పొగాకు కు ఋణం – ప్రాణం పణం. 9. స్మోకింగ్ మానే పధకం ఎట్లా వేసుకోవాలి ?
మీరు మిమ్మల్ని ప్రేమించండి : ‘ love yourselves’ :
సాధారణం గా యువత లో ఆత్మవిశ్వాసం ఎక్కువ గా ఉంటుంది. కానీ అనేక కారణాల వల్ల, బాల్యం లో నూ, యవ్వనం లోనూ, ఎక్కడో మనసులో ఆత్మ న్యూనతా భావాలు ( పైకి కనిపించక పోయినా ) ఉండ వచ్చు. ఈ ఆత్మన్యూనత వ్యక్తిత్వ వికాసానికి అవరోధం కావచ్చు. ఈ రకమైన ‘ బలహీనత ‘ లను కప్పిపుచ్చు కోవడానికి ఏదో ఒక దురలవాటు చేసుకుంటాము. ఆ సమయం లో, ఆ వయసులో మనం కారణాలు అన్వేషించే స్థితి లో ఉండము. ఫలితం గా బయటికి చక్కగా బట్టలు వేసుకుని, ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉన్నా ‘ అంతరంగ మధనం ‘ అశ్రద్ధ’ చేస్తూ ఉంటాము మనము, తరచూ.
ముందు గా చేయవలసినది: మీ జీవితం ఎంత విలువైనదో గ్రహించడం. విషాదకర గత స్మృతులు ఏవైనా ఉన్నా , ముందుకు సాగాలనే కృత నిశ్చయం తో మీ ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. మీ జీవితం ఎంత విలువైనదో మీకు స్పష్టంగా తెలియాలి. వేల మైళ్ళ దూరం లో ఉండి, దశాబ్దాల తరబడి పొగాకు దుష్ప్రబావాల పరిశోధనలలో తేలిన నిజాలను తొక్కి పట్టి , రోజూ కోట్ల కొద్దీ నికర లాభాలను ఆర్జిస్తూన్న పొగాకు కంపనీలకు మీ జీవితం విలువ ఎందుకు తెలియాలి , మీకే తెలియనప్పుడు ??? !!! లేక మీ దగ్గరలో ఉన్న కిళ్ళీ కొట్టు వాడికి ఎందుకు మీ జీవితం విలువ ??? !!!
పొగాకు పీల్చి ఆయు క్షీణం అవుతున్నప్పుడు ఒక్క రోజు కూడా వారు మన జీవితాన్ని పోడిగించ లేరు కదా వాళ్ళు !!! ???
మీరు ఈ విశాల ప్రపంచం లో ఒకే ఒక్కరు. రెండో ‘ మీరు ‘ ఉండరు. మీకు ఒకటే జీవితం !!. మీరు స్మోకింగ్ చేస్తూ ఉంటే , మీ గతం ఆనంద దాయకం కాక పోగా , పొగాకు దుష్ప్రభావాల వల్ల భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా కష్టాల కడలి అవుతుంది మీకు !!. ఇది పరిశోధనల వల్ల తేలిన యదార్ధం !!!
మీరు కొంత సమయం కేటాయించి , సావధానంగా ఒక కాగితం మీద పొగాకు ( సిగరెట్టు ) తాగటం వల్ల మీకు కలిగే నష్టాలు ఏమిటి? మానేస్తే లాభాలు ఏమిటి అని నోటు చేసుకోండి, సవివరంగా.
ఇలా చేయటానికి ఒక వారం పట్టినా నిరుత్సాహ పడవద్దు. మీకు ఖచ్చితమైన అవగాహన ఏర్పడాలి స్మోకింగ్ వల్ల లాభ నష్టాల గురించి. ( అవసరమైతే ‘ బాగు డాట్ నెట్ ‘ ను పలు సార్లు చూడండి , ‘ browse ‘ చేయండి. ఎందుకంటే దాని లక్ష్యం అదే కదా !! )
వర్తమానం లో, అంటే ఇప్పుడు మీరు ఒక వారం పది రోజులలో స్మోకింగ్ మానెయ్యాలని తీసుకున్న నిర్ణయానికి , మీ కృత నిశ్చయం కూడా తోడు అవుతే , కనీసం పది పదిహేనేళ్ళ ఎక్కువ ఆయుష్షు ను ప్రసాదించు కున్నట్లే కదా మీ అమూల్యమైన జీవితానికి !!
అందువల్ల త్వరగా నిర్ణయం తీసుకోలేక పోతున్నామని నిరుత్సాహ పడవద్దు. నిర్ణయాన్ని తీసుకున్నాక మార్చుకోవద్దు !!!
వచ్చే టపా లో లక్ష్య నిర్దేశనం గురించి చదవండి !!!