మనలో ఉత్తేజం గురించి మ్యాస్లో ఏమన్నాడు ?.4.
అమెరికన్ సైకాలజిస్ట్ , అబ్రహం మ్యాస్లో 1943 లో మానవులలో ఉత్తేజం మీద ఒక థియరీ ప్రచురించాడు. ఆయన మానవులలో ఉత్తేజం కలిగించే కారణాల గురించి విస్తృతం గా పరిశీలనలు చేశాడు. ఆయన తన పరిశీలనల లో , తమ సమకాలీనులు, అత్యంత ప్రతిభావంతులు అయిన ఆయిన్ స్టీన్ , ఎలేనార్ రూస్వేల్ట్ , మొదలైన వారిని, అంతే కాకుండా అమెరికన్ కాలేజీలలో చదివే అత్యంత ప్రతిభావంతులైన విద్యార్ధులు ఒక శాతం మందిని కూడా క్షుణ్ణం గా పరిశీలించి, తనదైన మోటివేషన్ థియరీ ని ప్రచురించాడు. దీనినే మ్యాస్లో థియరీ అఫ్ హుమన్ మోటివేషన్ – లేదా మ్యాస్లో హైరార్కీ అఫ్ నీడ్స్ ‘ అంటారు. మ్యాస్లో ప్రతిపాదించిన ఈ థియరీ ని హ్యుమనిస్టిక్ థియరీ అని కూడా అంటారు.
మ్యాస్లో హైరార్కీ అఫ్ నీడ్స్ : ఉత్తేజం మీద అత్యంత ప్రముఖమైన థియరీ లలో ఒకటి గా భావింప బడుతున్న, ఆసక్తి కరమైన , ఈ మ్యాస్లో హైరార్కీ అఫ్ నీడ్స్ గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి !
మ్యాస్లో ప్రకారం, మానవులలో ఉత్తేజం అనేక అంచెలు గా ఉంటుంది. దీనిని మ్యాస్లో ఒక పిరమిడ్ గా వర్ణించాడు. ఆ పిరమిడ్ లో అడుగు భాగాన, మానవుల బేసిక్ నీడ్స్ అంటే ప్రాధమిక అవసరాలను పొందు పరిచాడు( అంటే నీరు , ఆహారం , నిద్ర లాంటివి ) . ఆ తరువాత , రక్షణ లేక భద్రత, ఆ తరువాత , స్నేహం ,కుటుంబం, ప్రేమ, కామ వాంఛ, ఒక వ్యక్తికో , ఒక సంఘానికో చెందాలనుకునే కోరిక, ఆ తరువాత సాధించాలనే తపన , సంఘం లో గౌరవం, ఆ తరువాత పిరమిడ్ కు శిఖర భాగం లో క్రియేటివిటీ , అంటే తాము నేర్చుకున్న కళల లో, విజ్ఞానం లో , నైపుణ్యం లో అత్యున్నత శిఖరాలు అధిరోహించడం , తమ పరిమితులు తెలుసుకోవడం , తారతమ్యం లేకుండా ,తోటి మానవులనందరినీ సమానం గా భావించడం, ఇలాంటి లక్షణాలు ఉంచాడు . పైన పటం చూడండి. గమనించ వలసిన విషయం ఏమిటంటే , మానవులు ఈ పిరమిడ్ లో ఒక్కో అవసరమూ సాధిస్తూ , తరువాతి అవసరం కోసం ఉత్తేజం పొందు తున్నారన్న మాట. అంటే ఒకసారి మనకు తినటానికి సరిపడినంత ఆహారం , ఉండడానికి నీడ , అంటే ఇల్లు , సరి అయిన నిద్ర , కామ వాంఛ లో సంతృప్తి – ఇవన్నీ సాధించిన తరువాత, వాటి కోసం ఉత్తేజం సన్న గిల్లుతుంది. అప్పుడు, పిరమిడ్ లో తరువాత ఉన్న , భద్రత , కోసం ఉత్తేజం పొందుతామన్న మాట. ఒకసారి భద్రత సాధిస్తే, ఆ తరువాతి లక్ష్యాన్ని , లేదా గమ్యాన్ని చేరుకోవడానికి ఉత్తేజం పొందుతామన్న మాట ! ఈ పిరమిడ్ లో అత్యున్నత శిఖరం లో ఉన్న లక్ష్యాన్ని ‘ self actualisation ‘ అంటే మనల్ని మనం అన్ని విధాలుగా సంపూర్ణం గా తెలుసుకోవడం. అంటే మన శక్తి సామర్ధ్యాలను సంపూర్ణం గా బహిర్గతం చేసుకొని వాటి ఫలితాలను కూడా ప్రత్యక్షం గా చూడ గలగడం.
మ్యాస్లో చెప్పిన మిగతా ఆసక్తికర విషయాలు వచ్చే టపాలో తెలుసుకుందాము !