3. మైగ్రేన్ కారణాలు ఏమిటి ?
కారణాలు ఖచ్చితం గా తెలియక పోయినా , మెదడు లో సీరొ టోనిన్ అనే జీవ రసాయనం తక్కువ అవడం తో మైగ్రేన్ మొదలవుతుందని భావించ బడుతుంది !మెదడు సరిగా పని చేస్తున్నప్పుడు , అనేక రకాలైన జీవ రసాయనాలు ఉత్పత్తి అవుతూ , మళ్ళీ వాటి ధర్మాలు నిర్వర్తించిన తరువాత, అవి విభజన చెందుతూ ఉంటాయి . సీరో టోనిన్ మెదడు లో ఒక్క సారిగా తక్కువ అవగానే మెదడు లో రక్త నాళాలు సంకోచం చెందుతాయి ! కళ్ళు బైర్లు కమ్మినట్టు , లేదా కంటి ముందు ఉండే వస్తువు మసక గా మెరుపులతో కనబడడం కూడా , ఈ కారణం వల్లనే అనుకోబడుతుంది అంటే మైగ్రేన్ లో రెండో దశ అయిన ఆరా అనే దశ. తరువాత కొద్ది సమయానికి సంకోచం చెందిన రక్త నాళాలు వ్యాకొచిస్తాయి. దీనితో మూడవ దశ అయిన హెడేక్ , తీవ్రమైన తలనొప్పి కలగడం జరుగుతుంది. మైగ్రేన్ కనబడుతున్న వారి మెదడు లో సీరో టోనిన్ ఆకస్మికం గా ఎందుకు తగ్గుతుంది? అనే విషయం ఇంత వరకూ నిర్ధారణ కాలేదు.
హార్మోనులు: ప్రత్యేకించి స్త్రీలలో మైగ్రేన్ ఎక్కువ గా ఉండడం వల్ల , మైగ్రేన్ కు స్త్రీ హార్మోనులు కూడా కారణమని భావించ బడు తుంది. మైగ్రేన్ వచ్చే స్త్రీలలో , వారికి ఋతు క్రమ సమయం లో ఈ మైగ్రేన్ లక్షణాలు ఎక్కువ గా కనబడుతూ ఉంటాయి. అప్పుడు వచ్చే ఆ మైగ్రేన్ ను ‘ ఋతుక్రమ మైగ్రేన్ ‘ అని అంటారు. కానీ ఎక్కువ మంది స్త్రీలలో మైగ్రేన్ , ఋతుక్రమం తో సంబంధం లేకుండా కూడా వస్తూ ఉంటుంది.
మిగతా కారణాలు ఏమిటి ?:
శారీరిక కారణాలు ( ఫిజికల్ ):పని వత్తిడి వల్ల ఎక్కువ అలిసి పోవడం , తక్కువ గా నిద్ర పోవడం , ఒకే అననుకూల పొజిషన్ లో మెడను ఎక్కువ సమయం ఉంచడం , ఎక్కువ సమయం ప్రయాణం చేయడం , ఇవన్నీ కూడా మైగ్రేన్ రావడానికి కారణాలు అవవచ్చు.
భావోద్వేగ కారణాలు ( ఎమోషనల్ ): ఏ కారణం చేత నైనా విపరీతమైన ఆందోళనా, మానసికమైన వత్తిడి చెందితే , లేదా విపరీతం గా ఉత్సాహం అంటే ఎగ్జైట్ చెందితే , లేదా తీవ్రమైన షాక్ కు గురి అవుతే ( అంటే ఎలెక్ట్రిక్ షాక్ కాదు , వారి మనసును తీవ్రం గా ఆకస్మికం గా గాయ పరిచే ఏ సంఘటన అయినా షాక్ కు కారణం అవవచ్చు ).
పరిసరాల కారణాలు ( ఎన్విరోన్ మెంటల్ ): అత్యంత వెలుతురూ, నియాన్ లైట్ ల వెలుతురూ , టీ వీ లో అప్పుడప్పుడూ కనిపించే వివిధ రకాల వెలుగు మెరుపులూ , చెవులు పేలి పోయేంత గా వినిపించే శబ్దాలూ , సంగీతాలూ , బాగా చెమట పట్టించే ఉక్క పోత గా ఉన్న పరిసర వాతావరణమూ , బాగా స్మోక్ చేసి , వారు వదిలిన స్మోక్ లో ఉండే వాతావరణం – ఇవన్నీ కూడా మైగ్రేన్ ఎటాక్ రావడానికి కారణాలు ఆవ వచ్చు.
తినే ఆహారం ( డైట్ ): విపరీతం గా కాఫీలు, టీలు తాగే అలవాటు , మద్యం తాగే అలవాటు , ఆహారం తీసుకునే సమయాలలో అవక తవకలూ , లేదా డ యటింగ్ చేస్తూ సరిగా ఆహారం తినక పోవడం కొన్ని పడని పదార్ధాలు , జున్ను , చాక్లెట్ , సిట్రస్ ఫ్రూట్ లాంటి ప్రత్యేక మైన ఆహార పదార్ధాలు కూడా మైగ్రేన్ కలిగించ వచ్చు.
తీసుకునే ఇతర మందులు: కొన్ని రకాలైన నిద్ర మాత్రలు , ముఖ్యం గా స్త్రీలు వేసుకునే హార్మోను టాబ్లెట్లు ( కాంట్రా సె ప్టివ్ టాబ్లెట్ లు ) కూడా మైగ్రేన్ కలిగించ వచ్చు .
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !