2. ఆస్త్మా కారణాలేంటి ?:
ఆస్త్మా కు ఖచ్చితం గా ఒక కారణం అంటూ ఏమీ లేదు. జన్యువుల లోపం అంటే జీన్స్ లో లోపాలు ఉండి , ఆ లోపాలకు పరిసర వాతావరణం లో మార్పులు కూడా తోడ వుతే , ఆస్త్మా పరిస్థితి వస్తుంది.
1. కుటుంబం లో, ఆస్త్మా వ్యాధి ఉన్న వారికీ , లేదా హే ఫివర్ , లేదా ఎక్జిమా , కొన్ని రకాల ఆహార పదార్ధాలు తింటే పడక పోవడం ఉన్న వారికి కూడా ఈ ఆస్త్మా వ్యాధి వచ్చే అవకాశాలు మెండు.
2. చిన్న వయసులో, అంటే బాల్యం లో ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ తరచూ వచ్చి బాధ పడిన చిన్నారులు పెద్దయాక వారికి ఆస్త్మా వచ్చే రిస్కు ఎక్కువ గా ఉంటుంది.
3. శిశువు గర్భం లో తొమ్మిది నెలలూ నిండకుండా నే కనుక జన్మించినా , లేదా
4. జన్మించిన శిశువు పుట్టగానే ఉండవలసిన బరువు కన్నా తక్కువ గా ఉన్నా కూడా ఆస్త్మా రావచ్చు.
5. శిశువు, పిండ దశ లో ఉన్నపుడు కానీ , లేదా శిశువు జన్మించాక ,పెరుగుతూ ఉన్నపుడు కానీ , తల్లి గానీ , వారితో వారి ఇంట్లో ఉండే తండ్రి కానీ , స్మోకింగ్ చేస్తూ ఉంటే కూడా ఆస్త్మా శిశువుకు వచ్చే రిస్కు హెచ్చు గా ఉంటుంది. దీనికి కారణం తెలుసుకోవడం బ్రహ్మ విద్య ఏమీ కాదు కదా ! ఎందుకంటే కనీసం మూడు వేల రకాలైన విష పదార్ధాలు పొగాకు పొగ లో ఉంటాయి ! ఆ విషతుల్య పదార్ధాలు పిండం లో కానీ పెరుగుతున్న శిశువు రక్తం లో కానీ ప్రవేశించితే , పెరుగుదల దశలో ఎక్కువ గా హానికరం గా మారుతాయి శిశువు వివిధ అవయవాల మీద ! దానితో ఆస్త్మా రిస్కు ఎక్కువ అవుతుంది !
ఆస్త్మా ట్రిగ్గర్ లు ఏమిటి ?
తుపాకి కి ట్రిగ్గర్ ఉంటుంది. అంటే మీట ఆ మీట లేదా ట్రిగ్గర్ ను ఒకసారి నొక్కి పడితే, తుపాకి పేలుతుంది. అదే విధం గా మన లో వచ్చే వివిధ రోగాలకు ట్రిగ్గర్ లు ఉంటాయి ! అంటే ఆయా ట్రిగ్గర్ లు ఆ యా వ్యాధులను వెంటనే కలిగించ దానికి కారణమవుతాయి !
ఇప్పుడు ఆస్త్మా కు ట్రిగ్గర్ లు ఏమిటో చూద్దాము !
1. వైరస్ లు దాడి చేసి కలిగించే శ్వాస కోశ సంబంధ మైన వ్యాధులు.
2. వాతావరణం లో ఉండే పుప్పొడి , అంటే పోలెన్ , లేదా ఇంట్లో పెరిగే కుక్కలు , లేదా పిల్లుల జుట్టు , లేదా పక్షులు ఇంట్లో పెరుగుతూ ఉంటే , లేదా ఇంకా సామాన్యం గా , పక్షుల ఈకలతో చేసిన తలగడ లు పెట్టుకుంటే కూడా ( పిల్లో లు ) ఆస్త్మా ఎటాక్ లు ఎక్కువ అయే రిస్కు ఉంది ! ( కారణం : పైన చెప్పినవన్నీ ఎలర్జీ కలిగించే పదార్ధాలు గా పనిచేసి , ఆస్త్మా కలిగిస్తాయి ! )
3. వాతావరణ కాలుష్యం : పెట్రోలు , డీ జల్ కాలినపుడు గాలిలో విడుదల అయే వివిధ విష పదార్ధాలు , ( వాటి పొగ లో ఉంటాయి ) ఇంకా సిగరెట్ పొగలో ఉండే విష పదార్ధాలు కూడా ఆస్తమా కలిగిస్తాయి !
4. మందు బిళ్ళలు : సామాన్యం గా వేసుకునే మందు బిళ్ళలు ( యాస్పిరిన్, ఐ బూ ప్రోఫెన్ , ) కూడా ఆస్తమా కారకాలు !
5. తీవ్రమైన భావోద్వేగాలు : విపరీతం గా భావోద్వేగం చెందినపుడు , లేదా నవ్వినపుడు కూడా ఆస్తమా ( ఉన్న వారిలో ) వచ్చే రిస్కు ఉంటుంది.
6. వ్యాయామం తో కూడా ఆస్తమా రావచ్చు.
7. శుభ్రమైన గాలీ వెలుతురూ సోకకుండా ఉన్న గదులలో ఎక్కువ సమయం గడిపే వారికి కూడా ఆస్తమా రిస్కు హెచ్చు ! ఎందుకంటే చీకటి గా ఉంది సూర్య రశ్మి సోకని ప్రదేశాలలో ఫంగస్ లు పెరుగుతాయి ! ఈ ఫంగస్ లు చాలా చిన్న పరిమాణం లో ఉండడమే కాకుండా , వాటి స్పోరు లు కూడా అతి చిన్న పరిమాణం లో ఉంది ( అంటే కంటికి కనిపించనంత సూక్ష్మ పరిమాణం లో ఉండి ) పీల్చే గాలి ద్వారా ఊపిరి తిత్తులను చేరుకొని ఆస్తమా కారకం అవుతాయి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !