ప్రేమించడం ఎట్లా ? 6. ప్రతి వారినీ గౌరవించడం.
ప్రతి వారినీ గౌరవించడం : సాంకేతికత పెరిగి , ప్రపంచం లో మానవ సంబంధాలు కేవలం వివిధ గాడ్జెట్ లతో కొన సాగుతున్నాయి ! కానీ ఎంతో లాభాలతో , ముందుకు దూసుకు పోతున్న కంపెనీలన్నీ కూడా మానవ సంబంధాల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాయి, వ్యాపార ప్రకటనల తో పాటు గా !
ప్రతి వ్యక్తి కూడా, ప్రేమ ప్రేమ మయ జీవితం గడపాలంటే , ప్రతి ఇతర వ్యక్తి నీ , వారి పుట్టుక, కులం , పెరుగుదల , వారి విద్య, ఉద్యోగం , తాహతు , వారి సంపాదనా , ఈ విషయాలతో ప్రమేయం లేకుండా , కేవలం, వారిని తోటి మానవులలాగా గౌరవించడం అలవాటు చేసుకోవాలి ! ఈ విధం గా, చాలా మంది అనుకుంటున్నట్టు , కేవలం సాధువులూ సన్యాసులు మాత్రమే కాదు ! ఎవరైనా చేయ గలరు ! మనం , దేశాలూ , ఖండాలూ , ఈ నాగరికతలూ , మతాలూ , సామాజిక వ్యత్యాసాలూ , భౌతిక అవసరాలూ , ఇవన్నీ ఒక్క క్షణం మనసులో కి రానీయకుండా , కేవలం ఈ భూలోకం లో ఉంటున్న ఒక ‘ గ్రహ వాసులు ‘ గా అనుకుంటే , కేవలం ఇతర మానవులను గౌరవించమా ? ! కానీ యదార్ధం అందుకు భిన్నం గా ఉంది ! ఈ భూగోళం లో ఉన్న మానవులందరి మధ్యా , భౌతికం గా కనిపించక పోయినా కూడా , దుర్భేద్యమైన అంతరాలూ , పరిధులూ , పరిమితులూ ఉన్నాయి ! దానికి అనుగుణం గానే , ప్రేమ కూడా పరిణామం చెందింది ! అంటే మానవులు కొందరినే , ప్రేమించడం , గౌరవించడం మొదలు పెట్టారు. ఒక వ్యక్తి , ఇంకొకరి మీద గౌరవం చూపించడం , వారు చూపించే ప్రేమ లో ఒక అతి ముఖ్యమైన లక్షణం ! మనం గౌరవించ లేని వారిని ప్రేమించ లేము కూడా ! ఇతరుల మీద గౌరవం , వారితో మన అనుభవాల బట్టీ , అభిప్రాయాల బట్టీ ఏర్పడుతుంది ! వాటి పర్యవ సానం గా , మనం ఇతర వ్యక్తుల విలువ గ్రహించ గలుగు తాము ! ప్రతి జీవితమూ , ఈ ప్రపంచం లో విలువైనదే ! అట్లాగే మానవులంతా కూడా విలువైన వారే ! మనలో ఉన్నట్టే , ఇతర మానవులందరి లోనూ , అనుభూతులూ , కోరికలూ , వాంఛ లూ , ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవం – ఈ లక్షణాలన్నీ ఉంటాయి. మీరు ప్రేమించే ప్రతి వ్యక్తి లోనూ ఉంటాయి . ఈ సత్యాన్ని , మనం మన చేతలలో కూడా చూపిస్తే , ప్రేమ , ఒక నిశ్చల ప్రవాహం లా మనలో ప్రవహిస్తూ ఉంటుంది, తెలియకుండానే !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !