మిమ్మల్ని ఇష్ట పడితే , అతడి బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది ?.9.
క్రితం టపాలో మీ మీద అతని చూపులు ఎట్లా ఉంటాయో తెలుసుకున్నారు కదా !
అతడి వాలకం పరిశీలించండి :
మీ ప్రశంస పొందాలనుకునే లేదా మీ అంగీకారం పొందాలనుకునే మగ వాడు మీ ముందు , చాలా దర్పం , ఠీవీ ప్రదర్శిస్తాడు. తన కాళ్ళు రెండూ వెడల్పు గా చేసి నుంచుంటాడు. అంతే కాకుండా , తన చాతీనీ , భుజాలనూ మీ వైపు తిప్పి ఉంచుతాడు , మీరు ఎదురు గా ఉన్నంత సేపూ ! తన చేతులు తన బెల్ట్ లోనో లేదా రెండు సైడ్ పాకెట్స్ లోనో ఉంచుతాడు. మీతో మాట్లాడే సమయం లో తన రెండు చేతులూ తన హిప్స్ మీద ఉంచి కూడా మాట్లాడతాడు. అంటే , తాను శక్తి వంతుడినని మీకు తెలియ చేయటం అన్న మాట.
ఇంకా అతడి చేతులు శ్రద్ధ గా గమనించండి :
మీరు అతడున్న రూమ్ నుంచి వెళుతూ ఉంటే , అప్రయత్నం గా తన చేతులతో తన హెయిర్ స్టయిల్ సవరించుకుంటాడు , మీకు తాను ఆకర్షణీయం గా కనిపించడానికీ , మీ మెప్పు పొందడానికీ కూడా !
అంతే కాక తను తన చేతులు తరచూ , తన గడ్డం మీదా , తన పెదవుల మీదా , బుగ్గల మీదా ఉంచి వాటిని రుద్దుతూ ఉండడం గమనించండి. ఇట్లా ఎందుకు జరుగుతుందంటే , మీ మీద ఆకర్షణ ఏర్పడినప్పుడు , అతని ముఖ బాగాలు అత్యంత సెన్సిటివ్ అవుతాయి. అతను తరచూ తన పెదవులను తడి చేసుకోవడం కూడా జరగ వచ్చు. ఇట్లా అతను అష్ట కష్టాలు పడడం, తన ఇష్ట సఖి తో జీవితం గడపడం కోసమే !
కొన్ని సమయాలలో తన పొట్ట మీద చేతి తో రుద్దడమూ , తన పాంటూ , షర్టూ కూడా చాలా సార్లు ముడతలు పోయే వరకు సవరించు కోవడమూ కూడా చేస్తాడు . ఆ ప్రయత్నాలన్నీ మీ అటె న్షన్ కోసమే !
మీతో పరిచయం ఎక్కువ అవుతున్న కొద్దీ ,తను మిమ్మల్ని తాకడానికి ఉబలాట పడుతూ ఉంటాడు. ఈ తాకడం పని కట్టుకుని కాక , యాదాలాపం గా తాకినట్టు కనిపించడానికి ప్రయతిస్తాడు. ముఖ్యం గా మీ మెడ వెనుక భాగమూ , మీ చెవుల వెనుక భాగమూ , మీ నడుమూ, వీపూ , మీ తొడల పైభాగం కూడా అతని లిస్టులో ముందుగా ఉంటాయి. కొన్ని సమయాలలో కేవలం మీ అందమైన కను బొమ్మలు సవరించుతాడు , సున్నితం గా స్ట్రోక్ చేస్తాడు.
మీ వైపు అతని చేతిని కూడా అంటే అరచేతిని ఆకాశం వైపు మళ్ళించి మీకు చూపించడం కూడా గమనించ వచ్చు. ఇట్లా చేయడం లో ఉద్దేశం, కేవలం మీ చేయి పట్టుకుని నడవడానికి ఆసక్తి మాత్రమె కాక , తన జీవన యాత్ర కూడా మీతో కలిసి చేయాలనే తలంపుతో !
అందుకే ఒక సినిమా కవి రాశాడు చక్కటి పాట ” చేయీ చేయీ తగిలిందీ , హాయి హాయి గా ఉందీ , పగలు రేయి గా మారిందీ , పరువం ఉరకలు వేసింది ! అని ! వీలుంటే వినండి , ఇంకా వీలుంటే యూ ట్యూబ్ లో చూడండి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !