పని సూత్రాలు. 5. తక్కువ సమయం లో ఎక్కువ పని చేయండి.
మీ ఆఫీసులో ఒక విషయానికి సంబంధించిన ఫైలు చూడాలంటే లేదా తేల్చాలంటే , ఒక వారం సరిపోయేట్టు ఉంటే , రెండు వారాల గడువు అడగండి , మీ పై అధికారి నుంచి.అట్లాగే , ఒక సాఫ్ట్ వేర్ ప్రోగ్రాం కు ఒక నెల పడితే , రెండు నెలలు సమయం అడగండి. ఈ విధం గా చేయడం మీ బాసును కానీ , పై అధికారిని కానీ మోసగించినట్టు కాదు. ఎందుకంటే , మీరు అనివార్య కారణాల వల్ల , ఆ పని లో అయ్యే ఆలస్యాలను కూడా దృష్టి లో పెట్టుకుని, అట్లా ఎక్కువ గడువు అడుగుతున్నారని , మీ చర్య ను సమర్ధించు కోవచ్చు. అప్పుడు మీ దూర దృష్టి కి మీ పై అధికారి కూడా అభినందిస్తాడు మీ పని తనాన్నీ, మీ సామర్ధ్యాన్న్నీ ! మీరు ఒక చిన్న ఎంటర్ప్రైజ్ మొదలు పెట్టారను కుంటే , మీ కు వచ్చే ఆర్డర్ లకు ఎక్కువ సమయం తీసుకుని, మీరు చేయ వలసిన పనిని కానీ , లేదా సప్లయి చేయ వలసిన వస్తువులను కానీ ఎక్కువ నాణ్యత గా చేస్తే, వాటి ఫలాలు మీకు చెందుతాయి. అంతే కాకుండా , మీరు చేయవలసిన పని కూడా ,అడిగిన దానికన్నా ఎక్కువ గా చేయండి ! ఉదాహరణ కు : మీరు మీ ఆఫీసులో బోర్డ్ మీటింగ్ కోసం ఒక రిపోర్ట్ తయారు చేయాలని ,రెండు వారాల గడువు మీకు ఇస్తే , మీరు ఒక వారం లోనే ఆ రిపోర్ట్ ను పూర్తి చేయడమే కాకుండా, అందులో మీరు ఉంచాల్సిన డేటా కన్నా ఎక్కువ గా అంటే భవిష్యత్తు లో మీ కంపెనీ ప్రొజెక్షన్స్ కూడా వివరం గా పొందు పరచడం లాంటి వి చేస్తే , మీ మేనేజర్ మెప్పు పొందగలరు. ఇట్లాంటి విషయాలలో కొంత జాగ్రత్త కూడా మీకు అవసరం ! అంటే మీరు చేస్తున్న ఎక్కువ పని, మీ మేనేజరు కు ” అతి ” గా అని పించకూడదు !
కొన్ని సమయాలలో , మిమ్మల్ని చేయమన్న పని మీకు తెలియదన్నట్టు ” అమాయకత్వం ” ప్రదర్శించితే కూడా , మీ బాసు మెప్పు పొందగలరు !
ఉదాహరణ కు: కిరణ్ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో పని చేస్తాడు. అతని కి జావా ప్రోగ్రాం కొట్టిన పిండి. అంతే కాకుండా , తన ప్రత్యెక ఉత్సాహం తో , గ్రాఫిక్ డిజైన్ లో కూడా ప్రావీణ్యత సంపాదించాడు. కానీ తన మేనేజర్ కు ఈ విషయం తెలియదు. అనుకోకుండా , తమ కంపెనీ పాపులారిటీ ద్వారా, గ్రాఫిక్ డిజైన్ కు సంబందించిన ప్రాజెక్ట్ ఆఫర్ వచ్చింది. మేనేజర్ కిరణ్ ను అడిగాడు. కిరణ్ తెల్ల మొహం వేశాడు, ఎక్కువ గా తెలియదు కానీ ప్రయత్నిస్తానన్నాడు ! సందేహిస్తూ నే మేనేజర్ యాక్సెప్ట్ చేశాడు ఆ ప్రాజెక్ట్ ( గుడ్ విల్ పోగొట్టుకోవడం ఎందుకు, ఒక వేళ తమ కంపెనీ ఆ ప్రాజెక్ట్ చేయక పోయినా, ఇంకొకరి చేత చేయించి, తాము కొంత కమిషన్ పొందవచ్చనే ఆశతో ) కిరణ్ ఆ ప్రాజెక్ట్ ను తనకున్న అనుభవం తో ( బాస్ కు తెలియదు కదా ! ) అనుకున్న సమయం కన్నా ముందే పూర్తి చేయడమే కాకుండా బాగా కూడా చేశాడు ! దానితో , ఆ కంపెనీ కి గ్రాఫిక్ డిజైన్ లో కూడా ఎక్కువ ఆఫర్ లు రావడం మొదలెట్టాయి. దానితో , బైక్ మీద ఆఫీసుకు వెళ్ళే కిరణ్ కార్ లో వెళ్ళడం మొదలెట్టాడు ! మేనేజరు మహా ఆనంద పడిపోతున్నాడు !
పైన వివరించిన ఈ పని సూత్రాన్ని అండర్ ప్రామిసింగ్ అండ్ ఓవర్ డెలివరింగ్ అని కూడా చెప్పుకోవచ్చు !
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం !