చుంబన రహస్యాలు. 1.
ఒక గొప్ప ముద్దు, ప్రపంచాన్నే కరిగిస్తుంది ! తనువును తహ తహ లాడిస్తూ , కామ కోరికలు రేపుతుంది ! నేర్పు కల అతివలు , మొదటి ముద్దును రుచి చూసి , తాము కోరుకున్న వారితో బంధం , కల కాలం సాగుతుందో , లేక తెగుతుందో , ఇట్టే చెప్ప గలరు ! అంతటి మహత్యం ఆపాదించ బడింది, ఒక‘ చిరు ‘ చుంబనానికి !
తనివి తీరా పెట్టే ఒకే ఒక్క ముద్దు తో , తనువులో అనేక రకాల జీవ రసాయన ప్రక్రియలు చెల రేగుతాయి ! ఈ క్రియలన్నీ కూడా శరీరానికీ , మనసుకూ కూడా అనేక విధాలు గా ఆనందం చేకూరుస్తాయి ! తరచూ , ముద్దులు గుప్పించుకునే ప్రేయసీ ప్రియులు , ఎక్కువ ఆరోగ్య వంతం గానూ , ఆనందం గా నూ ఉండగలుగుతున్నారు ! ప్రతి ముద్దూ , నిమిషానికి రెండు క్యాలరీల శక్తి తీసుకుని , అధిక బరువును కూడా తగ్గిస్తుంది ! కాక పొతే నిదానం గా ! ( ట్రెడ్ మిల్ మీద పరిగెత్తితే, మనం నిమిషానికి పదకొండు క్యాలరీల వరకూ ఖర్చు పెడతాము ! ).
హడావిడి గా ఎడా పెడా ముద్దులు కుమ్మరిస్తూ , అటూ ఇటూ కదులుతూ , ప్రేయసిని ఉసి కొలుపుతూ , కసి గా ప్రవర్తించే వారు , వడి వడి గా నడిచే వారి తో సమానం గా క్యాలరీలు ఖర్చు చేస్తారని శాస్త్రజ్ఞుల ఉవాచ ! ఇక్కడ చుంబన సూత్రం ఏమిటంటే : ఆవురావురు మంటూ మధువు గ్రోలుతూ, మధువు ( ముద్దు రూపం లో ) ఇస్తూ ఉంటే , మధువు ( షుగరు ) కూడా వినియోగం అవుతుందని ! ఫ్రెంచి ముద్దులు పరస్పరం సమర్పించుకునే ప్రేయసీ ప్రియుల లో మంచి రోగ నిరోధక శక్తి పెంపొందు తుందని కూడా విశదం అయింది ! ఫ్రెంచి ముద్దులు, కేవలం ఫ్రెంచి వారి హక్కు కాదని ఇతర దేశాల వారంతా గమనించాలి ! ( ఈ ఫ్రెంచి ముద్దుల కదా కమామీషూ ముందు ముందు టపాలలో తెలుసుకుందాం ! ) మెత్తగా , ‘పుత్తడి బొమ్మకు’ పెట్టే ముద్దు , మానసిక వత్తిడి ని కూడా తగ్గించి కోరికలను ఎక్కడికో తీసుకు పోతుందని స్టాన్ఫర్డ్ లో వత్తిడి మేనేజ్ మెంట్ నిపుణుడు రాడ్నీ డేంజర్ ఫీల్డ్ గారి అభిప్రాయం !
కామ వాంఛా , కామ పూరితమైన స్పర్శా , కామానుభూతీ , ఈ మూడు లక్షణాలూ , మానవుల ఆరోగ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయని, సియాటిల్ సెక్సాలజిస్ట్ జాయ్ డేవిడ్సన్ గారి ఒపీనియన్ ! ఆమె ఇంకా ‘ చుంబనం తో ఒక అత్భుతమైన కామ యాత్ర మొదలవుతుంది ! ప్రత్యేకించి , మనసు పడిన వారితో జరిపే ఈ కామ యాత్ర లో , శరీరమంతా ఆనంద డోలి కల్లో తేలుతుంది ‘ అని అన్నారు ! వీరి మాటల్లోనే ‘ తదేకం గా , ఏకాగ్రత తో చేసే చుంబనాన్ని ‘ కామ ధ్యానం ‘ అని చెప్పుకోవచ్చు ! సామాన్యం గా యోగ ధ్యానం లో పొందే ఆందోళనా రహితమైన , మానసిక ప్రశాంత స్థితి ని ఈ కామ ధ్యానం ( చుంబన ధ్యానం అనవచ్చేమో ! ) లో పొందవచ్చు ! యోగ ధ్యానం లో జరిగే జీవ రసాయన చర్యల లాగే , చుంబన ధ్యానం లో కూడా కలుగుతాయి’ !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !