పిచ్చి సంగతులు , తెలుసుకోవడం మంచిదే !.5.
క్రితం టపాలో మరి పిచ్చి వస్తే, ఎట్లా కనుక్కోవచ్చో , దాని గురించి కొంత తెలుసుకున్నాము కదా ! పిచ్చి, మానవ మస్తిష్కం విపరీతమైన వేగం తో ఆలోచనలు వచ్చినప్పుడు , ఆ వేగం తో వస్తూన్న ఆలోచనల ప్రభావం , మన ప్రవర్తన లో కూడా కనిపించి , ప్రవర్తన అస్తవ్యస్త మవటం వల్ల వస్తుంది. మస్తిష్కం లో ఆలోచనలు సామాన్యం గా ఉంటే ఆ స్థితి ని నార్మల్ మూడ్ లేదా యూ తైమిక్ మూడ్ అంటాము. అదే అత్యంత వేగానికి విరుద్దం గా , ఆలోచనలు కనుక అత్యంత నిదానం గా వస్తూ ఉంటే, మనం స్లో అవుతాము. డిప్రెషన్ వచ్చినప్పుడు అట్లా జరుగుతుంది. ఈ క్రింది పటం గమనించి నట్టయితే మనకు విశదమవుతుంది ఈ మూడ్ స్థితులు. ఆంగ్లం లో ఉన్నాయి పదాలు కానీ శులభం గా అర్ధమవుతాయి , అందరికీ !

ఇప్పుడు మనం మానియా కూ , హైపో మానియా కూ తేడాలు చూద్దాము. హైపో అంటే తక్కువ , లేదా క్రింద అని అర్థం. మనం సాధారణం గా చూస్తూ ఉంటాము , అనుకుంటూ కూడా ఉంటాము ఎవరైనా , విపరీతం గానూ , ఎక్కువ హడావిడి గానూ ప్రవర్తిస్తూ , అటూ ఇటూ తిరుగుతూ ఉంటే , వీడెవడో యమ హైపర్ ‘ అని. హైపర్ అంటే ఎక్కువ లేదా ఎగువ అని అర్థం. మనం సామాన్యం గా అనుకునే హైపర్ స్థితి శాస్త్ర రీత్యా హైపో మానియా గా చెప్పుకోవచ్చు. అంటే హైపో మానియా లక్షణాలు, వంద శాతం పిచ్చి లక్షణాలు గా కాక , ఏ యాభై , అరవై శాతమో ఉంటాయి. అంటే ఈ హైపో మానియా లక్షణాలు, ఉన్న వారు , సమాజం లో చాలా మంది ఉంటారు. బహుశా , నిజం గా పిచ్చి ఉన్న వారికంటే ఎక్కువ శాతం ఉంటారు. వారిలోని పిచ్చి లక్షణాలు, ఆందోళన పడ వలసిన లక్షణాలైనా, మరీ విపరీతం గా , వెంటనే ఆస్పత్రి లో చేర్పించ వలసినంత అత్యవసరం గా ఉండవు. వీరిలో అంటే హైపో మానియా ఉన్న వారిలో రిస్కు టేకింగ్ బిహావియర్ రవంత తక్కువ గా ఉంటుంది , మానియా ఉన్న వారిలో ఉండే దానికంటే !
ఈ క్రింద పటం చూడండి , మీకు శులభం గా అర్ధమవుతాయి , ఈ తేడాలు !
ఇక్కడ మొదట ఉన్నది డిగ్ ఫాస్ట్ అనే పదం అంటే ఆంగ్లంలో ఉన్న అక్షరాలు DIGFAST ఈ అక్షరాలతో ప్రారంభ మయే ఆంగ్ల పదాలు, మానియా లో అంటే వంద శాతం పిచ్చి లో ఉండే లక్షణాలు. ( మానియా ను బై పోలార్ వన్ అని శాస్త్రీయం గా అంటారు )దాని క్రింద ఉన్న పటం లో ఉన్నవి , హైపో మానియా లక్షణాలు ( దీనినే బై పోలార్ టూ అని శాస్త్రీయం గా అంటారు , ఎపిసోడ్ అంటే ఒక సారి వచ్చిన వ్యాధిని సింగిల్ ఎపిసోడ్ అంటారు. )


వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !