మనలో ఉత్తేజం గురించి లేటెస్ట్ ఏమిటి ?.6.
క్రితం టపాలలో మన ప్రవర్తన ను అనుసరించి పొందే ఉత్తెజము, మన ఆలోచన తీరును బట్టి పొందే ఉత్తెజము , ఇంకా మానవతా సైకాలజీ ( అదే మ్యాస్లో వివరించిన పిరమిడ్ )గురించి కొంత తెలుసుకున్నాము కదా!
మానవ మనస్తత్వం గురించి ఇటీవల జరిపిన, జరుపుతున్న , అనేక పరిశోధనలూ , పరిశీలనలూ , సెల్ఫ్ సైకాలజీ, అంటే మన ఆలోచనలను బట్టి మనం పొందే ఉత్తెజము, దాని ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది. మన గురించి మనం అర్ధం చేసుకునే సైకాలజీ చాలా వేగం గా పరిణామం చెందుతుంది. అంతే కాక ఇట్లా మనల్ని మనం అర్ధం చేసుకోవడం లో ఉన్న క్లిష్టత లేదా జటిలత , ప్రస్తుతం , ఒక చాలెంజ్ లాగా తయారయింది.
ఇప్పుడు మానవులను ,కేవలం బాహ్య ప్రేరణలతో, అంటే ఎక్స్టర్నల్ స్తిమ్యులై తో ప్రభావితం చెందే వారిగానే పరిగణింప బడట్లేదు. వారి వ్యక్తి గత లక్ష్యాలూ, వారి శక్తి సామర్ధ్యాలూ, వారి లో ఉన్న పోటీ స్వభావమూ – ఈ లక్షణాలతో ఉత్తేజం పొందుతున్న వారి లాగా పరిగణింప బడుతున్నారు. అంటే వారి స్వంత అవసరాలకోసం, వివిధ రంగాలలో ఇతరులతో పోటీ పడే స్వభావం లాంటి గుణాలు ఎక్కువ ఉత్తేజ కరం అవుతున్నాయి. అత్యంత ప్రముఖమైన ఉత్తెజకం ( అంటే సోర్స్ అఫ్ మోటివేషన్ ), మనలో నిబిడీకృతమై ఉన్న స్వభావం. అంటే ఇంట్రిన్సిక్ క్వాలిటీ. ఆ స్వభావాన్ని మనం పెంపొందించుకుంటూ ఉండాలి. అంటే ఆ స్వభావాన్ని , ఒక చిన్న, సున్నితమైన మొక్క లాగా భావిస్తూ, దానిని అతి జాగ్రత్త గా పెంచుకోవాలి మనమే. ఆ ‘ స్వభావం ‘ ఎంత బలీయం గా మనలో పెరిగి ఉంటే, మనం పొందే ఉత్తేజం కూడా అంతే బలం గా పెరిగి మనం అన్ని విధాలా పురోగమించడానికి వీలు గా ఉంటుంది. అంతే కాక ఒక మొక్క కు ఎట్లాగైతే భూమి మాత్రమె కాక , సూర్యకాంతి , నీరు బయటినుండి ఎట్లా అవసరమో, అదే విధం గా మనం ఉత్తేజం పొందే స్వభావం కూడా మనలోనే ఉత్పన్నం అయేది అయినప్పటికీ, అది బాహ్య వాతావరణం తో కలిసినప్పుడే బలీయం కాగలదు. ఇంకో విధం గా చెప్పుకోవాలంటే, ఉత్తేజం యొక్క తీవ్రత, వ్యక్తులు, వారి పరిసర వాతావరణం తో జరిపే ఇంట ర్యాక్షన్ నిర్ణయిస్తుంది. అంటే మనలో జనించే ఉత్తేజం, బాహ్య వాతావరణం తో బలీయం గా ప్రభావితం అవుతుంది ( ఇక్కడ, బాహ్య వాతావరణం అంటే కేవలం గాలి, వెలుతురూ కాదు. మన పరిసరాలలో ఉండే మానవులు, వారి పోటీ తత్వం, వారి శక్తి యుక్తులతో ప్రభావితమైనప్పుడే, మనలో ఉన్న ఉత్తేజం కూడా ‘ కాంతి పుంజమై ‘ మన జీవితాలకు ఎంతో ‘ వెలుగు ‘ ఇస్తుంది. ). ఈ స్వంత అంటే సెల్ఫ్ సైకాలజీ లో వ్యక్తి గత పురోభివృద్ధి అనే కీలకమైన అంశం ప్రతి వ్యక్తి కీ ఉంటుంది. ఈ గుణాన్ని ప్రధానం గా , సెల్ఫ్ డి టర్మినేషన్ థియరీ ( Self – Determination Theory ) అని అంటారు . డెసి ఇంకా ర్యాన్ ప్రతిపాదించిన ఈ థియరీ లో మానవులు , స్వతంత్రులు గా , పోటీ పడుతూ , ఇతర మానవులతో సంబంధాలు కలిగి ఉండడం, తద్వారా స్వీయ పురోభివృద్ధి చెందడం – ఈ లక్ష్యాలను సాధించాలంటే, వారు తమ శక్తి యుక్తులన్నీ , విజయావకాశాలు ఎక్కువ గా ఉన్న కార్యాల మీద కేంద్రీకరించడం, అపజయావకాశాలున్న కార్యాలనుంచి తప్పుకోవడం, విజయాలను చూసుకొని అభినందించు కోవడం, అట్లాగే అపజయాలు పొందినప్పుడు, వాటి ద్వారా గుణ పాఠాలు నేర్చుకోవడం – చేయాలి.

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !