5. ఆస్త్మా చికిత్సా సూత్రాలేంటి ?
ఆస్త్మా వ్యాధి ఏమిటి , అది ఏ పరిస్థితులలో వస్తుంది , దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి అనే విషయాలు క్రితం టపాలలో తెలుసుకున్నాం కదా ! ఇప్పుడు ఆస్త్మా వ్యాధి చికిత్స లో మూల సూత్రాలు తెలుసుకుందాం ! వీటిని ప్రత్యేకించి ఆస్త్మా ఉన్న వారే కాకుండా , వారి తలి దండ్రులు , బంధువులు , స్నేహితులు కూడా తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే చికిత్స లో వారి సహాయం, సహకారం కూడా ఆస్త్మా ఉన్న వారికి ఏదో ఒక సమయం లో అవసరం ఉండ వచ్చు !
ఆస్త్మా వ్యాధిలో , మునుపే తెలుసుకున్నట్టు , ఊపిరి తిత్తులలో ఉండే అతి సూక్ష్మ కండరాలు వీటినే బ్రాంకియల్ స్మూత్ మసుల్ అంటారు ఆ కండరాలు బిగుతు గా అవుతాయి ఆ పరిస్థితిని బ్రాంకో స్పాసమ్ అంటారు ! అట్లా ఆ కండరాలు బిగుతు గా అవడం వల్ల , ఊపిరి తిత్తులలో గాలి శులభం గా ప్రవేశించ లేక పోవడం , ముఖ్యం గా గాలి బయటకు వెళ్ళడం కూడా తీవ్రం గా అవరోధం గా ఉండి ఆస్త్మా ఎటాక్ గా పరిణమిస్తుంది ! పై విషయాలు ఎందుకు తెలుసుకోవాలి ? అంటే , చికిత్స లో ప్రధానం గా ఈ బ్రాంకియల్ స్మూత్ మసుల్ ను వ్యాకోచించ పరిచే మందును ఇన్హేలర్ రూపం లో ఇస్తారు !ఈ మందు, ఊపిరితిత్తులలో ఉండే బ్రాంకస్ ను వ్యాకోచ పరుస్తుంది కనుక దీనిని బ్రాంకో డై లేటర్ మందు అని అంటారు ! ( broncho dilator ) వీటికి ఇంకో పేరు, బీటా టూ ఎగోనిస్ట్ మందులు ( beta 2 agonists ) ( ఉదాహరణ కు సాల్ బ్యూ టమాల్ , టె ర్ బ్యూ టలిన్ ఇన్హేలర్ మందులు ). ఆస్త్మా చికిత్స లో ప్రధానం గా రెండు రకాల ఇన్హేలర్ మందులు అవసరమవుతాయి
1. ఉపశమనానికి వాడే ఇన్హేలర్ లు. వీటినే రిలీవర్ ఇన్హేలర్ లు అని అంటారు.
పైన ఉదహరించిన బ్రాంకో డై లేటర్ ఇన్ హేలర్ లు ఈ కోవ కు చెందినవే ! ఇవి త్వరగా ,ఊపిరితిత్తులలో ఉండే స్మూత్ మసుల్ ను వ్యాకోచింప చేసి , ఆ కండరాల బిగుతును వదులు చేసి , ఆస్త్మా ఉపశమనం కలిగిస్తాయి ! దానితో మళ్ళీ శ్వాస తీసుకోవడం సులువు అవుతుంది. ఈ రకమైన ఇన్హేలర్ మందులను వారానికి రెండు మూడు సార్ల కంటే ఎక్కువ గా తీసుకో కూడదు ! అట్లా తీసుకునే అవసరం కలిగినప్పుడు , స్పెషలిస్టు ను సంప్రదించడం మంచిది ! ఎందుకంటే , ఆ పరిస్థితి , ఆస్త్మాతీవ్రత ను తెలియ చేస్తుంది !
2. నివారణకు వాడే ఇన్హేలర్ లు వీటినే ప్రివెంటివ్ ఇన్హేలర్ లు అని అంటారు .
ఈ రకమైన ఇన్హేలర్ లు ఆస్త్మా ఎటాక్ ను నివారించడానికి వాడే ఇన్హేలర్లు ! వీటిని , ఆస్త్మా ఎటాక్ లు వారం లో రెండు కన్నా ఎక్కువ గా వస్తే కానీ , ఉదయమే లేవడం ఆస్త్మా తో లేవడం జరుగు తున్నప్పుడు కానీ తీసుకోవాలి ! ఎందుకంటే , ఆస్త్మా లో ఊపిరి తిత్తులు ” వాచి పోయినట్టు ” అవుతాయి. ఆ పరిస్థితి ని ఇన్ ఫ్లమేషన్ అని అంటారు. ఇన్ ఫ్లమేషన్ ఉన్నప్పుడు ఊపిరితిత్తులలో గాలి సరిగా పోలేక , అది ఆస్త్మాకు దారి తీయ వచ్చు. అందుకని కూడా ఆస్త్మా తరచూ వచ్చే రిస్కు ఉంటుంది ! ఈ రకమైన ఇన్హేలర్ లు తక్షణ నివారణ కు కాకుండా, కాల క్రమేణా, అంటే కొన్ని రోజులలోనో , వారాలలోనో , ఊపిరి తిత్తులలో ఇంఫ్లమేషన్ ను తగ్గించి , తద్వారా ఆస్త్మా వచ్చే రిస్కు ను తగ్గిస్తాయి. సామాన్యం గా ఈ ఇన్హేలర్ లు స్టీరాయిడ్ మందులు ఉన్నవి అయి ఉంటాయి.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !