ప్ర.జ.లు. 10. స్త్రీలూ – ఇన్ ఫిడిలిటీ లూ !
ప్రశ్న: విదేశాలలో ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ ల మీద యువతుల ఆలోచనా ధోరణులు ఎట్లా ఉన్నాయి? :
జవాబు : యువతుల కామ జీవితం లో చెప్పుకోదగ్గ మార్పులు కనిపిస్తున్నాయి. ఒక ఉదాహరణ: లైలా యుక్త వయసు వచ్చిన స్త్రీ. వయసు తో పాటు గా కాక కాస్త ఎక్కువ గానే పెరిగింది.టీనేజ్ అమ్మాయి గా కాక ఒక ప్రౌఢ లా కనిపిస్తుంది చూసే వారికి. ఆత్మ విశ్వాసం తొ ణికిస లాడుతూ ఉంటుంది ఆమెలో ! స్వతంత్రం గా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ, కాలేజీ లో చదువుకుంటుంది. తను ఆమె తల్లి లా ఆలోచించడం లేదు. లైలా దృష్టి లో ఆమె అమ్మ ఒక మూసలో పోసిన విధం గా, ఒక వివాహం చేసుకుని , ఇరువురు పిల్లలను పెంచుతూ , భర్త తొ సంసారం చేస్తుంది. ఆమె తండ్రి ఒక డల్ పురుషుడు. ఆర్ధిక సుస్థిరత మాత్రమె ఇవ్వగలడు. అయినా సరే , ఆమె తల్లి , ఆయన మీద ఆధార పడి, వారి సంబంధం , ఏ చిరుగాలికి దీపం లా ఎప్పుడు ఆరిపోతుందో అని బెంగ పడుతూ , ‘ సంసార జీవితం ‘ గడుపుతూ ఉంటుంది. తాను అట్లా చేయకూడదు. తనకూ ఒక స్థిరమైన ఆర్ధిక స్వాతంత్ర్యం కలిగిన పురుషుడు కావాలి. అతని స్థిరమైన ప్రేమా కావాలి. వాటి తో పాటుగా , తనకు జీవితం లో రోమాన్స్ కావాలి. ఎక్సైట్ మెంట్ కావాలి , కామోత్తేజం కలిగించి , తనను కామ కడలిలో డోల లాడించే మగ ధీరుడు కావాలి. తన కామోత్తేజ స్థానాలను లయ బద్ధం గా మీటుతూ తన లో ప్రణయ రాగాలు పలికించే రసమయ సంగీత సామ్రాట్టు కావాలి. ఆమె అంచనాలకు తగ్గ పురుషుడు , వివాహం లో లేక పొతే , ఆమె , ఆమె తల్లి లా సరిపుచ్చు కోదు. సామాజిక కట్టుబాట్లు, పాప్ కల్చరు, అన్నీ కలిసి ఆమె మెదడులో ఉన్న కామోత్తేజ జీవ రసాయనాలను ‘ నీరు గారుస్తున్నాయి ‘ దానికి తొడు కుటుంబ గౌరవం , కట్టుబాట్లూ , లైలాను ఉక్కిరి బిక్కిరి చేసి, ఆమెకు కామ సువాసన కలిగిన తాజా ప్రణయ శ్వాసలు తీసుకోకుండా చేస్తున్నాయి. తాను ఈ బంధనాలను తెంచు కుంటే , అతి తేలిక గా ఊపిరి తీసుకోగలదు. అప్పుడు ఆమె కోరికల రెక్కల విహంగాలు , హాయిగా ఎగిరి , తన ప్రణయ సామ్రాజ్యం లో తన ఇష్టం వచ్చిన చోట వాలుతాయి. ఆమె తన జీవితం లోని ఆ ‘ చిరు ‘ కోరికలు తీర్చ గలిగే వాడి కోసం , రహస్యం గా కూడా వెదికి , అవసరమైతే , ఎఫైర్స్ పెట్టుకుని , సంపూర్ణమైన ఆనందం అనుభవించడానికి వెనుకాడదు.
వివాహ జీవితం లో , ఆనందం కోల్పోయి , సతమత మవుతూ , తీవ్ర నిరుత్సాహం చెంది , నిస్సహాయ స్థితి లో ఉన్న వారే , ఆ వివాహ బంధం నుంచి విముక్తి చెందడానికి ప్రయత్నిస్తారు. అట్లా బయటకు అడుగిడడం తో , స్త్రీలు , తమకు తాము ఒక నూతన శక్తి పొందినట్టు భావిస్తారు. వారి లో ఉడిగి పోయిన శక్తులు , మళ్ళీ సజీవమైనట్టు ఫీల్ అవుతారు.
వారి దృష్టి లో ఆ సమయం లో ఎఫైర్ పెట్టుకోవడం , ఒక పెద్ద అరుపు లేదా స్క్రీం. ఆ అరుపు , తామో , తమ వివాహమో ఉండాలి అని అనుకుని, తాడో పేడో తేల్చుకోవాలి , అని తీసుకున్న నిర్ణయానికి సంకేతం. ఆ నిర్ణయం తీసుకుని , స్త్రీలు , కేవలం ఎప్పుడూ అణిగి మణిగి , ఆత్మ న్యూనతా భావం తో తల ఊపుతూ ఉన్న ఒక సామాన్య స్త్రీ గా కాక , ఒక శక్తి వంతమైన స్త్రీగా ఫీల్ అయి , నూతనోత్తేజం పొందుతారు.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !