ప్ర.జ.లు. 7. స్త్రీలలో కూడా ఇన్ ఫిడిలిటీ ఉంటుందా ?:
ప్రశ్న: ఇంత వరకూ , పురుషులలో ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ గురించి వివరం గా తెలుసుకోవడం జరిగింది కదా , మరి స్త్రీలలో కూడా ఇన్ ఫిడిలిటీ ఉంటుందా? :
జవాబు: ఇది ఆసక్తి కరమైన ప్రశ్న. ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘ ఉంటుంది’. అతివల ఇన్ ఫిడిలిటీ కి అయిదు ముఖ్య కారణాలున్నాయి.
1. లో సెల్ఫ్ ఎస్టీం ( low self esteem ) అంటే ఆత్మ న్యూనతా భావం: కొందరు స్త్రీలు , తమ కుటుంబాలలో , కేవలం పిల్లలను కనే మెషీను లలాగా యాంత్రికమైన జీవితం గడుపుతుంటారు. కేవలం కనడమే కాకుండా , వారి పోషణా బాధ్యతా, ఇల్లు గడవడం , రోజూ ఇంటి లోకి కావలసిన అవసరాలు కనిపెట్టి , వాటిని కూర్చడం చేస్తూ ఉంటారు. ఈ విధమైన యాంత్రిక జీవనం , వారి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. కాల క్రమేణా వారు తమ వ్యక్తి గత పోషణ ను అంటే కేవలం శారీరికం గానే కాకుండా , మానసికం గా కూడా అశ్రద్ధ చేస్తూ ఉంటారు. దానితో , ఎప్పుడూ జవ సత్వాలు ఉడిగి పోయిన వారిలా , నిరాసక్తత తో ఉంటారు. ‘ పాపను కనక ముందు , వారికి నా మీద ఎంతో ప్రేమ గా ఉండేది. జీవితం మూడు ముద్దులూ , ఆరు కౌగిళ్ల లా సాగి పోయేది. పాప పుట్టగానే , వారి ప్రవర్తన మారి పోయింది. ఎప్పుడూ ఆఫీసూ , మీటింగులూ , టూర్లూ ! నేను ఉన్నాను , పడి అడ్డమైన చాకిరీ చేస్తూ , ఇళ్ళూ, వాకిళ్ళూ చూసుకుంటూ , పాప ను కనిపెట్టుకుని ఉండడానికి ! ‘ ఈ రకం గా ఉంటుంది వారి ఆలోచనా ధోరణి.
2. ఎమోషనల్ స్టార్వేషన్ అంటే భావావేశాల లంఖణాలు : ఇళ్ళూ , వాకిళ్ళూ , ఉంటాయి , పిల్లలూ , నౌకర్లూ ఉంటారు. ఆమె తెలివి గలది. విద్యార్హతలతో పాటుగా, వాటికి తగినట్టు , మంచి హోదా కలిగిన ఉద్యోగం కూడా ఉంది. భర్త కు కూడా పగలు వెళ్లి రాత్రి దాకా పని చేసి వచ్చే బాధ్యతా యుతమైన ఉద్యోగం ఉంది. కానీ జీవితం యాంత్రికం అయి పోయింది. ఉదయం నిద్ర లేచిన టైం నుంచీ పరుగు, ఇక భావావేశాల ను పంచుకోవడం మాట దేవుడెరుగు ! చీకటి పడే దాకా రారు. చక్కగా షవర్ చేసి , వారికి ఇష్టమైన రంగు లోని సల్వార్ కమీజ్ వేసుకుని బాల్కనీ లోంచి చూసి మందస్మిత వదనం తో ఎన్ని సార్లు ఎదురు చూడలేదు ఆమె ! దానికి సమాధానం చెప్పేది చిరు నవ్వు తో కాక , తీవ్రమైన అలసట తో, ఆకలి తో కూడిన భర్త ముఖం ! ఇద్దరికీ ఆకలి ! ఆమెది భావోద్వేగాల ఆకలి. ఆయన ది , కడుపు మండిన ఆకలి ! ఆయన ఆకలి మంటను ఆమె తీర్చ గలదు. ఆమె భావావేశపు ఆకలి ని ఆయన అర్ధం చేసుకుంటే గా , తీర్చడానికి ! సస్య శ్యామల గృహ క్షేత్రం లో ప్రేమానుభూతుల దుర్భర క్షామం ! కాల క్రమేణా భావా వేశాల లంఖణాలు , అనుభవిస్తూ , శుష్కించి పోతారు !
3. కోమలి కోపం : ఆమె చక్కనిది. చాక్లెట్ రంగులో ఉండి ,తీయగా మాట్లాడడమే కాకుండా , ఆయన తో లెక్క లేనన్ని మార్లు తీయని అనుభూతులు కూడా పంచు కున్నది తను. ‘ కానీ జరిగిందేమిటి ? తన ఫామిలీ ఫ్రెండ్ ను ‘ ప్రేమించి ‘ ఇంకో టౌన్ ట్రాన్స్ఫర్ చేయించుకుని , అక్కడ ఉంటున్నాడు ఆమె తో ! అంతటి కృతఘ్నుడు నాకు కనపడకుండా పోవడమే మంచిదయింది. నేనూ నా దారి చూసుకో గలను , ఆయన లేక పోయినా , ప్రపంచం అంతా ఇంకా నా ఎదుటే ఉంది ‘ అనుకునే అంతు లేని క్రోధం !
మిగతా కారణాలు వచ్చే టపాలో !
Really you are impartial 🙂
Thanks. I am surprised as to how you doubted to begin with ?!