పొగాకు కు ఋణం – ప్రాణం పణం. 11. ‘ SMART’ వివరణ:
మనం క్రితం టపా లో ‘ SMART ‘ లో మొదటి అక్షరం అయిన ‘ స్పష్టత ‘ అంటే ఏమిటో చూసాము.
ఇప్పుడు ‘ M ‘ అంటే కొలవ తగిన లక్ష్యాలు పొగాకు మానటం లో ఏమి ఉంటాయో చూద్దాము.
ఇవి పలు రకాలు గా ఉండ వచ్చు పొగాకు మానే వారి ఆలోచనలను బట్టి.
ఈ లక్ష్యం ఎంత కాలం లో మీరు అధిగమించుదామని అనుకుంటున్నారు, సంపూర్ణంగా మానేద్దామని అనుకుంటున్నారా లేక పాక్షికంగా నా ? , పాక్షికమైతే ఎన్ని సిగరెట్టులు తగ్గిద్దామని అనుకుంటున్నారు ?
ఈ విధంగా మీ లక్ష్యాన్ని కొలవవచ్చు.
క్రితం టపాలలో తెలిపినట్లు, పొగ తాగటం మానేద్దామనే మీ లక్ష్యం ఎంత తక్కువ కాలం లో ఎంత సంపూర్ణంగా అధిగమిస్తే అంత మంచిది కదా మీకు.
సాధారణంగా ఈ సమయాలు, సంపూర్నాలూ, పాక్షికాలూ , ఇవన్నీ , సందిగ్ధావస్థ లో ఉన్న వారికి వర్తిస్తూంది.
సావధానం గా ఆలోచించి ధైర్యంగా పొగాకు మానేసే నిర్ణయం తీసుకున్న వారెవరూ నిరాశ చెందరు సరి కదా , మంచి ఫలితాలను త్వరగా అనుభవిస్తారు.
ఇక ‘ A ‘ అంటే సాధించ తగ్గ లక్ష్యం. పొగాకు మానేయటం అనేది సంపూర్ణంగా సాధించ తగ్గ లక్ష్యమే కదా. ఇక్కడ మానవ శక్తి మననం చేసుకోవాలి.
ఏది సాధించలేదు మానవులు ?!! ప్రతి మానవుడి లో నిద్రాణమైన శక్తులు ఉంటాయి. వాటిని వెలికి తీయటం లో కృత క్రుత్యుడైతే ఎంతో సాధించ గలుగుతాడు.
అనుకున్నది సాధిస్తారు. ‘ అనుకున్నది ‘ అంటే ఒక స్పష్టమైన లక్ష్యం. పొగాకు మానటం అనే లక్ష్యం కొద్ది గా కష్టం కావచ్చు కానీ అసాధ్యం మటుకు ఎంత మాత్రం కాదు. ఇది ఎవరికైనా వర్తిస్తూంది.
‘ ఒకసారి అలవాటైతే మానటం సాధ్య పడదు’ అనే వాక్యం కేవలం ఒక అపోహ మాత్రమే !!!
వచ్చే టపాలో మిగతా వివరాలు చూద్దాము !