Our Health

Archive for ఆగస్ట్ 24th, 2012|Daily archive page

ప్ర.జ.లు. 5. ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ !

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఆగస్ట్ 24, 2012 at 11:37 సా.

ప్ర.జ.లు. 5. ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ ! 

 

ప్రశ్న: మగ వారి కామ చంచలత్వానికి  ఇంకా కారణాలు ఉన్నాయా ? :
జవాబు: ఆ హా ! ఎందుకు లేవూ , ఇంకా చాలా ఉన్నాయి ! 
11. తగిన అర్హతలు : ప్రతి మగ దీరుడూ , తానూ ,  అంద గాడిననీ , హ్యాండ్సం గా  ఉన్నాడనీ  , ధనికుడిననీ , సంఘం లో చాలా పాపులర్ అనీ , అంతే కాక ముఖ్యం గా కామ కేళీ విలాసం లో  చతురుడనీ  సంపూర్ణం గా నమ్ముతూ , ఆత్మ విశ్వాసం తో ఉంటాడు. ఇవన్నీ మంచి గుణాలే కదా ? ఆత్మ విశ్వాసం తో ఉండడం కూడా, కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయి , ఇతర స్త్రీల తో ఎఫైర్స్ కు దారి తీసి , అతివలు  ‘ అందు బాటులో ‘ ఉంటే, వారి  పొందు కోరడం లో తప్పేమిటీ అనే  భావన కలుగుతూ ఉంటుంది కొందరిలో .
12. ఎక్కువ మంది స్త్రీలతో  తో కామం,  మగ ధీరతకు చిహ్నం ! :  , ఒకరి కన్నా ఎక్కువ మంది స్త్రీలతో కామ కేళీ కలాపాలు జరుపుతూ ఉంటే ఎంతో ఆనంద దాయకం గా , కామ వాంఛలు తీరుతూ ఉంటే చాలా సంతృప్తి కరం గా ఉంటుంది  ఇవి , కొందరు పురుషులలో నాటుకున్న  భావనలు. 
13. చాటు మాటు ఎఫైర్ లు రేపుతాయి గుండెలో వేడి ఫైర్ లు ! :   రమణి తో రస భావనలు ! ఆహా ఎంత ఆహ్లాద కరం గా ఉంటాయి ? ప్రత్యేకించి,   ఆ చిలిపి ఈ  మెయిల్స్  , ఇంట్లో భార్య  ఆద మరిచి నిద్ర పోతున్నప్పుడు తనకు వచ్చే టెక్స్ట్ మెసేజెస్, ఆ తరువాత  కలయికలు , మనసులో వెచ్చని కోరికల కుంపట్లు రేపుతాయి కొందరికి.
14. తాను వలచిన ‘ రంభలు ‘ తన గురించి కీచు లాడుకుంటూ ఉంటే ,  భలే సరదా గా ఉంటుంది ! :  రాధ కు తెలుసు నేను ఎంత ఆనందాన్ని తనకు ఇచ్చానో ! అట్లాగే  సుమ కూ ,  మాధవి కు కూడా తెలుసు ‘ తన ప్రతాపం ‘ ఇక వారు ముగ్గురూ కలిసినప్పుడు చూడాలి వారి రొషాలూ, పోట్లాటలూ , చాలా సరదా గా ఉంటుంది ‘ అనుకునే  మనస్తత్వం కొందరిలో.
15.  అతడికి తెలుసు ఆమె క్షమించి  మళ్ళీ తనతో రమిస్తుందని !  : నా  రుక్మిణి  ఎంతో మంచిది !  నా సుఖం ఎప్పుడూ  కాదనదు. ఇంతకు ముందు , ఆ ఇద్దరితో  నేను ‘ కుర్ర తనం ‘ ప్రదర్శించినా , ఎంతో ప్రేమ తో నన్ను క్షమించి తన వేడి కౌగిలి లో చేర్చుకుంది.ఇప్పుడు కోమలి తో  వ్యవహారం పరవాలేదు ! అనుకునే భరోసా భావం ! 
16. స్వచ్చమైన ప్రేమ ! :  సుశీల నిజం గా నన్ను ప్రేమిస్తూంది ! నాలో కూడా ఏదో తెలియని ఆత్మీయతా భావం నిండు కుని , ప్రేమ మొగ్గ తొడుగుతుంది ! పిచ్చి వాణ్ని చేసి వేస్తుంది నన్ను !  ఇక  భార్యామణి స్వాతంత్ర్యానికి తానూ అడ్డు చెప్ప నవసరం లేదు అనుకుని సమాధాన పరుచుకునే స్వభావం  కొందరిది ! 
17, (  రస ) దారి చూపే వారి  అడుగు జాడలలో ! :  తన బాబాయి   భలే సరదా మనిషి ! అమలాపురం లో ఉన్నప్పుడు , తన చిన్న తనం లో ఎన్ని సార్లు  బాబాయి  స్నేహితురాళ్ళ ఇళ్ళకు తీసుకు పోలేదు ? ఎందుకో ఎప్పుడూ బెడ్ రూం లో తాను ఆంటీ తో  మాట్లాడుతూ , తనను బయట గుమ్మం దగ్గర జామ  చెట్టు నీడ లో  ఆడుకుంటూ ఉండమనే వాడు.  తాను పెద్ద అయ్యాక గానీ తెలియ లేదు , బాబాయి  పడక గది లో  ఉన్న’  జామ పండు ‘  ను ఒక ‘  చిలక కొట్టుడు ‘ కొడుతున్నాడని ! 
తన చిన్న  మామయ్య సంగతి సరే సరి !  ఆయన కళా పోషణ సరాసరి  మద్రాసు లో చిన్న వేషాల ‘ నటీ మణుల ‘  మీద ఉండేది ! మరి ఇందరు  మహా మహుల కుటుంబం లో పెరిగిన తను  ఇంత స్తబ్దత ఎందుకు ప్రదర్శించడం !  వారి   రసిక  మడుగు జాడలలో తప్పటడుగు   వేస్తె తప్పేంటి అనే భావన !  ‘  వంశ ప్రతిష్ట ను  ‘ నిలబెట్టా లనుకునే కళా తపన  కొందరిది. 
18. జవరాలి ప్రత్యేకతలు ఇల్లాలిలో ఏవీ ? : ఆమె  ప్రత్యేకత ఆమె  దే !    తన భార్య లా కేవలం బుగ్గల మీద చిట్టి ముద్దులు మాత్రమె కాదు,   షవర్ నుంచి బయటకు వచ్చి ,  నూట ఎనిమిది  వేడి  ముద్దులు కావాలంటుంది, నా మీద అతి భక్తి తో !  ఖచ్చితం గా నూట ఎనిమిది ముద్దులు అతి జాగ్రత్త గా ఆమె ‘ మీద ‘ పెట్టినా  నన్నే బోల్తా కొట్టించి ,  లెక్క సరిగా లేదని , మూడు వందల ముద్దులు పెట్టించుకున్న రోజులు ఎన్నో ! లెక్కలు సరిగా రాక పోవడాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి ఇంతకన్నా మించిన అవకాశం నాకు మాత్రం  ఎప్పుడు ఉంటుంది కనుక ?  తన భార్య మాత్రం ,   ఇట్లాంటి విషయాలలో ‘ తాను ‘  మడి ‘  కట్టుకుని కూర్చుని  తన  ‘ వేడి నంతా ‘ చల్లారుస్తుంది’ .అనుకునే మనస్తత్వం  ఇంకొందరిది.
వచ్చే టపాలో ఇంకొన్ని  ఇన్ ఫిడిలిటీ సంగతులు ! 
%d bloggers like this: