Our Health

Archive for అక్టోబర్ 26th, 2012|Daily archive page

మీ మీద మనసు పడితే , మాట్లాడకుండా ఎట్లా తెలియ చేస్తుంది ఆమె?.5.

In మానసికం, Our minds on అక్టోబర్ 26, 2012 at 11:22 సా.

మీ మీద మనసు పడితే ,  మాట్లాడకుండా  ఎట్లా తెలియ చేస్తుంది ఆమె?.5.

4. కురులు సవరించుకోవడం పరిశీలించండి : 
ఆమె కురులు , అదే,  కేశాలు గల గల పారే ఆమె కోరికల సెలయేరులు !  వదులు  గా ఉన్న ఆమె కురులు, ప్రతి పురుషుడి లో మరులు రేపుతాయి.  వత్తు గా ఉన్న ఆమె పొడవాటి కేశాలు ,  అతి వీర , మగ దీరులను కూడా  క్షణం లో చిత్తు చేయగలవు ,’ బలవంతంబైన సర్పంబు చలిచీమల చేత చిక్కి చావదె  సుమతీ ‘ అన్నట్టుగా , అతి సుతారం గా తూనీగ రెక్కల లాంటి ఆమె కురులు , ఎంతటి మగ వాడినైనా వలపు బంధనాలలో కట్టి పడ  వేయ గలవు ! 
అంత   ‘ రొమాన్ చక్ ‘  కురులను ఆమె తన ముని వేళ్ళతో మెలి  తిప్పుతూ , అలవోకగా , యదాలాపం గా సవరించుకుంటూ ఉంటె,  లేదా తన నాజూకైన వేళ్ళ ను అతి సున్నితం గా తన కురులలోకి  పోనిస్తూ , ఆమె ఆలోచనలు వేరే ఎదో లోకం లో విహరిస్తూ ఉంటే ,  ఆమె మీద ఆసక్తి కనబరుస్తున్నదని  అనుకోవచ్చు.  గుర్తు ఉంచు కొండి !  ఆమె ఇట్లా  తన ముంగురులు సవరించుకోవడం , మీరు ఎదురుగా , లేదా కొద్ది దూరం లో ఉన్నప్పుడు చేస్తుంటే నే ఈ విధం గా భావించండి ! ఇంకో విషయం : ఆమె  దగ్గర మీకు కనపడకుండా ఏ  ఐ  ప్యాడో , లేదా సెల్ ఫోనో ఉందనుకోండి !   , అప్పుడు ఆ సంగీత లోకం లో విహరిస్తూ కూడా ఆమె ప్రవర్తన అట్లా ఉండ వచ్చు , కాబట్టి కాస్త  శ్రద్ధ గా గమనించండి. అదే, కాస్త తొందరగా, ఆత్రుత గా, ఆకస్మికం గా కనుక ఆమె తన చేతులు శిరోజాల లోకి పోనిస్తే , తను తడ  బడుతున్నది గానూ , ఇబ్బంది కరం గానూ ఫీల్ అవుతున్నట్టు అనుకోవచ్చు, ప్రత్యేకించి, ఆమె బిత్తర చూపులు చూస్తుంటే కూడా ఇట్లా అనుకోవచ్చు.
5. ఆమె చేతి వేళ్ళు  గమనించండి: ఆమె, మీరు సమీపం లో ఉన్నప్పుడు ,   తన చేతి వేళ్లతో  తన అధరాలు , అంటే  పెదవు లను కానీ మెడ భాగం గానీ , లేదా కాలర్ బోన్  ప్రదేశం కానీ తడుము కుంటూ ఉండడం కానీ, సున్నితం గా స్పృశిస్తూ, మసాజ్ చేస్తూ ఉండడం  కానీ ,  చేయడం జరిగితే ,  ఆమెకు  మీరు కావాలని నోటితో  చెప్పకుండానే , మీకు చెపుతుంది ! మరి అప్పటికీ మీరు  ఆమె ‘మూగ ‘ భాష , రాగ బాసా అర్ధం చేసుకోలేకపోతే  పప్పులో కాలేసి నట్టే ! అట్లా చేసి , ఆమె తాను రమణీయం గా ఉన్నాననీ , ‘ఇక మీదే ఆలస్యం ‘ అని కూడా మీకు చెపుతున్నట్టే ! 
6. సొమ్ముల తో చోద్యం :  ఆమె కు ఇష్టమైన పురుషుణ్ణి  చూసినప్పుడు , ఆమె హృదయం మత్తు గా తేలిపోతుంది.  వేగం గా కొట్టుకుంటుంది , తన మది లో మదనుడి అలజడికి ! 
ఆ హడావిడి లో ఆమె ఆతురత ఎక్కువ అవుతుంది. తన వేళ్ళ  తో తన ఉంగరాన్ని తడుముతుంది, ముందుకూ వెనుకకూ జరుపుతుంది, చేతికి ఉన్న బంగారు గాజును తన ముని వేళ్ళ  తో నిమురుతుంది , తిప్పుతుంది. చెవులకు ఉన్న రింగులను తన వేళ్ళతో సుతారం గా సవరించు కుంటుంది , తన వేళ్ళు  తగిలీ తగలకుండా ! తన మెడలోని గొలుసును తన వేలి  చుట్టూ చుట్టు కుంటుంది పదే  పదే  ! ఆమె మనసు పరి పరి విధాల ఆలోచనల ఉప్పెనలో కొట్టు మిట్టాడుతూ ఉంటుంది ! 
7. గ్లాసులతో ఆటలు : ఆమె హోటల్ లో టేబుల్ దగ్గర మీ ఎదురుగా  ఉంటే  తన డ్రింకు  గ్లాసు ను అతి నిదానం గా నిమరడం కానీ , లేదా ఆ గ్లాసు అంచులు తన ముని వేళ్ళ  తో అతి సున్నితం గా చుట్టూ స్పృశిస్తుంది, మీరంటే ఆసక్తీ , ఇష్టమూ ఉంటే ,  మీతో కూడా  తను కలిసి, ఆనందపు అంచులు చేరుకోవాలనే ఆశతో ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 
%d bloggers like this: