స్థిత ప్రజ్ఞత కు సప్త సూత్రాలు. 2.
క్రితం టపాలో స్థిత ప్రజ్ఞత అంటే ఏమిటో చూశాము కదా ! నవీన మానవ జీవితం లో, స్థిత ప్రజ్ఞత ప్రాముఖ్యత ఇంకా ఎక్కువ అయింది. అనేక రకాలైన వత్తిడులనూ తట్టుకొని, మానవులు ప్రతికూల పరిస్థితులలో జీవనం సాగిస్తున్నారు. ఇంకో విధం గా చెప్పాలంటే, ప్రతికూల పరిస్థితులూ, అననుకూల పరిస్థితులూ, ఘర్షణా,ప్రస్తుత మానవ జీవితాలలో అను నిత్యం ఉంటున్నాయి , కారణాలు ఏమైనప్పటికీ ! మరి ఈ ఘర్షణ మయ జీవిత సాగర మధనం చేస్తూ, అందులో నుంచి అమృత మయ మైన ఆనందాన్ని పొందడానికి స్థిత ప్రజ్ఞత ఎంతగానో ఉపయోగ పడుతుంది మనకు. ఎక్కడో తపో వనాలలో కూర్చుని, ధ్యానం చేసే మునీశ్వరులకు స్థిత ప్రజ్ఞత తో అంత అవసరం ఉండక పోవచ్చు. ఎందుకంటే, సంసార సుఖాలను త్యజించిన వారికి, ఇక ఘర్షణ ప్రస్తావన ఎందుకు ఉంటుంది కనుక ?! మరి ఈ స్థిత ప్రజ్ఞత కు సప్త సూత్రాలు వివరం గా తెలుసు కుందాము ! ఈ సప్త సూత్రాలనూ డాక్టర్ కారెన్ రీవిచ్ అనే ( స్త్రీ ) సైకాలజిస్ట్ ( అమెరికా ) పొందు పరిచారు.
1. భావావేశాలను, గుర్తించి, నియంత్రించు కోవడం : అంటే మనం, ప్రతి పరిస్థితి లోనూ, ప్రత్యేకించి, ప్రతి కూల లేదా, అననుకూల పరిస్థితులలో, మన హావ భావాలను ఎప్పటి కప్పుడు మన జ్ఞాన ‘ సూచీ ‘ తో కనుక్కుంటూ ఉండడం. అట్లాగే ఆ భావావేశాలు అధికం లేదా అనవసరం కానీ అప్రస్తుతం కానీ , అయినప్పుడు, వాటిని తదనుగుణం గా నియంత్రించు కోవడం. మనలో సహజ మైన హావ భావాలు, అంటే, ఆనందం, విచారము , భయం,యాంగ్జైటీ లేదా ఆందోళన – ఇలాంటివి కలిగినప్పుడు, వాటిని మనసులో అణుచుకోకుండా, బహిర్గతం చేయడం. స్థిత ప్రజ్ఞత ను అలవరుచుకున్న వారు, ఈ రకమైన హావ భావాలనూ, భావావేశాలనూ బహిర్గతం చేయడలో నైపుణ్యం చూపిస్తారు. స్థిత ప్రజ్ఞత అంటే, ముఖం లో ఏ విధమైన భావావేశాలూ కనపడనీయకుండా ప్రవర్తించడం కాదు. ఎందుకంటే మానవ సహజమైన ఈ ఎమోషన్స్ ను ఎప్పటికప్పుడు మనం మన మనసులలో, లేదా మస్తిష్కాలలో దాచేసుకోవడం ( bottling up అంటారు ఆంగ్లం లో ) చేయక, బయటకు తెలియ చేస్తూ ఉండాలి. కాక పొతే స్థిత ప్రజ్ఞులు కాని వారు, వారి ఎమోషన్స్ ను ఎప్పుడు, ఎట్లా నియంత్రించుకోవాలో తెలియక, తికమక పడుతూ ఉంటారు. ఇట్లా జరిగితే, సంబంధిత ఎమోషన్స్ లేదా భావావేశాలు, దీర్ఘ కాలికం గా వారిని ఇబ్బంది పెడుతూ , అనేక రుగ్మతలకు దారి తీస్తూ, వారి జీవన గమనాన్ని కుంటు పరుస్తాయి. క్లుప్తం గా చెప్పాలంటే ‘ ఈ ఎమోషన్స్ లేదా భావావేశపు ‘ గతుకులలో ‘ ఇరుక్కు ‘ పోకూడదు మనం. ప్రొఫెసర్ మార్క్ బ్రాకెట్ ( యేల్ విశ్వవిద్యాలయం, అమెరికా ) ఈ ఎమోషన్స్ ను ఎట్లా నియంత్రించుకోవాలో , సులభం గా గుర్తు పెట్టుకోవడానికి ,ఒక కిటుకు సూచించారు. అదేంటంటే, ఆంగ్ల పదం ‘ రూలర్ ‘ ( RULER . అంటే R= Recognize, అంటే మన ఎమోషన్స్ ను మనం గుర్తించ గలగటం,U= Understand, అంటే ఆ ఎమోషన్స్ ఏమిటో మనం స్పష్టం గా అర్ధం చేసుకోవడం. మనం చూస్తూ ఉంటాము, మన నిత్య జీవితం లో, కొందరు వ్యక్తులు, వారి భావాలను తెలియ చేస్తున్నప్పుడు, వారు నవ్వుతున్నారో ( ఆనందిస్తున్నారో ), ఏడుస్తున్నారో ( విచారిస్తున్నారో ) తెలుసుకోవడం అతి కష్టం ! , అట్లా కాకుండా !, L – Labelling, అంటే ఒక సారి అర్ధం చేసుకున్న ఎమోషన్స్ ను మనం సరిగా గుర్తించి ఆ పేరు పెట్టడం లేదా లేబెలింగ్ . E = Express, అంటే మనసులో దాచుకోకుండా బహిరంగ పరచడం, లేదా బయటకు తెలియ చేయడం, R= Regulate, అంటే క్రమీకరించుకోవడం, లేదా నియంత్రించు కోవడం, స్థిత ప్రజ్ఞత ఎక్కువ గా ఉన్న వారికీ , తక్కువ గా ఉన్న వారికీ తేడా తెలిసేది ముఖ్యం గా ఈ విషయం లోనే ! ( ఈ విధం గా ‘ RULER ‘ తో మన ఎమోషన్స్ ను నిరంతరం కొలుచుకొని, నియంత్రించుకో గలగటం స్థిత ప్రగ్నత లో ప్రధమ సూత్రం ! )
వచ్చే టపాలో మిగతా సూత్రాలు తెలుసుకుందాము !
sir, entha baagaa chepparu, mana bhaavaaveshaalu elaa thagiinchukovaalo . thank you. mee blog motham chustaanu entho usefull ga undi
ఫాతిమా గారూ ! బ్లాగు కు స్వాగతం ! టపా నచ్చినందుకు సంతోషం. ఇట్లాగే మీ అభిప్రాయాలు తెలియ చేస్తూ ఉంటారని ఆశిస్తూ,
అభినందనలతో,
డాక్టర్ సుధాకర్.