ప్రేమ తో ఆరోగ్యం. మిగతా లాభాలు.
ప్రేమ తో సౌందర్యం : ప్రేమ మయమైన జీవితాలు గడిపితే , చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది ! ఊక దంపుడు మాటలు అనుకుంటున్నారు కదూ ! కాదు యదార్ధమే ! ప్రేమ , మానసిక వత్తిడిని అనేక విధాలు గా తక్కువ చేస్తుంది, దానితో , తీవ్రమైన మానసిక వత్తిడి కలిగినప్పుడు, మన దేహం లో విడుదల అయే కార్టి సోల్ అనే స్టీరాయిడ్ హార్మోనులు తక్కువ గా విడుదల అవుతాయి ! శాస్త్రీయం గా ఈ కార్టి సోల్ హార్మోనులు ముఖం మీద మొటిమ లకు కారణం ! ఎక్కువ వత్తిడి తో ఎక్కువ మొటిమలు , తక్కువ వత్తిడి తో తక్కువ గా మొటిమలు ! ఆ కారణం గానే, చర్మం నవ నవ లాడుతూ ఉంటుంది, ఏ క్రీమూ పట్టించక పోయినా !
హృదయం లో ప్రేమ నిండితే , గుండె ఆరోగ్యం పదిలం : హృదయాన్ని కేవలం రక్త నాళాల తోనూ , రక్తం తోనూ నింపి ఉంచితే , ఆ గుండె బరువవుతుంది ! గుండె జబ్బులు రావడానికి అవకాశం హెచ్చుతుంది ! ప్రేమ ను గుండె నిండా నింపితే , ఆ గుండె తేలిక అవుతుంది ! దీనికి కూడా శాస్త్రీయం గా రుజువులు ఉన్నాయి ! ప్రేమ నిండిన హృదయాలు , తక్కువ వత్తిడి తో పని చేస్తూ ఉంటాయి ! అందువల్ల మతలబు కేవలం లబ్ , డబ్ అనే శబ్దాలతోనే కొట్టుకుంటూ ఉంటుంది ! అదే ప్రేమ వెలితి అయిన గుండె డబ డబా , డబ డబా , డబ డబా , దడ దడా , దడ దడా, కొట్టుకుంటూ , ఆందోళన లో డోల లాడుతూ , మనలను కూడా ఆందోళనల లో పడేస్తుంది !
ప్రేమ తో నొప్పి తక్కువ : ఒక పరిశోధన లో , రెండు ప్రేమించే హృదయాలు, వారి వారి చేతులను పరస్పరం పెనవేసుకుని , ఎలెక్ట్రిక్ షాక్ కనుక ఎదుర్కుంటే ( అంటే మన ఇళ్ళలో లా గా ప్రమాదకరమైన ఓల్టేజి కాదు ! ) వారిరువురిలోనూ ఆ ఎలెక్ట్రిక్ షాకు ను తట్టుకో గలిగే ఓరిమి ఎక్కువగా ఉండడమే కాకుండా , దానివలన వారు అనుభవించే నొప్పి కూడా తక్కువ అయిందిట !
ప్రేమ తో ఋతు స్రావం సవ్యం : యుక్త వయసు వచ్చిన యువతులు కూడా , ప్రేమ ను పొందుతూ , మానసిక ప్రశాంతత తో జీవనం గడుపుతూ ఉంటే , వారి నెల వారీ ఋతు స్రావం , ఏ ఒడు దుడుకులూ లేకుండా , సవ్యం గానూ , సహజం గానూ జరుగుతుందని పరిశోధనల వల్ల తెలుసుకోవడం జరిగింది ! తీవ్రమైన మానసిక వత్తిడి తో పాటుగా , ప్రేమ కొర వడిన స్త్రీలలో వారి గర్భం కూడా ఆ బాధను అనుభవిస్తూ , పర్యవసానాలు , అధిక ఋతు స్రావం అవడమూ , ఎక్కువ రోజులు అవడమూ జరుగుతుంది. అంతే కాకుండా , కనీసం వారానికి ఒకసారి రతి లో పాల్గొనే స్త్రీలలో , ఋతు స్రావం సరళం గా సామాన్య పరిమాణం లోనే అవుతుందని స్పష్టమయింది ! కారణం, వారి లో సహజ ఋతు స్రావానికి అవసరమయే , ఈ స్ట్రో జెన్ హార్మోను సమ పాళ్ళ లో విడుదల అవుతూ ఉంటుంది !
ప్రేమతో మానసిక శాంతి ! : ప్రేమ వలలో చిక్కుకుని , పరస్పరం ఇరుక్కున్న వారి మనసులు విశాలం గా ఉండడమే కాకుండా , గాఢమైన వారి ప్రేమ , వారి మెదడు లో కూడా అనేక రకాలైన ఆరోగ్య కరమైన జీవ రసాయనాలను ప్రేరేపిస్తూ , డోపమిన్ అనే అతి ముఖ్య మైన రసాయనాన్ని విడుదల చేస్తూ , వారిని , జీవితం లో ఎక్కువ శక్తి వంతం గానూ , ఎక్కువ ఆశావాద దృక్పధం తోనూ , అంటే పాజిటివ్ గా ఆలోచింప చేస్తూ , డిప్రెషన్ కు దూరం గా ఉంచుతుంది !
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు !