ప్ర.జ.లు.3.
రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కు స్తనాల స్వీయ పరీక్ష అంటే ఏమిటి?
జ: క్యాన్సర్ screening లేదా స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ లక్షణాలు పూర్తిగా బయట పడక ముందే క్యాన్సర్ ను కనుక్కోవడం అన్న మాట. ఈ విధం గా స్క్రీనింగ్ ద్వారా అత్యంత తోలి దశల లోనే క్యాన్సర్ ను కనుక్కొంటే , చికిత్స త్వరగానూ , చాలా సంతృప్తి కరం గా నూ చేయించు కోవచ్చు. అప్పుడు చికిత్స ఫలితం ఎక్కువ గా కనిపిస్తుంది కూడా ! రొమ్ము క్యాన్సర్ లో కూడా అదే విధం గా స్క్రీనింగ్ చేయించుకుంటే ఫలితాలు బాగా ఉంటాయి.
ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి వివరం గా తెలుసుకుందాము. సామాన్యం గా స్క్రీనింగ్ అంటే ఒక్క పరీక్ష కే పరిమితం కాదు. అనేక రకాల పరీక్షలు చేసి, క్యాన్సర్ ను తొలిదశలో గుర్తించడానికీ, లేదా కనుక్కోవడానికీ అవకాశాలు ఎక్కువ గా ఉంటాయి.
ఈ స్క్రీనింగ్ లో ముఖ్యమైన పధ్ధతి , రొమ్ము లేదా స్తనాల స్వీయ పరీక్ష. దీనినే BSE లేదా Breast Self Examination అంటారు. రజస్వల అయిన తరువాత నుంచీ , ప్రతి స్త్రీ కూడా క్రమం గా తమ స్తనాల స్వీయ పరీక్ష చేసుకుంటూ ఉంటే , స్తనాలలో వచ్చే ఏ మార్పులను అయినా తోలి దశ లోనే గుర్తించడానికి వీలు ఉంటుంది. ఈ స్వీయ స్తన పరీక్ష , అంటే ఎవరికీ వారు చేసుకునే ఈ స్తన పరీక్ష చాలా శులభ మైనదే కానీ, చాలా మంది స్త్రీలు, ఈ స్వీయ స్తన పరీక్షను అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అంతే కాక , కొన్ని సమయాలలో తోలి దశలలో మార్పులు గుర్తించక , క్యాన్సర్ ముదిరిన తరువాత , తమ స్తనాలలో కంతి లేక ట్యూమర్ ఏర్పడడం కొంత కాలం మునుపే గుర్తించామనీ , కానీ దానంతట అదే తగ్గి పోతుందని అనుకున్నామనీ చెపుతూ ఉంటారు తమ వైద్యులకు. కానీ అప్పటికే , ఆ కంతి తోలి దశను దాటి పోయే ప్రమాదం ఉంది. అందు వల్ల నే , స్వీయ స్తన పరీక్ష అత్యంత ముఖ్యమైన స్క్రీనింగ్ పరీక్ష.
మరి ఈ స్వీయ స్తన పరీక్ష ఎట్లా చేసుకోవాలి ? :
స్త్రీ సందర్శకుల సౌకర్యార్ధం , స్వీయ స్తన పరీక్ష చేసుకునే పధ్ధతి , వివరం గా రెండు విధాలు గా పొందు పరచడం జరుగుతూంది ఇక్కడ. ఒకటి క్రింద ఉదాహరించిన వీడియో చూడడం.
రెండవది. స్వీయ స్తన పరీక్ష పధ్ధతి గురించిన వివరాలు ఒక పుస్తకం రూపం లో ఆన్ లైన్ లో చదివి అనుసరించడం లేదా అవకాశం ఉంటే ప్రింటు చేసుకోవడం లేదా ఫోను లో ఇంటికి టపా ద్వారా తెప్పించు కోవడం. ( టపా ద్వారా ఇంటికి తెప్పించుకోవడం కేవలం అమెరికా దేశం లో ఉన్న వారికే పరిమితం అనుకుంటాను ). అంతా ఉచితం గానే !
స్వీయ స్తన పరీక్ష వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి. http://youtu.be/yw8Gx2LKWhA

పైన చూపించిన పుస్తకం ఉచితం గా ఆన్ లైన్ లో చదువుకోవచ్చు లేదా టపా ద్వారా తెప్పించుకో వచ్చు !
వచ్చే టపాలో ఇంకొన్ని ప్ర.జ.లు .