Our Health

Archive for అక్టోబర్ 7th, 2012|Daily archive page

నవ్వితే లాభాలు.4. ‘ నవ్వు అత్యుత్తమ ఔషధం ! ‘

In మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 7, 2012 at 10:22 ఉద.

నవ్వితే లాభాలు.4. ‘ నవ్వు అత్యుత్తమ ఔషధం ! ‘

శతాబ్దాల తరబడి వివిధ దేశాలలో నవ్వు ఒక అత్యుత్తమ ఔషధం గా పరిగణింప బడుతుంది.మన శరీరం లో ని వివిధ హాని కర హార్మోనులను తగ్గించి ‘ హాయి కర ‘ హార్మోనులను ఎక్కువ చేస్తుంది నవ్వు. అదేంటో కానీ  కొందరు మానవులు నవ్వు మొహం పెట్టడానికి ఉత్సాహ పడి అనేక ‘ఆనంద కర ‘ హావ  భావాలను ప్రదర్శించడానికి తంటాలు పడుతూ ఉంటారు కానీ మనస్పూర్తిగా ఆ హావ భావాలను మనస్పూర్తి గా వచ్చే నవ్వుతో కలగాలపడానికి అంతగా ఉత్సాహం చూపరు.  ఆ పరిస్థితి అప్పుడు ఏదో వాసన లేని పూవు ను చూసినట్టు గా ఉంటుంది. నవ్వు శరీరానికి కూడా ఎంతో ఆరోగ్య కరమైనది. రోజులో ఒక వంద సార్లు నవ్వితే జరిగే శరీర వ్యాయామం , పది నిమిషాల రోవింగ్ తోనూ , పదిహేను నిమిషాల బైక్ మీద చేసే ఎక్సర్సైజ్ తోనూ సమానం అని నిరూపించ బడింది.మనసారా నవ్వుకునే నవ్వు , మనలను నిరాశా నిస్పృహల నుంచి  మైళ్ళ దూరం తీసుకు వెళ్లి , మనలో, మన జీవితాలలో  ఆశావాద దృక్పధాన్ని కలిగిస్తుంది.
ఉదా: రవి తండ్రి  గుమాస్తా. తల్లి  కుటుంబ పోషణ చేస్తుంది. రవి కాలేజీలో చాలా  పాపులర్.  అమ్మాయిలతో సరే సరి. చదువులో మాత్రం సరాసరి.  బాగా చదువుతూ మంచి మార్కులు తెచ్చుకుని , అమ్మాయిలను ఇంప్రెస్ చేద్దామని తహతహ లాడే మిగతా అబ్బాయిలకు రవి అంటే ఎంతో అసూయ.  వారికి ఎంత ఆలోచించినా  రవి లో ఉన్న ప్రత్యేకతలు అంతు పట్టవు.  రవి కి కూడా  ఆ ప్రత్యేకతలు తెలియవు. ఎందుకంటే రవి , సహజం గా ఉంటాడు. సహజమైన నవ్వుతో.  కాలేజీ లో లెక్చరర్స్ ను అనుకరిస్తాడు , అమ్మాయిల దగ్గర.  లేడీ లెక్చరర్లను కూడా వదలడు. ఆడ గొంతు తో వారిని అనుకరించి చెపుతూ ఉంటే , చుట్టూ ఉన్న వారు నవ్వు ఆపుకోవడం చాలా కష్టం !  ఎప్పుడూ  పరీక్షలూ , అస్సెస్ మెంట్  లతో సతమత మయే మిగతా స్టూడెంట్స్ అందరికీ రవి దగ్గర  ఉంటే  వత్తిడులన్నీ తగ్గి పోయి , ఏదో సేద తెర్చుకున్నట్టు గా , ఉల్లాసం గా ఉంటుంది. రవి  తన మటుకు తను ఆనందం గా ఉంటాడు , తన తోటి వాళ్ళను ఆనందం గా ఉంచుతాడు. అందుకు తగినట్టుగా , రవి ది ఆశావాద మనస్తత్వం.  తనకు విపరీతం గా మార్కులు రాక పోయినా , జీవితం లో రాణించ గలననే ఆత్మ విశ్వాసమూ , ధీమా ఉంది.  రవికి తెలుసు , ప్రపంచం లోని ప్రముఖులందరూ , ఎక్కువ గా చదువుకున్న వారు కాదని. అయినా వారు రాణించారని. 
నవ్వుతూ , ఆశావాద దృక్పధం తో జీవితాలు గడిపే వారు , ఉసూరు మంటూ , ఈ లోకం లోకి ఎందుకు వచ్చామురా , అన్నీ సమస్యలే,  అనుకుంటూ  బిక్కు బిక్కు మంటూ జీవించే వారికన్నా ఎక్కువ కాలం ఆనందం గా జీవించుతారు అని అనేక పరిశోధనల వల్ల స్పష్టమైంది.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు నవ్వుతూ తెలుసుకుందాము ! 
%d bloggers like this: