అబ్సెసివ్ వ్యక్తిత్వం.3.
అబ్సెసివ్ వ్యక్తిత్వం ఉన్న వారు నిరంతరమూ , తామూ , తమ పరిసరాలూ ,అతి శుభ్రం గా ఉంచుకోడానికి తాపత్రయ పడుతూ ఉంటారు. ఈ తాపత్రయం ఎంత వరకూ పోతుందంటే , వారు చేపట్టిన పనులు, నిదానం గా చేస్తూ ఉంటారు. అంతే కాక , ఈ విధం గా నిదానం గా చేస్తూ ఉండడం వల్ల , పనులు కూడా పూర్తి చేయ లేక పోతారు.వారు చేస్తున్న పని మీద వారు అన్ని సమయాలలోనూ సంపూర్ణమైన నియంత్రణ ఉండాలని చూస్తారు. వారు ప్రతి పనీ ఇట్లా చేస్తూ ఉండడం వల్ల , వారు పని చేస్తున్న ఏ చోట నైనా , ఇతరులతో సత్సంబంధాలు ఏర్పరుచుకోలేక పోతారు.కారణం ఏమిటో మీకు తెలిసే ఉంటుంది.ఇతరులు వీరి పనిచేసే పధ్ధతి ని అంత శులభం గా ఆమోదించలేరు, సహించ లేరు కనుక. ! వారి పని చేసే తీరు రిజిడ్ గా అంతే అత్యంత కఠినం గా ఉండడం వల్ల, అంటే ఏమాత్రమూ ,రాజీ పడక పోవడం వల్ల కూడా, ఇతరులు వీరిని , వీరి పని తీరునూ అంగీకరించ లేరు. దీనితో, ఈ అబ్సెసివ్ వ్యక్తిత్వం ఉన్న వారు , ఎక్కువ మంది స్నేహితులూ , శ్రేయోభిలాషులు లేక, జీవితం లో చాలా వత్తిడి , లేదా టెన్షన్ అనుభవించుతూ ఉంటారు. అంటే వారి ప్రవర్తన వల్ల , వారితో స్నేహం చేయడానికీ, సహకరించడానికీ , ఇతరులు అంత శులభం గా ఉత్సాహం చూపరు. ఈ వ్యక్తిత్వం కల వారు, ఒక పట్టాన రిలాక్స్ అవలేరు.అంటే మిగతా వారు ,తీసుకుంటునట్టు, పనిలో విరామం తీసుకోలేరు. అదే పని గా పని చేస్తూ ఉంటారు, రాటపాకుల లాగా ( ఈ పదం ఈ కాలం లో చాలా తక్కువ గా ఉపయోగిస్తూ ఉంటారు కానీ నిరంతరం పని చేసే వారిని కానీ , విరామం లేకుండా ఆడుతూ తిరిగే పిల్లలను కానీ ‘ రాటపాకుల లాగా ‘ అంటారు. అంటే నూలు వడికే రాట్నం తిరుగుతూ ఉంటే దానికి ఉన్న చక్రం కూడా నిరంతరం తిరుగుతూ ఉంటుంది కదా , ఆ విధం గా ) వారు ఎక్కడ పని చేస్తున్నా , ఆ పని యొక్క వివరాలు అన్నీ కాచి వడ పోస్తారు. అంటే ఆ పని నిబంధనలు అన్నీ కూడా వారికి కొట్టిన పిండి. అంటే ఒక అక్షరం కూడా పొల్లు పోకుండా నేర్చుకుని , ఆ పనిని అంతే జాగ్రత్త తో చేస్తూ ఉంటారు. వారు చేయవలసిన పనిని కూడా ఆ నిబంధనలకు తగిన విధం గా ఏ మాత్రం లోపం లేకుండా చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారిని ఒక విధం గా ‘ పర్ఫెక్షనిస్ట్ లు’ అనవచ్చు .’ రూలంటే రూలే ‘ ! అంటూ ఉంటారు. ఈ రకమైన పర్ఫెక్షనిజం వల్ల వారు పనులను సకాలం లో పూర్తి చేయలేక పోతారు. వారు ఉండే ఇంటిలో కూడా వారు ఈ రకమైన పర్ఫెక్షనిజం వల్ల , ప్రతి పనినీ అతి జాగ్రత్తగా, అతి నిదానం గా చేస్తూ , ఆ పనులకు అధిక సమయాన్ని వెచ్చిస్తూ కూడా ఉంటారు. వారికి ఉండే ఇంకో లక్షణం ఏమిటంటే , వారి ఇంటిలో ప్రతి వస్తువుకూ , ఒక ప్రత్యేకతను ప్రతి పాదించి, అంటే సెంటిమెంటల్ వ్యాల్యూ తో చూస్తూ , ఏ వస్తువు నూ పార వేయకుండా ,ఇంట్లో పోగు చేస్తూ ఉంటారు ( ఈ లక్షణాన్ని హోర్డింగ్ అంటారు, ఆంగ్లం లో ) అంటే వారు, వారికి ఏమాత్రం ఉపయోగం లేని వస్తువులను కూడా , ఇంట్లోనే ఉంచుకుని , ఇల్లంతా ఇరుకు అవుతున్నా ఏమాత్రం లెక్క చేయరు. వారు ఆర్ధికం గా ఖర్చు పెట్టగలిగే పరిస్థితిలో ఉన్నా కూడా ,’ పిల్లికి బిచ్చం పెట్టడు’ అని ఇతరులతో అనిపించుకుంటారు.అంటే పరమ లోభి గా ఉంటారు.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !
good