మరి మీ మీద మనసు పడే అతడి బాడీ లాంగ్వేజ్ ఏమిటి?7.
క్రితం టపా వరకూ , ఆమె మనో భావాలు , మాటలతో కాక తన బాడీ లాంగ్వేజ్ తో ఎట్లా తెలియ చేస్తుందో కొంత వరకు తెలుసుకున్నాం కదా ! మరి అతడు తన మనసైన మగువ దగ్గర ప్రవర్తన , మాట లేకుండా, అతడి బాడీ లాంగ్వేజ్ తో ఎట్లా కనుక్కోవచ్చు?
జవాబు: కొంత వరకూ పురుషుడి బాడీ లాంగ్వేజ్ కూడా , తను మనసు వారి దగ్గర , ఒకే లా ఉంటుంది.
1. తలను వంచడం: తాను మనసు పడే తరుణీ వైపు అతని తల సూర్య కాంతికి వంగే సూర్య కాంతి పుష్పం లా వంగుతుంది, అప్రయత్నం గానే ! మరి ఎందుకు వంగదు , తన జీవితం లో ఎంతో కాంతి నింపే కాంత మీద మనసు పడి నప్పుడు !
2.ఎగరేసే అతడి కనుబొమ్మలు ! : నిను వలచిన వాడి కనుబొమ్మలు కూడా మీ మీద ఆసక్తి తో ఎగురుతూ ఉంటాయి తరచూ , మీరు ప్రక్కనే ఉన్నప్పుడు , లేదా ఎదురు గా ఉన్నప్పుడు !
3.నాసికా పుటాలు అంటే నాస్త్రిల్స్ : మీరు తనకు ఇష్టమైతే, ఆ పురుషుడి నాసికా పుటాల వ్యాసం పెరుగుతుంది. అంటే నాసికా రంధ్రాలు పెద్దవవుతాయి. మీరు దగ్గర ఉన్నప్పుడు , ఉద్వేగానికి లోనయినప్పుడు , జరిగే చర్య అది ! మీరు వెదజల్లే ప్రేమ సుగందానికి ముగ్దుడై కూడా ఆ విధం గా జరగ వచ్చు !
4.చిలిపి నవ్వు : మీ మీద మనసు పడిన మగ వాడు , మీతో పరిచయం ఎక్కువ అవుతున కొద్దీ , చిలిపి నవ్వు లు కూడా ఎక్కువ చేస్తాడు ! మీ పొందు , మీతో పొందు , అతనికి చాలా సంతోషం గా ఉండడమే కాకుండా , అతనితో చిలిపి నవ్వులు చిందించి , మీలో ప్రేమ మొగ్గలు తొడిగిస్తుంది !
ఈ నవ్వు అనేక రకాలు గా ఉండవచ్చు. కొన్ని సమయాలలో అతడు పూర్తి గా ఉండక తన నోటిలో ఒక వైపు నుంచి కానీ లేక అన్ని వైపుల నుంచి కానీ వస్తుంది. కొన్ని సమయాలలో అతడు నోరు అంటే పెదవులు తెరవ కుండానే చిలిపి గా నవ్వుతాడు ! కానీ అన్ని ప్రయత్నాలూ , మీ మనసు తలుపులు మీరు తనకోసమై తెరవాలనే ఒకే ఒక్క తలపు తో !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! .