పని సూత్రాలు. 19. ఆకర్షణీయం గా ఉండండి !
పని సూత్రాలలో ఇంకో ముఖ్య సూత్రం ఎప్పుడూ మీరు ఆకర్ష ణీయం గా కనబడడం ! మనం చూస్తూ ఉంటాం , ఆజాను భాహువులైన పురుషులు సమాజం లో ఎంతో ముందుకు చక చకా పోతూ ఉంటారు , వారు ఆర్ధికం గా ఏ తరగతి కి చెందినప్పటికీ , అట్లాగే అందమైన , ఆకర్షణీయమైన యువతులు కూడా పలు రంగాలలో వారు ఎంచుకున్న లక్ష్యాలను త్వరగా అధిగమిస్తూ ఉంటారు ! ఇక సహజం గా పుట్టుకతో , శారీరికం గా దృ డం గా లేని పురుషులు , లేదా అంతగా అందం గా అనిపించని స్త్రీలూ కూడా సమాజం లో ఎంతో పురోగమిస్తూ ఉంటారు.గమనించ వలసిన విషయం ఏమిటంటే , మనం మన లక్ష్యాలను చేరుకోడానికి పుట్టుకతో మనకు సంక్రమించిన శారీరిక లక్షణాలు కొంత వరకూ దోహద పడుతున్నా కూడా , మన మానసిక లక్షణాలు , తదనుగుణం గా ఇతరులతో ప్రత్యేకించి , మన చుట్టూ ఉన్న సమాజం లోనూ , ఇంకా మనం చేసే ఉద్యోగాలలో మన కొలీగ్స్ తోనూ ,మనం ప్రవర్తించే తీరు కూడా మన పురోగతి కి ఎంతాగానో తోడ్పడతాయి !
నిత్య జీవితం లో మనం ఇతరులకు ఆకర్షణీయం గా కనబడడానికి మనం ఏం చేయాలి ?:
1. శరీరాన్ని శుభ్రం గా ఉంచుకోవడం
2. ఎప్పుడూ తాజా బట్టలు వేసుకోవడం
3. ఆకర్షణీయమైన హేర్ స్టైల్ తో కనిపించడం
4. నిరంతరం చిరునవ్వుతో ఇతరులను పలకరించడం లేదా ఇతరులతో సంభాషించడం
5. హృదయ పూర్వకం గా అరమరికలు లేకుండా ఇతరులతో మెసలడం
6. ఇతరుల అవసరాలను కూడా సానుభూతి తో పరిశీలన చేయడం
7. ఈర్ష్యా ద్వేషాలు లేకుండా ఇతరులతో ప్రవర్తించడం ,
8. కేరింగ్ మనస్తత్వం తో ఉండడం .
కేవలం పైన చెప్పిన లక్షణాలే కాకుండా , మీరు నుంచునే లేదా కూర్చునే తీరు కూడా ఇతరులను మీ వైపు ఆకర్షింప చేస్తుంది ! మీ ఎత్తు బరువు ఎట్లా ఉన్నా కూడా , మీరు మీ సీటు లో ఒక మూలకు నక్కి నట్టు కూర్చుని ఒక పక్కకు వాలిపోయి ఉంటే మీరు ఇతరులతో సంభాషణకు విముఖం గా ఉన్నట్టు అభిప్రాయం కలిగిస్తారు ! అట్లా కాకుండా మీరు కూర్చున్న సీటు లో నిటారుగా మీ వీపు ఉంచి వాలిపోకుండా ఉంటే మీరు ఎలర్ట్ గా ఉండి ,ఇతరులకు మీతో మాట్లాడాలనే ఉత్సాహం కలిగిస్తారు ! ఇతరులకు మీలో మీ చిరునవ్వు , కపటం లేని , మీ స్వభావం , మీ శుభ్రతా , భేషజాలు ఏవీ లేని మీ సంభాషణా , జీవితమంటే మీకున్న ఆశావాద దృక్పధం – ఈ లక్షణాలు ఎక్కువ ఆకర్షణీయం గా కనబడతాయి !
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం !