Our Health

Archive for ఆగస్ట్ 18th, 2012|Daily archive page

ప్ర.జ.లు. 20. అబార్షన్ వల్ల కాంప్లికేషన్స్ ఉంటాయా ?

In ప్ర.జ.లు., Our Health on ఆగస్ట్ 18, 2012 at 6:58 సా.

ప్ర.జ.లు. 20. అబార్షన్ వల్ల కాంప్లికేషన్స్ ఉంటాయా ? 

ప్రశ్న: అబార్షన్  చేయించుకోవడం వల్ల కాంప్లికేషన్స్ ఏవైనా ఉంటాయా? 
జవాబు:  ఇది ముఖ్యమైన ప్రశ్న.సాధారణం గా అబార్షన్ వల్ల ఏ విధమైన కాంప్లికేషన్స్ ఉండవు. కానీ అన్ని పద్ధతుల మాదిరి గానే , అబార్షన్ లో కూడా , నిపుణత లోపిస్తే , లేదా  ఉపయోగించ వలసిన పరికరాలు శుభ్రం గా లేక పొతే కూడా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది.ఈ కాంప్లికేషన్స్ ను రెండు విధాలు గా మనం తెలుసుకోవచ్చు. ఒకటి కేవలం మందులతోనే చేసే అబార్షన్. దీనినే మెడికల్ టెర్మినేషన్ అఫ్ ప్రెగ్నెన్సీ అంటారు. రెండవ రకం లో మందులతో పాటు గా కొన్ని ప్రత్యెక మైన పరికరాలు కూడా వాడి అబార్షన్ చేయడం జరుగుతుంది. దేనినే సర్జికల్ టెర్మినేషన్ అఫ్ ప్రెగ్నెన్సీ అని అంటారు.
మెడికల్ టెర్మినేషన్ అఫ్ ప్రెగ్నెన్సీ లో ఏ ఏ కాంప్లికేషన్స్ రావచ్చు? 
1. గర్భానికి, ఫీటస్ కూ సంబంధించిన కణజాలం గర్భాశయం లో నే ఉండి పోవడం: అప్పుడప్పుడూ , గర్భాశయం లో కొంత గర్భానికి చెందిన కణజాలం , అంటే ప్లాసేంటా, ఇంకా మావి పొర , లేదా కొన్ని శిశువు భాగాలు  ఉండి పోవచ్చు. గమనించ వలసినది ఏమిటంటే, మనం శిశువు అని మాట్లాడు కుంటూ ఉన్నప్పటికీ ,  వారాల వయసులో ఉన్న శిశువు పరిమాణం అంటే సైజు చిన్న గా ఉంటుంది. 
2. మెడికల్ టెర్మినేషన్ ఫెయిల్ అవడం: కొన్ని సమయాలలో మందుల తో చేసే అబార్షన్ ఫెయిల్ అవవచ్చు అంటే శిశువు గర్భం లోనే ఉండి పోవచ్చు. 
3. రక్తం గడ్డలు గా గర్భాశయం లోపలే ఉండి పోవడం: సామాన్యం గా  ప్లాసేంటా  లో ఎక్కువ రక్త నాళాలు ఉండి ప్లాసేంటా , రక్త నాళాల తో నిండిన సంచీలా అంటే బ్యాగ్ లా ఉంటుంది. అబార్షన్ జరిగినప్పుడు ఈ రక్త నాళాలు తెగి , రక్త స్రావం అవుతుంది. కొన్ని సమయాలలో రక్త స్రావం అధికం గా అవుతుంది కానీ, నిదానం గా అవుతూ ఉంటే , గడ్డలు , గడ్డలు గా  గర్భాశయం లో నే ఉండి పోతుంది. ఈ రక్త పు గడ్డలనే  బ్లడ్ క్లాట్స్ లేదా క్లాట్స్ అంటారు. అబార్షన్ అయిన కొన్ని రోజుల తరువాత కనుక క్లాట్స్ గమనించి నట్టయితే , వెంటనే స్పెషలిస్టు ను సంప్రదించాలి.
4. ఇన్ఫెక్షన్ : గర్భాశయం లో ఇన్ఫెక్షన్, పరికరాలు ఉపయోగించినప్పుడు కలుగుతుంది. చాలా సమయాలలో ఈ ఇన్ఫెక్షన్ ప్రమాద కరం కాదు. స్త్రీలలో అంతకు ముందే కనుక ( వారికి తెలియకుండా ) ఏదైనా ఇన్ఫెక్షన్ గర్భాశయం లో కానీ , వజైనా లో కానీ ఉంటే అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ గర్భాశయం లో ప్రవేశించడానికి రిస్కు ఎక్కువ అవుతుంది. 
5. రక్త స్రావం లేదా హెమరేజ్ :  కొన్ని సమయాలలో గర్భాశయం నుంచి రక్త స్రావం, సహజం గా ఆగి పోకుండా , కంటిన్యూ అవుతుంది. ఇట్లా కంటిన్యూ అవడానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఉండదు. కానీ  వీలైనంత త్వరగా రక్త స్రావాన్ని అంటే బ్లీడింగ్ ను ఆపడం చాలా ముఖ్యం. 
ప్రశ్న:సర్జికల్ అబార్షన్ లో ఏ ఏ కాంప్లికేషన్స్ రావచ్చు? : 
జవాబు:గమనించ వలసినది ఏమిటంటే , మొదటి తొమ్మిది నుంచి పన్నెండు  వారాలలో జరిపే అబార్షన్ లో కాంప్లికేషన్స్ తక్కువ గా ఉంది రెండవ పది పన్నెండు వారాలలో కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం కనీసం యాభై శాతం వరకూ పెరుగుతుంది. అంతే కాక , మెడికల్ టెర్మినేషన్ లో కన్నా , ఇన్ఫెక్షన్ వచ్చే రిస్కు , సర్జికల్  టెర్మినేషన్ లో ఎక్కువ గా ఉంటుంది. ఎందు కంటే వివిధ పరికరాలు ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి. ఇన్ఫెక్షన్ కనుక చాలా కాలం ఉంటే దానిని పెల్విక్  ఇన్ఫ్ల  మేటరీ డిసీజ్ అంటారు . ( Pelvic inflammatory disease ).  ఇట్లా కనుక జరిగితే , స్త్రీకి దీర్ఘ కాలిక  నొప్పి , బాధ , బలహీనత , లాంటి సమస్యల తో పాటు  మళ్ళీ సంతానం కలిగే అవకాశాలు కూడా తగ్గ వచ్చు. అబార్షన్ లు తరచూ చేయించుకునే స్త్రీలకు ఈ విధమైన సమస్యలు వస్తాయి.అరుదు గా సర్జికల్ పరికరాలు నిపుణత తో ఉపయోగించక పొతే , సర్విక్స్  కు గాయం అవడమూ , లేదా గర్భాశయం లో రంధ్రం పడడమూ , గర్భాశయం కు ఆనుకుని ఉన్న మూత్రాశయం  సమస్యలు కూడా వచ్చే అవకాశాలు హెచ్చుతాయి.పైన చెప్పినవి కాక ,   మెడికల్ అబార్షన్ లో వచ్చే కాంప్లికేషన్స్  అన్నీ కూడా సర్జికల్ అబార్షన్ జరిపినప్పుడు కూడా రావచ్చు.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 
%d bloggers like this: