Archive for ఫిబ్రవరి, 2012|Monthly archive page
పొగాకుకు ఋణం – ప్రాణం పణం. 8. స్మోకింగ్ ఎట్లా మానాలి ?
In Our Health on ఫిబ్రవరి 17, 2012 at 8:00 సా.పొగాకు కు ఋణం – ప్రాణం పణం . 7. సెకండ్ హ్యాండ్ స్మోక్ ‘ SHS ‘ గురించి అందరూ ఎందుకు తెలుసుకోవాలి?
In Our Health on ఫిబ్రవరి 16, 2012 at 7:44 సా.పొగాకు కు ఋణం – ప్రాణం పణం ( మీలో మార్పు తెచ్చే కొన్ని వీడియోలు )
In Our Health on ఫిబ్రవరి 12, 2012 at 9:41 సా.మీకోసం కొన్ని యు ట్యూబ్ లో ఉన్న వీడియోలు ఇక్కడ జత చెస్తూన్నాను. ఇవి తెలుగు లో లేవు. కానీ శులభం గా అర్ధం ఆయె విధం గా చాలా శక్తి వంతంగా ఉన్నాయి.చూడండి.
దయ చేసి మీ అభిప్రాయాలు తెలుపండి.
పొగాకు కు ఋణం – ప్రాణం పణం. 6. పొగాకు పీలిస్తే కాన్సర్ ఎట్లా వస్తూంది ?
In Our Health on ఫిబ్రవరి 12, 2012 at 3:06 సా.పొగాకు పీలిస్తే కాన్సర్ ఎట్లా వస్తూంది?

( మానవ దేహం లో ఉండే ప్రతి కణం లోనూ ఉండే జన్యువు ‘ DNA ‘ యొక్క చిత్ర పటం ఇది. పొగాకు పీల్చడం వల్ల ఈ ‘ DNA ‘ నిర్మాణం లో మార్పులు జరిగి కాన్సర్ కారకమైన కణ జాలం ఎక్కువ గా పుడుతుంది, సహజ మైన ఆరోగ్యమైన కణజాలం కాకుండా. పొగాకు పొగ లో ఉండే అనేక విషతుల్యమైన పదార్థాలు ఈ మార్పులు తెస్తాయనే విషయం నిర్వివాదాంశం. )
చాలా మందికి పొగ పీలిస్తే కాన్సర్ వస్తుంది అని మాత్రమే తెలుసు. కానీ ఆ కాన్సర్ ఎన్ని విధాలుగా దేహం లో వస్తూందో తెలియదు. ముఖ్యం గా పొగాకు పీలిస్తే ఎట్లా వస్తూందో తెలియదు.
‘ రోజూ ఇరవై ముప్పై సిగరెట్లో, బీడీలో పీల్చి పారేస్తే సరిపోతుంది, ఎవరు పట్టించుకుంటారు ఇవన్నీ’ అని అనుకుంటారు. అపోహ పడతారు.
కానీ ఎందువల్ల పొగాకు పీలిస్తే కాన్సర్ వస్తూందో తెలుసుకుంటే మంచిది. కారణాలు తెలుసుకోవడం వారిలో పొగాకు తాగటం మానే ప్రయత్నానికి పునాది అవుతుంది.
ఇప్పటివరకూ మనకు పరిశోధనల ద్వారా పొగాకు పీల్చడం , పెదవుల పై కాన్సర్, నోటిలో కాన్సర్, గొంతు లో కాన్సర్, శ్వాస కోశం లో లేక ఊపిరితిత్తులలో కాన్సర్ ( దీనినే ‘ lung cancer ‘ అని అంటారు.) , అన్న వాహిక కాన్సర్ , లేక ‘ oesophageal cancer ‘ , కడుపు లో కాన్సర్, మూత్రాశయ కాన్సర్, మూత్ర పిండాల లో కాన్సర్, పాంక్రియాస్ కాన్సర్, లివర్ కాన్సర్ లకు ప్రత్యక్షం గా కారణ భూతమవుతుందని ఖచ్చితంగా తెలిసింది. స్త్రీ లలో పైన తెలిపిన వాటితో పాటు సెర్వికల్ కాన్సర్ ( అంటే గర్భాశయ ద్వారం లో వచ్చే కాన్సర్ ) కూడా పొగ పీల్చడం వల్ల వస్తుంది.
కాన్సర్ కారణాలు ప్రధానం గా జన్యు లోపం వల్ల వచ్చేవీ , మన స్వయంకృతం వల్ల వచ్చేవీ. కొన్ని రకాల కాన్సర్లు జన్యులోపం తో ఉండే వారిలో అలవాట్లలో మార్పులూ తేడాలూ ఉండటం వల్ల వచ్చే మార్పులు కూడా కలిసి అగ్నికి ఆజ్యం తోడైనట్లు కాన్సర్ కారకాలవుతాయి.
జన్యు లోపం అంటే ఏమిటి: మన దేహం లో ప్రతి జీవ రసాయన క్రియా ఒక క్రమ పధ్ధతి లో మన జీవితాంతమూ జరగటానికి మన జన్యువులే కారణం. ఈ జీవ రసాయన చర్యలు రోజూ వందలూ వేలల్లో నిరంతరాయంగా జరుగుతుంటాయి మన దేహంలో మనం నిద్ర పోయినా మెలకువతో ఉన్నా !
వీటన్నిటికీ సంబంధించిన కార్యక్రమాలూ అంటే ‘ programmes ‘ అంటే ఏ సమయం లో ఏ చర్య జరగాలనే కార్యక్రమ వివరాలు అన్నీ మన దేహం లో ఉన్న ప్రతి కణంలో ఉన్న జన్యువులలోనూ నిక్షిప్తమై ఉన్నాయి. అంటే అవి సహజం గా మానవులలో ఉండే అతి సూక్ష్మమైన మైక్రో చిప్స్ ‘ smallest micro chips in the universe ‘ అన్న మాట.
ఈ జన్యువులు ఉండే కణాలు మన దేహం లో పెదవులు, నోరు, స్వర పేటిక, గొంతు, శ్వాస కోశం, అన్న వాహిక, ఉదర కోశం అంటే ‘ stomach ‘ , మూత్రాశయం, కాలేయము, పాంక్రియాస్ , మూత్ర పిండాలు, ఈ భాగాలు అన్నిటిలోనూ , కొత్త కణాలు నిరంతరాయం గా నిర్మాణం అవుతూ ఉండటానికి అంటే కొత్త కణాలు ఒక క్రమ పధ్ధతి లో పుడుతూ ఉండటానికి తగిన విధంగా ప్రోగ్రాం అయి ఉంటాయి.
మనం ముందు భాగాలలో చూసినట్లు , పొగ పీల్చే వారి దేహం లోకి పొగ తో పాటు ప్రవేశించిన రమారమి నాలుగు వేల రసాయన పదార్థాలు, విష తుల్యమైన వాయువులూ, కాన్సర్ కారకం గా మారి అతి సున్నితమైన, అతి సూక్ష్మమైన ఈ జన్యు నిర్మాణాలను పదే పదే ముట్టడి చేస్తాయి. అంటే ‘ attack on the genetic structure of cells by the toxins present in the tobacco smoke ‘. ఈ ముట్టడి పొగ పీలుస్తున్నంత సేపూ జరుగుతూ ఉంటుంది.
పొగాకు పొగ లో ఉండే ఈ విష పదార్ధాల ముట్టడి వల్ల జన్యువుల కార్యక్రమాలలో సమూల మైన మార్పులు వస్తాయి. అప్పుడు అంత వరకూ ఒక క్రమ పధ్ధతి లో జరిగిన కొత్త కణాల పుట్టుక అంతా అవకతవకలతో ఒక క్రమ పధ్ధతి కోల్పోయి జరుగుతూ ఉంటుంది. ఈ అక్రమం గా పుడుతూన్న కణాలే కాన్సర్ లేక ‘ tumour ‘ కారక కణాలు.
జన్మతహా జన్యులోపాలతో పుట్టినవారు ఈ ‘ పొగాకు పొగ ముట్టడి ‘ కి ఇంకా త్వరగా ఫలితం అనుభవిస్తారు. ఈ జన్యు లోపాలు అన్నీ మనకు తెలియక పోవచ్చు. తెలియవు కూడా. ఎందుకంటే మనం కేవలం బయటకు కనిపించే అవయవ లోపలే జన్యు లోపాలు అనుకుంటాము కానీ దేహం లో మనకు తెలియనివీ, బయటకు కనపడనివీ చాలా జన్యు లోపాలు ఉండవచ్చు.
ఈ విధంగా పొగ పీల్చే వారు, జీవితాలను ఒక లాటరీ ‘ lottery ‘ లాగా వారి ప్రాణాలను ‘ పణం ‘ గా పెడుతూంటారు. అందు వల్లనే పొగాకు పీల్చేవారందరూ బాధితులు కారు. కానీ ఎక్కువ మంది అవుతారు.
ఇక్కడ ఒక ఉదాహరణ : బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ , టొబాకో పైపు ద్వారా పీల్చే వాడు. అతను ‘ 89 ‘ సంవత్సరాలు బ్రతికాడు. అతనూ , అతని పైపూ ఒక ట్రేడు మార్కు అయ్యాయి చాలా మంది పొగ తాగే వారికి. పొగ తాగే వారు, పలు మార్లు, పొగ తాగని వారిని ఎద్దేవా , లేక హేళన చేసే వారు చర్చిల్ బ్రతకలేదా పైపు పీలుస్తూ ‘ 89 ‘ ఏళ్ళు’ అని
కానీ ఇటీవల తెలిసిన నిజం , చర్చిల్ ఎప్పుడూ పైపును నోట్లో ఉంచుకునేవాడు కానీ పీల్చేవాడు కాదని !!!. అలా స్టైలు కోసం సిగరెట్టూ, పైపూ నోట్లో పెట్టుకునే వారు ఈకాలం లో లక్ష కు ఒకరున్నా గొప్ప !!!
ఇంకో విషయం. ప్రతి సిగరెట్టు లో రమారమి ఒక మిల్లీ గ్రాము నికోటిన్ ఉంటుంది. ఒక మిల్లీ గ్రాము అంటే ఒక గ్రాము లో వెయ్యో వంతు. కానీ కేవలం ‘ 60 ‘ అంటే అరవై మిల్లీ గ్రాముల స్వచ్చ మైన ‘ pure nicotine ‘ నికోటిన్ కనక శరీరం మీద పడితే ( అంటే చర్మము మీద పడితే చాలు ) అది మృత్యువు కు కారణం అవుతుంది అని ప్రయోగాల వల్ల తెలిసింది.
ఇక్కడ ఒక మిల్లీగ్రాము నికోటిన్ తో పాటు మనం గుర్తు ఉంచుకోవలసినది మిగతా వందలూ, వేల విష విష పూరితమూ , హానికరమూ అయిన పదార్ధాలు అన్నీ కలిసి కలిగించే మార్పులూ , అనర్దాలూ !!!
వచ్చే టపాలో పొగాకు మానడం ఎట్లాగో చదవండి. ( ఈ బ్లాగు లో ఉన్న యు ట్యూబ్ లో నుంచి జతచేసిన వీడియోలు మరవకుండా చూడండి !!! )
పొగాకు కు ఋణం – ప్రాణం పణం – 5 . శ్వాస కోశం లో పొగాకు తెచ్చే మార్పులు:
In Our Health on ఫిబ్రవరి 11, 2012 at 7:09 సా.పొగాకు కు ఋణం – ప్రాణం పణం – 4. ( మన రక్త నాళాల లో పొగాకు తెచ్చే మార్పులు ).
In Our Health on ఫిబ్రవరి 9, 2012 at 9:14 ఉద.పొగాకు కు ఋణం – ప్రాణం పణం – 4. ( మన రక్త నాళాల లో పొగాకు తెచ్చే మార్పులు ).
పొగాకు లేక సిగరెట్టు పీల్చడం వల్ల రక్తము లో నూ రక్తనాళాల లోనూ మార్పులు వస్తాయి.
రక్తము లో వచ్చే మార్పులు:
పొగాకు చాలా కాలం పీల్చడం వల్ల రక్తము లో ఉండే ప్లేట్ లెట్స్ అనే కణాలు సరిగా పని చేయక అవి గుంపులు గా ఏర్పడతాయి. సాధారణంగా ఈ ప్లేట్ లెట్స్ అనే రక్త కణాలు మన కు ఎక్కడైనా ఏదైనా దెబ్బ తగిలితే ఆ ప్రాంతానికి ఎక్కువ సంఖ్య లో చేరుకొని మనకు ఎక్కువ రక్తస్రావం అవకుండా రక్తాన్ని గడ్డ కట్టించే క్రియ లో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ ముఖ్యమైన క్రియ ను రక్త ఘనీకరణం లేక ‘ blood clotting ‘ అంటారు.
ఈ ప్లేట్ లెట్స్ గుంపులు గా ఏర్పడుతూ వుండటం వల్ల అతి సన్నని రక్త నాళాలు పూడుకు పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ అతి సన్నని రక్తనాళాలు ప్రధానం గా మన గుండెకు సరఫరా చేసే రక్త నాళాలు మరియూ మన మెదడుకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు.
ఇక్కడ గమనించవలసినది ప్లేట్ లెట్స్ గుంపులు లేక సమూహాలుగా ఏర్పడటం మనకు ఏ దెబ్బా తగలక పోయినా జరుగుతుంది , పొగాకు పీల్చడం వల్ల.
రక్త నాళాలలో పొగాకు తెచ్చే మార్పులు:
పొగాకు చేసే ఇంకో హాని రక్తనాళాలను కుంచించుకు పోయేట్టు, మరియూ రక్తనాళాల గోడలను మందంగా చేయటం. ఈ విధంగా జరగటం వల్ల రక్తనాళాల వ్యాసం అంటే ‘ diameter ‘ తగ్గిపోయి రక్త పీడనం ఎక్కువ అవుతుంది. అంటే ‘ high blood pressure’ అన్న మాట.
ఇలా రక్త పీడనం ఎక్కువ అవటం వల్ల మెదడు లో ఉండే అతి సున్నితమైన రక్త నాళాలు ఈ ఎక్కువైనా రక్త పీడనానికి తట్టుకోలేక చిట్లి పోతుంటాయి.
దీనినే మనం పక్షవాతం లేక ‘ brain stroke ‘ అంటాము.
రక్త నాళాల లోనూ, రక్త ప్రసరణ లోనూ , రక్త కణాల లోనూ పొగాకు తెచ్చే ఈ మార్పులు ‘ గుండె పోటు ‘ అంటే ‘ heart attack ‘ కు కారణం అవుతాయి.
ఎక్కువగా పొగ తాగే వారికి ఈ ప్రమాదం పొంచి ఉంటూంది ఎప్పుడూ.
ఇదే కారణం వల్ల కొందరికి మూత్ర పిండాలు పాడైపోవడమూ, కొందరికి కంటిలోని రక్తనాళాలు దెబ్బ తిని , చూపు మందగించడం కూడా జరుగుతుంది.
కొందరిలో చేతి వేళ్ళ చివరలు, కాలి వేళ్ళ చివరలూ రక్తనాళాల్లో వచ్చే ఈ మార్పుల వల్ల రక్త సరఫరా బాగా తగ్గి పోయి, చచ్చు పడి పోతాయి.
పొగాకు మనలో తెచ్చే ఇంకొన్ని మార్పులు వచ్చే టపా లో చదవండి.
‘ పొగాకు కు ఋణం – ప్రాణం పణం ‘ – 3. ( మనలో పొగాకు తెచ్చే మార్పులు )
In Our Health on ఫిబ్రవరి 7, 2012 at 10:36 సా.సిగరెట్ ‘ తాగే వారికి ‘ ఆ కోరిక ఎట్లా బలపడుతుంది?
మన నాడీ మండలం పైన పొగాకు ప్రభావం:
‘ పొగాకు కు ఋణం , ప్రాణం పణం ‘ – 2
In Our Health on ఫిబ్రవరి 6, 2012 at 10:31 ఉద.
|
||||
|
|
||||
” పొగాకు కు ఋణం, ప్రాణం పణం ” – 1.
In Our Health on ఫిబ్రవరి 5, 2012 at 11:36 ఉద.టొబాకో అనే స్పానిష్ పదము మొట్టమొదటిగా ‘తియన ‘ అనే కార్రిబియన్ భాష నుంచి పుట్టింది. ఈ టొబాకో నికోటియాన అనే జాతి కి చెందిన మొక్క. ఈ మొక్క ఆకులు పొగాకు గాను, నశ్యం గాను, పాన్ లలో వాడే గుట్కా గానూ ప్రధానం గా ఉపయోగిస్తారు. పోర్చుగల్ కు ఫ్రెంచ్ రాయబారి జేమ్స్ నికోట్ట్ గౌరవార్ధం ఈ టొబాకో మొక్క జాతికి నికోటియానా అని పేరు పెట్టడం జరిగింది. టొబాకో ను చైనా, కుబా , అమెరికా దేశాలల్లో వాణిజ్య పంట గా పెంచుతున్నారు.
ఆంగ్లేయ వలసదారులు అమెరికా వెళ్లి అక్కడనుంచి యూరప్ దేశాలకు టొబాకో ను తెచ్చి దాని వాడకాన్ని ఎక్కువ చేశారు. తరువాత తాము పాలిస్తూన్న కొన్ని వలస దేశాలల్లో ( అందులో భారత దేశం ఒకటి ) పొగాకు పంట ను విస్తారం చేశారు తమ వ్యాపార ప్రయోజనాల కోసం.
దీని వ్య సన గుణం వల్ల టొబాకో వాడకం చేస్తున్న వారు క్రమంగా బానిసలవుతారు. టొబాకో వాడకపోతే ఉండలేము అన్న స్థితి కి వస్తారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) రిపోర్ట్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఒక బిలియన్ మంది అంటే రమారమి ప్రపంచ జనాభాలో మూడో వంతు టొబాకో వాడుతున్నారు.
టొబాకో వల్ల ప్రతి సంవత్సరమూ యాభయి నాలుగు లక్షలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ( అవును. ఆశ్చర్యంగా ఉంది కదూ ! నిజమే ! అచ్చు తప్పులు ఏవీ లేవు. అక్షరాలా యాభై నాలుగు లక్షలమంది ). ఇవన్నీ నివారించాదగ్గ మరణాలు గా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
టొబాకో వాడకం పాశ్చాత్య దేశాలల్లో తగ్గు ముఖం పడుతూండగా , అభివృద్ధి చెందుతూన్న దేశాలల్లో దాని వాడకం ఎక్కువ అవుతూ పోతూంది. అందులోనూ పేద ప్రజలే ఎక్కువ గా పొగాకు వాడుతూ అనేక విధాలుగా నష్ట పోతున్నారు ప్రపంచ వ్యాప్తంగా.
టొబాకో లో ప్రధానంగా ఉండే నికోటిన్ చాలా మొక్కలల్లో ఉండే పదార్ధము. అది నాడీ మండలం పైన పని చేసే విష పదార్ధము. మొక్కలల్లో ఈ నికోటిన్, కీటకాల పైన అత్యంత ప్రభావం చూపే విషపదార్ధము.
పొగాకు లో ఉండే అనేక విష పదార్ధాలు మన దేహం ఫై ఏ విధంగా దుష్ప్రభావం చూపిస్తాయో వచ్చే టపా లో చదవండి.
‘ పొగాకు కు ఋణం, ప్రాణం పణం’
In Our Health on ఫిబ్రవరి 4, 2012 at 10:18 ఉద.‘ పొగాకు కు ఋణం, ప్రాణం పణం’

పొగాకు ( tobacco ) గురించి అందరూ ఎందుకు తెలుసుకోవాలి?
పొగాకు ( tobacco ) మహమ్మారి ఏటా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మరణాలకు కారణ మవుతూంది. ప్రత్యక్షంగా పొగాకు పీల్చే వారే కాకుండా పరోక్షంగా ఆ పొగాకును, వారి చుట్టూ ఉండి ఆ పొగను పీల్చే వారు కూడా అనేక శ్వాస సంబంధమైన వ్యాధులతో బాధ పడుతూన్నారు. అందుకే చాలా పాశ్చాత్య దేశాలల్లో బహిరంగ ప్రదేశాలల్లో పొగ తాగటం నిషేధించారు.
దీర్ఘ కాలం పొగ పీల్చటం వల్ల ఊపిరి తిత్తులు ముఖ్యంగా పాడవుతాయి. ఆస్త్మా, ఊపిరితిత్తుల కాన్సర్, ఉబ్బసం, మొదలయిన వ్యాధులు మనిషిని బాధ పెట్టడమే కాక , మృత్యువు కు కూడా కారణం అవుతున్నాయి. రక్తనాళాల్లో దీర్ఘ కాలం పొగ తాగటం వల్ల వచ్చే మార్పులు, రక్త పీడనమూ ( B.P. ), హార్ట్ అట్టాక్ , గుండె జబ్బు, పక్ష వాతమూ మొదలయిన జబ్బులకు హేతువు అవుతున్నాయి. అన్న వాహిక ( oesophagus ), మూత్రాశాయాలల్లో వచ్చే కొన్ని రకాల కాన్సర్ కూడా దీర్ఘ కాలం పొగ పీల్చడం వల్ల నేనని పరిశోధనల వల్ల తెలిసింది.అసంఖ్యాక మయిన జీవితాలను అస్తవ్యస్తం చేయడమే కాక,
ఆర్ధికంగా కూడా ప్రతి కుటుంబానికీ ఎంతో నష్టం కలిగిస్తూ , పురోగతి ని కుంటు పరుస్తూన్న
ఈ పొగాకు కు ‘ ఋణ పడి ‘ తమ ప్రాణాలనీ, తమ చుట్టూ ఉన్న వారి ప్రాణాలనూ ‘ పణం’ గా పెడుతున్నారు మానవులు .
అందువల్లనే ప్రతి ఒక్కరూ ఈ పొగాకు కలిగించే నష్టాల గురించి తెలుసుకోవాలి.
పొగాకు చరిత్ర గురించి మొదటి భాగం వచ్చే టపా లో చదవండి.



