ప్రేమించడం ఎట్లా ? 7. విశ్వ వ్యాప్త వైవిధ్యం !
విశ్వ వ్యాప్త వైవిధ్యం ! : మానవులంతా ఒకటే ! కానీ వ్యక్తిత్వ రీతుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ , వారి, వారి ప్రత్యేకతలను సంతరించుకుని , ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకుని ఉంటారు ! దాని వలన , ఏ ఒక్కరూ , ఇంకొకరి కన్నా ఎక్కువా కాదు , తక్కువా కాదు ! మనం ఇతర వ్యక్తుల మీద అభిప్రాయం ఏర్పరుచుకునే సమయం లో వారిని కేవలం ఒక వ్యక్తి గానే పరిగణించాలి కానీ , వారిని చెడ్డ వారి గానో , లేదా మంచి వారి గానో , వెంటనే వర్గీక రించ కూడదు ! అట్లాగే , మీరు ప్రేమించే వ్యక్తులను కూడా , వారు చెడ్డ వారైనా , లేదా మంచి వారైనా కూడా , అంగీక రించే స్థితి లో ఉండాలి ! మార్పు మానవ సహజం , అట్లాగే చెడు గుణాలు కూడా , మారడానికి అవకాశం ఇస్తే మారే మార్గాలు చాలా ఉన్నాయి ! మీరు ప్రేమించే వ్యక్తులకు కూడా , అట్లాంటి అవకాశం ఇవ్వాలి ! క్రితం టపా లో చెప్పు కున్నట్టు , ఒకరి మంచి గుణం , ఇంకొకరికి ఆమోద యోగ్యం కాక పొతే , అది చెడు గుణం అవ వచ్చు ! మనం ప్రేమించే వ్యక్తులను , ఖచ్చితం గా , ఒక్క పొరపాటు కూడా లేకుండా , అంతా , మన ‘ ఆధీనం ‘ లోనే ఉండి , మనం చెప్పిన ట్టే అనుసరించుతూ , మన లాగే ప్రవర్తించాలి అనుకోవడం , నిరంకుశత్వం అనబడుతుంది ! ఇతరుల స్వేఛ్చా స్వాతంత్ర్యాలను కాల రాచినట్టు అవుతుంది , అది ప్రేమించిన వ్యక్తులైనా కూడా ! ఆ పరిస్థితులు , ప్రేమ పెంపొందడానికి అనుకూలం కాదు !
మీరు ప్రేమించిన వ్యక్తులలో ఉన్న మంచి గుణాల మీద కేంద్రీకరించండి : మీరు మనసారా ప్రేమించే వ్యక్తులలో , మీరు ఎప్పుడూ , కేవలం సద్గుణాలు మాత్రమే , చూడండి ! అంటే పాజిటివ్ క్వాలిటీస్ ! మీ ప్రేయసి ఒక మంచి గాయని అవుతే , మీరు ఆమె లో ఉన్న ఆ గుణాన్ని పెంపొందించు కునే మార్గాలు సులభం చేయండి ! వీలు చేసుకుని , ఆమె చేత ఒక మంచి పాట ను రికార్డు చేయించండి ! ఆమెలో నిస్త్రాణం గా ఉన్న కళ ను వెలికి తీయండి ! అప్పుడు , ఆమె లో కలిగిన ఆనందం పంచుకోండి ! ఆనందం తో పాటుగా , అప్పుడు , ప్రేమ కూడా పెంపొందుతుంది !
ఆమె లో మీకు ఇష్టం లేని గుణాలను మీ చిరు నవ్వు తో ఆమోదించండి : ప్రతి వ్యక్తి లోనూ , ఇతర వ్యక్తులకు ఇష్టమయే విషయాలు ఉన్నట్టే , నచ్చని విషయాలు కూడా ఉంటాయి, సహజం గానే ! మన ఔదార్యం , మనకు నచ్చని విషయాలను పట్టించు కోకుండా ప్రవర్తించే , మన ఓరిమి లోనే ఉంటుంది ! కొందరు స్త్రీలు , విపరీతం గా హడావిడి చేస్తూ , ఎప్పుడూ గల గల లాడుతూ ఉంటారు , ఏ సమయం లోనైనా ! ఆ సమయాల లో , వారి ప్రవర్తన ను విమర్శించ కుండా , హుందా గా ఒక చిరు నవ్వు నవ్వితే సరిపోతుంది ! మీ ప్రేయసి కి, వంట చేయడం అంత బాగా రాక పోయినా కూడా , ఏదో ఒక్క ఐటం బాగా చేయడం వచ్చినా కూడా , మనసారా అభినందించండి, అది తింటూ !
స్పష్టమైన ప్రసారం ! అంటే కమ్యూని కేషన్ : మీరు ప్రేమించే వ్యక్తి తో మీరు ఒక స్థిరమైన , తెగిపోని , ప్రసారం ఏర్పరుచుకోవాలి ! అది ఏ ప్రసార మాధ్యమం అయినా కావచ్చు ! మీ స్వంత చేతి వ్రాత తో రాసిన ఉత్తరం నుంచి మొబైల్ , లేదా సెల్ ఫోన్ , ఈమెయిలు , వీడియో చాట్ , లేదా వ్యక్తి గతం గా కలిసి సంభాషించు కోవడం , ఇట్లా ఎన్నో రకాలు గా ! ముఖ్యమైన విషయం : ఒక క్రమ పధ్ధతి లో , కనీసం రోజూ ( అయితే మరీ మంచిది ! ) , లేదా వారానికి , నెలకో , ఒక సారైనా తప్పని సరిగా పరస్పరం కమ్యూని కేట్ చేసుకోవడం , ప్రేమ కు కావలసిన ముడి సరుకు ! ఇంకో విషయం : కేవలం కమ్యూని కేట్ చేసుకుని , పై పై మాటలు , హలో అంటే హలో అనుకుంటే ప్రేమ హాలో గానే ఉంటుంది ! అరమరికలు లేకుండా , పరస్పరం అన్ని విషయాల మీదా మాట్లాడుకోవడం చేయాలి ! అట్లాగే పరస్పర వ్యక్తి గత సంబంధాలలో ఎదురయే సమస్యల గురించి ప్రత్యేకం గా మాట్లాడుకోవడం చేయాలి , చిన్న చిన్న విషయాలను నాన్చి , జటిల సమస్యలు చేసుకోకుండా , ఎప్పటి కప్పుడు పరిష్కరించు కుంటూ ఉండాలి ! దానితో , ఒకరి గురించి ఇంకొకరికి బాగా తెలియడమే కాకుండా , వారి వారి అభిప్రాయాలూ , వారి సమస్యా పరిష్కార నిపుణతా కూడా తెలుస్తాయి ! కలిసి జీవితం గడిపే సమయం లో ఈ లక్షణాలు ఎంత గానో ఉపయోగ పడతాయి కదా !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !