Our Health

Archive for ఫిబ్రవరి 12th, 2012|Daily archive page

పొగాకు కు ఋణం – ప్రాణం పణం ( మీలో మార్పు తెచ్చే కొన్ని వీడియోలు )

In Our Health on ఫిబ్రవరి 12, 2012 at 9:41 సా.

మీకోసం కొన్ని యు ట్యూబ్  లో ఉన్న వీడియోలు  ఇక్కడ జత చెస్తూన్నాను. ఇవి తెలుగు లో లేవు. కానీ శులభం గా అర్ధం  ఆయె విధం గా చాలా శక్తి వంతంగా ఉన్నాయి.చూడండి.

దయ చేసి మీ అభిప్రాయాలు తెలుపండి.

పొగాకు కు ఋణం – ప్రాణం పణం. 6. పొగాకు పీలిస్తే కాన్సర్ ఎట్లా వస్తూంది ?

In Our Health on ఫిబ్రవరి 12, 2012 at 3:06 సా.

పొగాకు పీలిస్తే కాన్సర్ ఎట్లా వస్తూంది?

null

( మానవ దేహం లో ఉండే ప్రతి కణం లోనూ ఉండే జన్యువు ‘ DNA ‘ యొక్క చిత్ర పటం ఇది. పొగాకు పీల్చడం వల్ల ఈ ‘ DNA ‘ నిర్మాణం లో మార్పులు జరిగి కాన్సర్ కారకమైన కణ జాలం ఎక్కువ గా పుడుతుంది, సహజ మైన ఆరోగ్యమైన కణజాలం కాకుండా. పొగాకు పొగ లో ఉండే అనేక విషతుల్యమైన పదార్థాలు ఈ మార్పులు తెస్తాయనే విషయం నిర్వివాదాంశం. )
చాలా మందికి పొగ పీలిస్తే కాన్సర్ వస్తుంది అని మాత్రమే తెలుసు. కానీ ఆ కాన్సర్ ఎన్ని విధాలుగా దేహం లో వస్తూందో తెలియదు. ముఖ్యం గా పొగాకు పీలిస్తే ఎట్లా వస్తూందో తెలియదు.
‘ రోజూ ఇరవై ముప్పై సిగరెట్లో, బీడీలో పీల్చి పారేస్తే సరిపోతుంది, ఎవరు పట్టించుకుంటారు ఇవన్నీ’ అని అనుకుంటారు. అపోహ పడతారు.
కానీ ఎందువల్ల పొగాకు పీలిస్తే కాన్సర్ వస్తూందో తెలుసుకుంటే మంచిది. కారణాలు తెలుసుకోవడం వారిలో పొగాకు తాగటం మానే ప్రయత్నానికి పునాది అవుతుంది.
ఇప్పటివరకూ మనకు పరిశోధనల ద్వారా పొగాకు పీల్చడం , పెదవుల పై కాన్సర్, నోటిలో కాన్సర్, గొంతు లో కాన్సర్, శ్వాస కోశం లో లేక ఊపిరితిత్తులలో కాన్సర్ ( దీనినే ‘ lung cancer ‘ అని అంటారు.) , అన్న వాహిక కాన్సర్ , లేక ‘ oesophageal cancer ‘ , కడుపు లో కాన్సర్, మూత్రాశయ కాన్సర్, మూత్ర పిండాల లో కాన్సర్, పాంక్రియాస్ కాన్సర్, లివర్ కాన్సర్ లకు ప్రత్యక్షం గా కారణ భూతమవుతుందని ఖచ్చితంగా తెలిసింది. స్త్రీ లలో పైన తెలిపిన వాటితో పాటు సెర్వికల్ కాన్సర్ ( అంటే గర్భాశయ ద్వారం లో వచ్చే కాన్సర్ ) కూడా పొగ పీల్చడం వల్ల వస్తుంది.

కాన్సర్ కారణాలు ప్రధానం గా జన్యు లోపం వల్ల వచ్చేవీ , మన స్వయంకృతం వల్ల వచ్చేవీ. కొన్ని రకాల కాన్సర్లు జన్యులోపం తో ఉండే వారిలో అలవాట్లలో మార్పులూ తేడాలూ ఉండటం వల్ల వచ్చే మార్పులు కూడా కలిసి అగ్నికి ఆజ్యం తోడైనట్లు కాన్సర్ కారకాలవుతాయి.
జన్యు లోపం అంటే ఏమిటి: మన దేహం లో ప్రతి జీవ రసాయన క్రియా ఒక క్రమ పధ్ధతి లో మన జీవితాంతమూ జరగటానికి మన జన్యువులే కారణం. ఈ జీవ రసాయన చర్యలు రోజూ వందలూ వేలల్లో నిరంతరాయంగా జరుగుతుంటాయి మన దేహంలో మనం నిద్ర పోయినా మెలకువతో ఉన్నా !
వీటన్నిటికీ సంబంధించిన కార్యక్రమాలూ అంటే ‘ programmes ‘ అంటే ఏ సమయం లో ఏ చర్య జరగాలనే కార్యక్రమ వివరాలు అన్నీ మన దేహం లో ఉన్న ప్రతి కణంలో ఉన్న జన్యువులలోనూ నిక్షిప్తమై ఉన్నాయి. అంటే అవి సహజం గా మానవులలో ఉండే అతి సూక్ష్మమైన మైక్రో చిప్స్ ‘ smallest micro chips in the universe ‘ అన్న మాట.
ఈ జన్యువులు ఉండే కణాలు మన దేహం లో పెదవులు, నోరు, స్వర పేటిక, గొంతు, శ్వాస కోశం, అన్న వాహిక, ఉదర కోశం అంటే ‘ stomach ‘ , మూత్రాశయం, కాలేయము, పాంక్రియాస్ , మూత్ర పిండాలు, ఈ భాగాలు అన్నిటిలోనూ , కొత్త కణాలు నిరంతరాయం గా నిర్మాణం అవుతూ ఉండటానికి అంటే కొత్త కణాలు ఒక క్రమ పధ్ధతి లో పుడుతూ ఉండటానికి తగిన విధంగా ప్రోగ్రాం అయి ఉంటాయి.
మనం ముందు భాగాలలో చూసినట్లు , పొగ పీల్చే వారి దేహం లోకి పొగ తో పాటు ప్రవేశించిన రమారమి నాలుగు వేల రసాయన పదార్థాలు, విష తుల్యమైన వాయువులూ, కాన్సర్ కారకం గా మారి అతి సున్నితమైన, అతి సూక్ష్మమైన ఈ జన్యు నిర్మాణాలను పదే పదే ముట్టడి చేస్తాయి. అంటే ‘ attack on the genetic structure of cells by the toxins present in the tobacco smoke ‘. ఈ ముట్టడి పొగ పీలుస్తున్నంత సేపూ జరుగుతూ ఉంటుంది.
పొగాకు పొగ లో ఉండే ఈ విష పదార్ధాల ముట్టడి వల్ల జన్యువుల కార్యక్రమాలలో సమూల మైన మార్పులు వస్తాయి. అప్పుడు అంత వరకూ ఒక క్రమ పధ్ధతి లో జరిగిన కొత్త కణాల పుట్టుక అంతా అవకతవకలతో ఒక క్రమ పధ్ధతి కోల్పోయి జరుగుతూ ఉంటుంది. ఈ అక్రమం గా పుడుతూన్న కణాలే కాన్సర్ లేక ‘ tumour ‘ కారక కణాలు.
జన్మతహా జన్యులోపాలతో పుట్టినవారు ఈ ‘ పొగాకు పొగ ముట్టడి ‘ కి ఇంకా త్వరగా ఫలితం అనుభవిస్తారు. ఈ జన్యు లోపాలు అన్నీ మనకు తెలియక పోవచ్చు. తెలియవు కూడా. ఎందుకంటే మనం కేవలం బయటకు కనిపించే అవయవ లోపలే జన్యు లోపాలు అనుకుంటాము కానీ దేహం లో మనకు తెలియనివీ, బయటకు కనపడనివీ చాలా జన్యు లోపాలు ఉండవచ్చు.
ఈ విధంగా పొగ పీల్చే వారు, జీవితాలను ఒక లాటరీ ‘ lottery ‘ లాగా వారి ప్రాణాలను ‘ పణం ‘ గా పెడుతూంటారు. అందు వల్లనే పొగాకు పీల్చేవారందరూ బాధితులు కారు. కానీ ఎక్కువ మంది అవుతారు.
ఇక్కడ ఒక ఉదాహరణ : బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ , టొబాకో పైపు ద్వారా పీల్చే వాడు. అతను ‘ 89 ‘ సంవత్సరాలు బ్రతికాడు. అతనూ , అతని పైపూ ఒక ట్రేడు మార్కు అయ్యాయి చాలా మంది పొగ తాగే వారికి. పొగ తాగే వారు, పలు మార్లు, పొగ తాగని వారిని ఎద్దేవా , లేక హేళన చేసే వారు చర్చిల్ బ్రతకలేదా పైపు పీలుస్తూ ‘ 89 ‘ ఏళ్ళు’ అని
కానీ ఇటీవల తెలిసిన నిజం , చర్చిల్ ఎప్పుడూ పైపును నోట్లో ఉంచుకునేవాడు కానీ పీల్చేవాడు కాదని !!!. అలా స్టైలు కోసం సిగరెట్టూ, పైపూ నోట్లో పెట్టుకునే వారు ఈకాలం లో లక్ష కు ఒకరున్నా గొప్ప !!!
ఇంకో విషయం. ప్రతి సిగరెట్టు లో రమారమి ఒక మిల్లీ గ్రాము నికోటిన్ ఉంటుంది. ఒక మిల్లీ గ్రాము అంటే ఒక గ్రాము లో వెయ్యో వంతు. కానీ కేవలం ‘ 60 ‘ అంటే అరవై మిల్లీ గ్రాముల స్వచ్చ మైన ‘ pure nicotine ‘ నికోటిన్ కనక శరీరం మీద పడితే ( అంటే చర్మము మీద పడితే చాలు ) అది మృత్యువు కు కారణం అవుతుంది అని ప్రయోగాల వల్ల తెలిసింది.
ఇక్కడ ఒక మిల్లీగ్రాము నికోటిన్ తో పాటు మనం గుర్తు ఉంచుకోవలసినది మిగతా వందలూ, వేల విష విష పూరితమూ , హానికరమూ అయిన పదార్ధాలు అన్నీ కలిసి కలిగించే మార్పులూ , అనర్దాలూ !!!


వచ్చే టపాలో పొగాకు మానడం ఎట్లాగో చదవండి. ( ఈ బ్లాగు లో ఉన్న యు  ట్యూబ్  లో నుంచి జతచేసిన వీడియోలు  మరవకుండా చూడండి !!! )

%d bloggers like this: