నవ్వు మాత్రమే , మిగతా డిపార్ట్ మెంట్ ల వైపు మీ దృష్టి మరల్చ కండి !  మీ ప్రశంస కేవలం , కొన్ని పదాలతోనే ఏమాత్రం  ( ఆమె ) గుర్తు ఉంచుకోవడానికి వీలు లేనిది గానో , లేదా త్వరగా మరిచి పోయేది గానో ఉంటే , ఉపయోగం ఏముంటుంది ?  నీ  చిరునవ్వు  తళ తళా వెన్నెల లా మెరిసి పోతున్నాయి ! అని కానీ , నీ  నవ్వు ప్రపంచం లోనే నాకు అతి ఇష్టమైన శబ్దం ! అని కానీ , నిజం గానే  నా జీవితం లో ఇప్పటి వరకూ నీ అంత అందమైన సృష్టి ని చూడలేదు ! అని కానీ !  అంటే , ఆమె పెదవులు, మీ పెదవులలో చాక్లెట్ లా కరిగిపోవాలని పరవశిస్తాయి ! అంతే కాక , ఆమె చాలా కాలం మీ ప్రశంస లను గుర్తు పెట్టుకుంటుంది కూడా ! 
మరి పై ప్రశంసలు ఏ టోన్ లో చెప్పాలి ? 
‘ అహో అమ్మాయీ ,  నీ చిరు నవ్వులు తళ తళా వెన్నెల లా మెరిసి పోవుచున్నవి ఎందువలన వనితా ? ‘ అని ఏ ఇంద్రలోకం లో ఇంద్రుడు అన్నట్టు అంటే ఊహించుకోండి , ఆ సందర్భం ఎట్లా ఉంటుందో ! లేదా ‘ నిజం గానే నా జీవితం లో ఇప్పటి వరకూ నీ అంత అత్భుతమైన సృష్టి ని చూడలేదు ‘ అని చక చకా , పరీక్షలో, పాఠం వల్లించినట్టు చెబితే , ఎట్లా ఉంటుంది !  బాగానే ఉంటుందేమో కానీ , ప్రేమ పరీక్ష లో పాసవడం మాత్రం జరగదు !  అందుకే , చెప్పే మూడు మాటలూ , ప్రేమ మయం గానూ , రమణీయం గానూ చెప్ప డానికి ప్రయత్నించండి ! కొద్దిగా స్వరం తగ్గించి చెప్పడం మంచిదంటారు ! అట్లాగే కొద్దిగా ‘ ఆమె వైపు వంగి చెప్పడం కూడా మంచిదంటారు ! ఇంకా కొద్ది గా ముందుకు పోయి , ఆమె ప్రక్కకు వంగి , ఆమె చెవి దగ్గరగా తగ్గు స్వరం తో చెబితే కూడా , ఆ విషయం , వ్యక్తి గతం గా అంటే ప్రైవేట్ గా ఉండడమే కాకుండా , మీరు ఆమె కు ఇష్టమో   లేదో కూడా ఇట్టే    తెలిసి పోతుంది ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

చుంబన రహస్యాలు.6. చుంబనానికి ఇంధనం, సరస సంభాషణం !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 18, 2013 at 9:10 సా.

చుంబన రహస్యాలు.6. చుంబనానికి ఇంధనం, సరస సంభాషణం ! 

 క్రితం టపాలో, ముద్దుకు మూడ్ తీసుకు రావడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం కదా !  సమయోచితం గా , సందర్భానుసారం గా మూడ్ క్రియేట్ చేస్తే, ముద్దు ల కోసం  ఆమె ముఖం అరవిందం లా  వికసిస్తుంది !  అప్పుడు, మీరు తేనెటీగ అయి, ఆ అరవిందం లో మకరందాన్ని గ్రోల వచ్చు !  కుట్టకుండా, గుట్టు చప్పుడు కాకుండా ! కానీ , సమయ సందర్భాలు ఆలోచించకుండా , మీరు ‘ ఆమెను ‘ ముద్దు పెట్టుకుందామని చేసే ప్రయత్నాలతో, ఆమె ముఖం కంద గడ్డ లా ఎర్రబడి , మీ ‘పని’ గోవిందా అవుతుంది ! ఇప్పుడు తెలుసుకోవలసిన ఇంకో ముఖ్య విషయం:  మీరు ‘ ఆమె తో చేసే సంభాషణ , ప్రత్యేకించి,  సరస సంభాషణ ,  ‘ ఆమె ‘ లో చుంబన భావాలు జనించడానికి , ఇంధనం అవుతుంది ! ధరల పెరుగుదలలూ  ,  ట్రాఫిక్ ప్రమాదాలూ , లేదా మరణాలూ , ఇట్లాంటివి  సహజమైన  యదార్ధ జీవిత సంఘటనలే అయినా , ముద్దు ప్రయత్నాల ముందు , ఇవన్నీ ,  వ్యర్ధమైన సంభాషణ లే ! అంటే , మీరు ముద్దు పెట్టుకుందామనుకునే  ‘ఆమె ‘ కు ఇవన్నీ అనవసరమైన సంభాషణ లే ! ‘ ఆమె ‘ కు ఇవన్నీ భయాందోళనలు కలిగించి , మనోభావాలను గాయ పరుస్తాయి ! పాఠం : ‘ ఆమె ‘ కు ఆందోళన నూ , దుఃఖాన్నీ కలిగించి ,  ఆమె  హృదయాంతరాళం లో విషాద ఛాయలు ఆవరింప చేసే సంభాషణ చేయకూడదు ! ప్రత్యేకించి , మీరు ‘ ఆమె ను ముద్దు పెట్టుకుందామని , ఆ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు  అసలే చేయకూడదు !  

మీరు చేయకూడనివి ఇంకా కొన్ని ఉన్నాయి ! 
1. ఆమె తో ఇతర యువతుల గురించి కానీ , వారి అందాల గురించి పొగడడం గానీ చేయకూడదు ! 
2. మీ జీవిత సమస్యలూ , మీరు అందువల్ల ఎంత అసంతృప్తి గా జీవితం గడుపుతున్నదీ , లేదా మీకు ఇష్టం లేనివీ , ఇవన్నీ కూడా కంప్లైంట్ లు చేయడం కిందకు వస్తాయి !  అందువల్ల ఈ విషయాలు కూడా ‘ ఆమె ‘ తో మాట్లాడ కూడదు, ప్రత్యేకించి ఆమె కు మీ ముద్దు ఇద్దామను కుంటున్నప్పుడు !
3. మీరు సామాన్యం గా , ఇతర మగ స్నేహితులతో చర్చించే విషయాలు , ఆమె తో చర్చించ కూడదు ! 
4. మీ దేహ ధర్మాల గురించి అంటే చెమట పోయడం , నిద్ర గురక పెట్టి పోవడం , ఊపిరి పీల్చుకోవడం లాంటి శరీర ధర్మాల గురించి ‘ ఆమె ‘ తో చర్చించడం కూడదు !  
మరి మాట్లాడ వలసిన విషయాలు ఏముంటా యి ? పైన చెప్పినవన్నీ చేయక పొతే ? !!! అని మీరు అనుకుంటున్నారు కదా ! ఈ క్రింది ముఖ్యమైన  విషయాలు గమనించండి ! 
1. మీ సంభాషణ  అంతా  ‘ ఆమె ‘ గురించే అయి ఉండాలి ! 
2. ఆమె ను ప్రశంసించండి ! ఉదా:  ‘ ఎంత బాగున్నావు !!! ‘ 
3. ఆమె మనసు తెలుసుకోండి !  అది అంత సులభం కాదు ! చాలా సమయాలలో, అది భగీరధ ప్రయత్నం అవ వచ్చు !  అందుకు సన్నద్ధులు కండి ! 
4. మీ ఇరువురిలో కామన్ లక్షణాలు బేరీజు వేయండి !  ఆమెతో ! 
5. మీకు మాటలు తోచక పొతే ( ఒక్కో సమయం లో, మీరు, ‘ ఆమె’  బౌలింగ్ చేయక పోయినా , కొన్ని క్షణాలు క్లీన్ బౌల్డ్ అవుతూ ఉంటారు , ఆ సమయం లో మీకు మాటలు రావు ! ) అప్పుడు , ఆమె హేర్ స్టైల్ బాగుందని ప్రశంసించండి  ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !  
 

చుంబన రహస్యాలు.5. ముద్దు కు, మూడ్ ఎట్లా సిద్ధం చేయాలి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 17, 2013 at 12:22 సా.

చుంబన రహస్యాలు.5. ముద్దు కు, మూడ్ ఎట్లా సిద్ధం చేయాలి ? 

రోజు లో ఇరవై నాలుగు గంటలు ! అందులో  ఓ పది గంటలు నిద్ర , తయారవడానికీ, తినడానికీ  , సరిపోతాయనుకుంటే ,  కనీసం మూడు నాలుగు గంటలు ప్రయాణాలకు ! ఇక మిగిలిన సమయం కాలేజీ లోనో , లేదా ఆఫీస్ లోనో ! (  కలిసి, ఇంటికి చేరే ప్రేమ పావురాలను మినహాయిస్తే ! ) మరి ముద్దు కు సమయం ఎప్పుడు ? ఎక్కడ ? 
ముద్దు ఎక్కడ పడితే అక్కడ పెట్టడం ఎంత వరకూ సమంజసం ! మీరు పెట్టే ముద్దు ‘ ఆమె ‘ మది లో పది కాలాల పాటు ఉండి పోవాలంటే ,  ఆ ముద్దు కు సమయం, స్థానం , సందర్భం అన్నీ కలిసి వస్తేనే  !  మరి  ఆ  విలువైన ముద్దు కు మూడ్ ఎట్లా తీసుకు రావాలి ? 
ప్రణయ వాతావరణం :  వాతావరణం, మేఘావృతమై అధిక వర్ష పాత సూచన ఉంటే , అన్ని చోట్లా అది ప్రణయ వాతావరణం అవదు కదా ! మీరు  ఆ సమయం లో, ఒక వెచ్చని వర్షం పడని ప్రదేశం లో ఉంటే , అది ఒక  ప్రణయ స్థానమే !  ఒక  ప్రణయ వాతావరణం సహజం గా, ‘ సంజె చీకట్లలో , సూర్యాస్తమయ సమయం లో ‘ అని అనుభవజ్ఞులు ప్రవచించారు !  అందుకే , మీ మదిలో మెదిలే మధుర భావనలను , మీకు నచ్చిన ‘ ఆమె ‘ కు, మీ చుంబనం రూపం లో తెలుప డానికి, సంజె వెలుతురూ , లేదా  బాగా కళ్ళు మిల మిల లాడే లా కాకుండా , లో లైట్ అంటే తక్కువ వెలుతురు లైట్లు అమర్చి ఉన్న ప్రాంతం , ఏదైనా కూడా  , ఎదలు గుస గుస లాడడానికి మంచి వాతావరణమే ! మీకు మంచి వ్యూ పాయింట్ కనుక దొరికితే , సూర్యాస్తమయ సమయం అత్భుతం గా ఉంటుంది ! ఆమె మది లో ప్రేమ భావనలు ఉదయించడానికి !  పున్నమి వెన్నెల కూడా ! చంద్రుడి  కాంతి లో ( మీ !  )  ‘ కాంత ‘ , కలువ కన్నులతో , కాంచనం లా మెరుస్తూ ఉంటుంది !  ఆ మెరుపు కు, మీ ముద్దు మెరుపు ను జత చేయడం  రొమాంటిక్ గా కూడా ఉంటుంది !  మీరు ‘ ఆమె ‘ తో కూడా కనుక నడుస్తూ ఉంటే , వీధి దీపాల చిరు  వెలుతురు కూడా , ఆమె లో నులి వెచ్చని భావనలు చెల రేగ డానికి ,  మీ ఇరువురిలో ఆ కొజీనెస్ సృష్టించడానికి ఎంతో అవకాశం ఉంటుంది !   మీరిరువురూ ,  ఒక పిక్నిక్ లేదా టూర్ లో కనుక ఎంజాయ్ చేస్తూ ఉంటే ,  సాయం సమయం లో , వెచ్చని నెగళ్ళ మంట ముందు , ఆ మంటల నాట్యం చూస్తూ , ‘ ఆమె ‘ కళ్ళ లో చూస్తూ , మాట్లాడుతూ ఉంటే , ఆ ప్రణయ వాతావరణమూ, ‘ ఆరాధనా ‘ భావం తో  , మంచి మూడ్ క్రియేట్ అవుతుంది , ముద్దు కు !  ఒక హాల్ లోనో, హోటల్ లోనో, మీరు, ‘ ఆమె ‘  ఒక టేబుల్ దగ్గర కనుక నిశ్శబ్దం గా చేరుకున్నాక  , మీ మధ్య ఉన్న కొవ్వొత్తి  లో మైనం కరుగుతూ , వెలుతురు చిమ్ముతూ ఉంటే ,  ‘ ఆమె ‘ మౌనం,  మధురం గా  ఉంటుంది !  అదీ ప్రణయ వాతావరణమే ! 
వచ్చే టపాలో ఇంకొన్ని ముద్దు సంగతులు ! 

చుంబన రహస్యాలు .4. ‘ ఆమె ‘ కు ముద్దివ్వడం ఎట్లా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 16, 2013 at 10:48 సా.

చుంబన  రహస్యాలు  .4. ‘ ఆమె ‘ కు ముద్దివ్వడం ఎట్లా ?  

 
యుక్త వయసు వచ్చిన యువకులకూ , యువతులకూ , ముద్దు పెట్టాలనీ , ముద్దు స్వీకరించాలనీ కోరికలుండడం సహజమే ! వారుండే దేశ కాల పరిస్థితుల బట్టి , వారు ఎప్పుడు , ఎక్కడ , ఏ సందర్భం లో ముద్దు పెట్టుకుంటారనే విషయం ఆధార పడి  ఉంటుంది ! ఈ టపాలో విషయాలు కొన్ని ఆంగ్ల వ్యాసాల నుంచి గ్రహింప బడింది ! ఇది ఎవరెవరికి వర్తిస్తుందనే విషయం , వారి విజ్ఞత కే  వదిలేయడం జరుగుతుంది. ఈ విషయాలు తమకు వర్తించని వారు కూడా సరదా గా చదువుకోవచ్చు , ఈ టపాను , వారికి ఉత్సాహం  ఉంటే !  ఒకటి మాత్రం నిజం : సృష్టి లో, చుంబనం , యువతీ యువకులూ ,  స్త్రీ పురుషులూ , పరస్పరం ,తమ   ఆనందానుభూతులను పంచుకునే ఒక సహజ మైన చర్య ! ఇరువురూ ఇష్ట పడి , చేసిన చుంబనం ,  వయసు తో పాటుగా , వారి పరిణితి నీ తెలియ చేస్తుంది ,  తీయటి అనుభూతినీ మిగులుస్తుంది ! 
మరి మీరు ‘ ఆ ‘ యువతి ని ముద్దాడు దామని అనుకుంటే ఏం చేయాలి ? 
ఇక్కడ మీరు తడబడేది రెండు విషయాలలో !  ‘ ఆ ‘ అమ్మాయి కి మీరంటే ఇష్టమో లేదో మీకు తెలియదు ! మీకు  ‘ ఆ ‘ అమ్మాయికి  ముద్దు ఇవ్వడం ఎట్లాగో తెలియదు !  నిజమే ! కొన్ని సమయాలలో ముద్దు పెట్టడం రాకెట్ ను అంతరిక్షం లోకి పంపడమంత సులభం కాదు ! మరి కొన్ని సమయాలలో రాకెట్ ను అంతరిక్షం లో కి పంపడం కన్నా ముద్దు పెట్టడం  కష్టమే !  కానీ మీరు ‘ ఆమె ‘ కు మీ ముద్దు ఇవ్వడం లో కనుక విజయం సాధిస్తే , మీరు అంతరిక్షం లోకి రాకెట్ లో  వెళ్ళ క పోయినా  చంద్రుడి మీద వాలుతారు ! 
ఏకాంతం,  అయస్కాంతం  : ప్రేయసీ ప్రియులకు ఏకాంతం,  ఒక అయస్కాంతం అవుతుంది ! మీరు మీ స్నేహితుల ముందు , మీ వీరత్వాన్ని ప్రదర్శిద్దామనుకుని , ‘ ఆమె ‘ ను ముద్దు పెట్టుకోవడం కానీ , అతి చనువు గా ఉండడం కానీ   చేశారంటే , మీరు పప్పులో కాలేశారన్న మాటే !  మీరు కేవలం ‘ ఆ ‘ అమ్మాయిని మీరు సాధించిన ఒక బహుమతి గా మీ స్నేహితులకు చూపిస్తున్నారన్న మాటే ! అది మీరు వలచిన  వనిత కు ఎంత మాత్రమూ నచ్చదు ! అందుకే , ‘ ఆమె ‘ తో పొందుకు , ఏకాంతం , కేవలం , మీరూ , ఆమే  ఉన్న ఏకాంతం అతి ముఖ్యం !   ఆమె కనుక ఆమె  గ్రూపు లో ఉంటే , కొద్ది సేపు ఆగమని ప్రాధేయ పడండి ! మీరూ , ఆమే , ఒక పార్టీ లో కలుస్తే , లేదా చాలా మంది కలిసిన ఒక మీటింగ్ లో కలిసినా ,  ‘ కాస్త ఫ్రెష్ ఏర్  కోసం బయటకు వెళ్దామా ? ‘ అంటూ మీ ‘ బుద్ధి ‘ బయట పెట్టండి ! ‘ ఆమె ‘ మీరుండే ప్రాంతం లోనే ఉంటుంటే ,  ‘ మీ ఇంటి దాకా ( మీతో ) నడిచి  దింపనా ? ‘ అని అడగడం కూడా ఒక పధ్ధతి ! (  మీ కాలేజ్ దగ్గరే ఆమె తండ్రి   ఆమె ను పికప్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటే , మీకు ఈ పధ్ధతి  సరి అయినది కాదు ! కారణాలు వివరం గా చెప్ప నవసరం లేదనుకుంటా ! పై  ఉపాయాల తో మీరు సఫలం అవక పొతే ,  మీరు నేరుగా  ‘ ఆమె ‘ ను మీరు ముందే నిర్ణయించుకున్న ప్రదేశానికి   మీతో రమ్మని ఆమెను అడగ వచ్చు ! 
( వార్నింగ్ :  ఈ టపా , కేవలం యువతీ యువకులు, పరస్పరం ఇష్ట పడితే నే వర్తిస్తుంది ! హద్దు మీరి ప్రవర్తించి, సమస్యలు సృష్టించి , సమస్యలు కొని తెచ్చుకుంటే , అందుకు పూర్తి బాధ్యత వారిదే ! )   
వచ్చే టపాలో ఇంకొన్ని  ఉపాయాలు ! 
 
%d bloggers like this: