( when the boss is away ! )
మతి పరిభ్రమణం( drifting ) మనకు మంచిదే !
అను నిత్యం, మన మతి పరి పరి విధాల పరిభ్రమిస్తూ ఉంటుంది. అంటే మన ఆలోచనలు, ఒక దాని నుంచి మరొకటికి, లిప్త కాలం లో, అత్యంత వేగం గా ప్రయాణిస్తూ ఉంటాయి. అట్లాగే , ఒక సమయం లో మనం ఉన్న చోట, ఉండే ఆలోచనలు , మరు క్షణం లో నభొంత రాళాలు చుట్టి వస్తాయి. అంటే పరిభ్రమిస్తాయి. ఒక క్షణం లో మన ఆలోచనలు, మనకు అత్యంత ప్రీతికరమైన, రుచికరమైన వంటల మీదకు మళ్ళుతాయి. ఒక క్షణం లో మన మెదడులో మనకు అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తులు మెదలుతుంటారు, కామ పరమైన ఆలోచనలు మనలో రేపుతారు. ఇంకో క్షణ కాలం లో మన ఆలోచనలు చంద్ర మండలం మీదకో, లేదా అంగారకుడి మీదకో వెళ్ళిన వ్యోమ నౌక ( స్పేస్ షటిల్ ) మీదకు వెళ్ళ గలవు. ఒక శాస్త్రీయ అంచనా ప్రకారం ఇట్లా మనము మన జీవిత కాలం లో కనీసం యాభై శాతం సమయాన్ని, వర్తమాన కాలం నుంచి, నేరుగా మన మెదడు లో ఆలోచనల ప్రపంచం వైపు మళ్లిస్తామని భావించ బడుతుంది.
ఇట్లా మన ఆలోచనల ప్రపంచం లో మనం విహరించ డాన్ని ప్రముఖ సైకో ఎనలిస్ట్ , సిగ్మండ్ ఫ్రాయిడ్ ‘ శిశువు దశలో ‘ మనం ఉడడం వల్లనే అంటే మన ఆలోచనలు ‘ బాల్యావస్త ‘ లో ఉండడం గా వర్ణించాడు. మరి కొంత మంది, ఈ లక్షణాలను’ సైకోసిస్ ‘ అనే మనో వ్యాధికి దారి తీయగలదు అని కూడా అభిప్రాయ పడ్డారు.
కానీ తాజా పరిశోధనల వల్ల ఈ మతి పరి భ్రమణం, ఆరోగ్య కరమైన మెదడు లక్షణం అని స్పష్టం గా తెలిసింది. ( ఇక్కడ చదువరులు ఒక విషయం గమనించాలి. అది మతి చాంచల్యం లేక మతి భ్రమణం కూ మతి ‘ పరిభ్రమణం ‘ కూ ఉన్న తేడా. భ్రమణం అంటే తిరగడం అంటే మన ఆలోచనలు వివిధ విషయాల మీదకు వెళ్లి తిరిగి ‘ మన దగ్గరకు రావు ‘ అంటే మన ఆధీనం లోనుంచి వెళ్లి పోతాయి. కానీ మతి పరిభ్రమణం లో మన ఆలోచనలు వివిధ వలయాలలో తిరుగుతాయి, చివరకు మన మెదడు మన ఆధీనం లోకి వస్తుంది. అంటే మన ఆలోచనలను మనం నియంత్రించుకో గలమన్న మాట ! ఇంకో విధం గా చెప్పాలంటే మతి చాంచల్యం లేదా మతి భ్రమణం, ఒక మనో వ్యాధిగా పరిగణింప బడుతుంది.కానీ’ మతి పరిభ్రమణం ‘ (ఒక మనో వ్యాధి ) కాదు ).
ఈ మతి పరిభ్రమణం తో మనం, మన భవిష్యత్తు లో మనం చేయబోయే పనుల గురించి ఆలోచించుతూ అందుకు అవసరమయే పధకాలు కూడా వేసుకుంటూ ఉంటామని తెలిసింది. అంతే కాక మనలో ‘ క్రియేటివ్ రసం ‘ ప్రవహిస్తూ ఉన్నట్టు తెలిపే లక్షణం అని కూడా విశదమైంది.
మిగతా వివరాలు వచ్చే టపాలో చూద్దాము.
good going,