Our Health

Archive for సెప్టెంబర్, 2012|Monthly archive page

హగ్గులూ , హ్యాండ్ షేకులూ ! .3. కీలక ఘట్టం !

In ప్ర.జ.లు., మానసికం, Our minds on సెప్టెంబర్ 14, 2012 at 8:39 సా.

హగ్గులూ , హ్యాండ్ షేకులూ ! .3. కీలక ఘట్టం ! 

క్రితం టపాలో హగ్గు కు ప్రధమం గా ఎట్లా సమీపించాలో తెలుసుకున్నాం కదా ! 
ఇప్పుడు అత్యంత కీలకమైన  ఆలింగనం ఎట్లా చేసుకోవాలో చూద్దాం ! 
కుటుంబ సభ్యులతో హగ్గు: మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉండ వచ్చు , హగ్గు చేస్తున్న సమయం లో !  అట్లా చేయడం , మీ ఆలింగానా సమయానికి  ఏవిదం గానూ అంతరాయం కలిగించదు.
మీరు కుటుంబ  సభ్యులతో బంధువులతో ఆలింగనం చేస్తున్నప్పుడు , మీ చేతులు ఎక్కడ ఉన్నాయి అనే విషయం ముఖ్యమైన విషయం కాదు. అది వారు పట్టించుకోరు. అట్లాగే మీరు మీ తలను కూడా ఆలింగనం చేస్తున్న వారి తలను తాకించ నవసరం లేదు. 
మీరు ఆలింగానాన్ని వదిలే సమయం లో ఎదుటి వారి వీపు మీద మీ చేతులతో కొద్ది క్షణాలు రుద్ద వచ్చు , లేదా స్ట్రోక్ చేయ వచ్చు. అట్లాగే మీరు మంద హాసం చేస్తూ ( అంటే  మీ ఆనందాన్ని తెలియ చేస్తూ ) హగ్గు ను వదల వచ్చు. 
స్నేహితురాలితో హగ్గు : స్నేహితురాలితో ఆలింగనం ఒక పట్టాన వదల బుద్ధి కాదు కదా ! కానీ మీరు స్నేహితురాలిని హగ్గు చేస్తున్నప్పుడు , వీలైనంత బిగువు గా కౌగిలించు కొండి. మీ కళ్ళు మూసుకుని , మీ స్నేహితురాలిని ఎంత గా ప్రేమిస్తూ ఉన్నారో మననం చేస్తుకోండి. ఒక గమనిక :   ఆలింగనాన్ని వదిలే సమయం లో మీ స్నేహితురాలి వీపు చరచడం చేయకండి. ఆమె మీరు మీ అయిష్టతను తెలియ చేస్తున్నారని పొరపాటు పడే అవకాశం ఉంది. 
మగ స్నేహితులతో హగ్గు: మగ స్నేహితులను మగ వారు గట్టిగా హగ్గు చేసుకోవచ్చు. అట్లాగే మీ కలయిక ఆనంద కరమైనది అవుతే పరస్పరం వీపు చరుచుకోవడం కూడా చేయ వచ్చు. కానీ ఆ కలయిక విషాద కరమైన సందర్భానికి సంబంధించినదైతే , కేవలం కొన్ని క్షణాలు  ఆలింగనం చేసుకుని వదిలేయాలి. 
క్రష్ హగ్గు: మీరు మగ వారైతే ,  మీరు ఆలింగనం చేస్తున్న అమ్మాయి చేతులు మీ మెడకు రెండు వైపులా ఉంచుకోవాలి. కానీ మీరు మీ చేతులు మాత్రం , ఆమె  నడుము చుట్టూ వేయాలి. మీరు ఆమె ను మీ దగ్గరగా హత్తుకోవచ్చు. ఆమె వక్షోజాలూ , ఉదరమూ మీ కు హత్తుకోవాలి.  ఆ సమయం లో ఆమెను కొన్ని అంగుళాలు భూమి మీదనుంచి పైకెత్తితే , అంటే లిఫ్ట్ చేస్తే మరీ మంచిది. ఆమె ప్రణయ మేఘాలలో తేలిపోతుంది !  ఆ పరిస్థితిని కొన్ని క్షణాలు ఫ్రీజ్ చేయండి. మీ మనసులో కూడా  మీ మనో నేత్ర కెమెరా తో ఆ క్షణాలు పదిలం చేసుకోండి. ఆమె కౌగిలి వదిలే సమయం లో , ఆమె కళ్ళ లో చూస్తూ , మీ సంభాషణ కొన సాగించండి సహజం గా !
మీరు అమ్మాయి అయితే, అతడి మెడ చుట్టూ మీ చేతులు పోనిచ్చి , మీ చాతీ తో , సున్నితం గా అతడి చాతీని హత్తుకోండి.
ప్రేమికుల హగ్గు: మీరు మగ వారైతే : ఆమె భుజాల మీదుగా మీ చేతులు  జార వేసి , ఆమె నడుము చుట్టూ గా , ఆమె వీపు క్రింది భాగానికి చేర్చండి. తరువాత మీ తలను ఆమె భుజం మీద ఉంచి ఆమెను మీకు ఎంత సేపు కావాలనుకుంటే అంత సేపు హత్తుకోండి ! 
మీకు ఇష్టం గా ఉంటే , ఆమెకు మీ చేతులతో ఓ మినీ మసాజ్ చేయండి. ఈ సమయం లోనే  ఆమెను భూమి మీద నుంచి కొన్ని క్షణాలు పైకెత్తండి, వారి బరువును కొన్ని క్షణాలు మీ మీద వేసుకుని. చాలా మంది యువతులు ఇట్లా చేస్తే , స్వర్గం లోకి ఎగిరి పోతున్నట్టు  అనుభూతి చెందుతారు !  కౌగిలి నుంచి విడి పోయే సమయం లో చిరునవ్వు తో ప్రేమ పూర్వకం గా కౌగిలిని వదలండి, ఆమె కళ్ళలోకి చూస్తూ. సమయం, సందర్భం అనుకూలిస్తే ,  ఆమె పెదవుల మీదనైనా , లేదా బుగ్గల మీదనైనా (  మీ పెదవులు జారిపోకుండా ! ) ముద్దులు కురిపించండి, ఆమె ముంగురులు సవరిస్తూ ! 
మీరు యువతులవుతే : మీ చేతులు అతని మెడ చుట్టూ పోనీయండి. తరువాత అతని భుజాలూ , మెడ మధ్య ఉంచి పట్టుకోండి. అతనికి వీలైనంత దగ్గరగా కదిలి ,  తొడ భాగాలను తాకించి , అతనికి అతి సమీపం లోకి రండి. పరిస్థితులు బాగా అనుకూలం గా ఉండి , మీ ఇద్దరి మధ్యా ఏకాంతం ఎవరూ భంగ పరచక పొతే , మీ కాలు అతని కాలి మధ్య పెన వేయ వచ్చు కూడా. మీరు అతని కి సమానం అయిన ఎత్తు ఉన్నా , మీ చేతులను , అతని భుజాల క్రిందకు పోనీయడం కానీ , గట్టిగా , లేదా బిగువుగా కౌగిలించుకోవడం కానీ మీ అంతట మీరు చేయకండి.  అప్పుడు ప్రణయ బంధం మధురం గా ఉంటుంది. ఆ కౌగిలి మనసులలో  గిలిగింతలు పెడుతుంది.
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

హగ్గులూ , హ్యాండ్ షేకులూ .2. ఎట్లా హగ్ చేసుకోవాలి ?

In ప్ర.జ.లు., మానసికం, Our minds on సెప్టెంబర్ 13, 2012 at 7:07 సా.

హగ్గులూ , హ్యాండ్ షేకులూ .2. ఎట్లా హగ్ చేసుకోవాలి ? 

మానవులు పరస్పరం  తమ తమ ప్రేమా,  ఆప్యాయతా స్నేహ శీలతా తెలుపుకునే, లేదా ప్రకటించుకునే   ఒక అతి ముఖ్యమైన  చర్య హగ్గు లేదా ఆలింగనం. మనలో చాలా మంది ఈ అతి ముఖ్యమైన  చర్యను సరిగా పాటించక , తమ భావాలనూ , అనుభూతులనూ ,సరిగా తెలియ చేయ లేక పోతూ ఉంటారు సామాన్యంగా ! కొన్ని సమయాలలో ఈ హగ్గు ఇబ్బంది కరం గా కూడా మారుతుంది.  మరి  ఈ ఉచితమైన చర్య అత్యంత విలువైన మానవ సంబంధాలు కూడా పెంపొందింప చేస్తుంది అనుకున్నప్పుడు , సరిగా హగ్ చేసుకోవడం తెలుసుకోవడం లో తప్పేంటి ? ఆ  సరి అయిన హగ్గు వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు ! 
హగ్గులలో మొదటి పాఠం ఎట్లా సమీపించాలి అని. ఇక్కడ గమనించ వలసిన విషయం ఏమిటంటే , మీరు హగ్గు చేసుకోవాలనుకుంటున్న వారు మీకు బాగా తెలిసిన వారై ఉండాలి. పరిచయాలు సరిగా లేక పోయినా అతి దగ్గరకు సమీపించడం, హగ్గు చేసుకోవడం లాంటి చర్యలు తీవ్రం గా పరిగణించ బడతాయి చాలా  దేశాలలో ! 
ఫ్యామిలీ హగ్ :  కుటుంబ సభ్యులను  ఆప్యాయత తో ఆలింగనం చేసుకోవాలనుకుంటే  మీరు వారిని దయ తో సమీపించాలి. ఎక్కువ ఎమోషనల్ గా  కూడదు. 
గర్ల్ ఫ్రెండ్ ను సమీపించే సమయం లో , చాలా కేరింగ్ గా అప్రోచ్ అవాలి. కొన్ని సమయాలలో  హాస్య పూరితం గా అంటే హ్యుమరస్ గా  ఒక చిరు మంద హాసం తో కూడా అప్రోచ్ అవవచ్చు. 
తోటి మగ స్నేహితులను సమీపించే సమయం లో , మీరు  జన్యన్ గా అంటే  నిజాయితీ గా  ఒక చిరు నవ్వు తో హగ్ చేసుకోవచ్చు. ఒక వేళ  మీరు ( మగ వారై ) హగ్ చేసుకుంటున్న ( మగ ) వారు మీతో ‘ ఇంకో  ఉద్దేశం ‘ తో స్పందిస్తే , మీరు వెంటనే మీ  అయిష్టత ను వారికి తెలియ చేయాలి , అంటే వెంటనే ఆ ఆలింగనం , చాలా ఇబ్బంది కరం గా మీకు ఉన్నట్టు చెపుతున్నట్టుగా , దూరం జరగాలి.
క్రష్ హగ్: ఈ హగ్ మీ గర్ల్ ఫ్రెండ్ తో చేసే సమయం లో మీరు సిగ్గు పడకుండా , మీ స్నేహితురాలిని అప్రోచ్ చేసి , ఒకటో రెండో  లాలించే మాటలు అంటే కేరింగ్ వర్డ్స్  ఆమె చెవి లో ‘ ఊదండి ‘ ! 
ప్రేమికుల హగ్ : ప్రేమికుల హగ్ ను   ఆమె అయినా, అతడైనా  మొదలు పెట్ట వచ్చు.  ముఖ్యం గా  ఆమె భుజాల మీద అతడు తన చేతులను ఉంచాలి. లేదా ఆమె అతడి భుజాల మీద తన చేతులు సున్నితం గా  ఉంచాలి.  అంతే కానీ వారి బరువులను చేతుల ద్వారా  భుజాల మీదకు ‘ బదిలీ ‘ చేయ కూడదు. ఆ తరువాత  వారు తమ చూపులు తదేకం గా కలుపుకోవాలి !  ( వెనుక ఎక్కడ నుంచైనా చూపులు కలిసిన శుభ వేళా ! అనే పాట వినిపిస్తూ ఉంటే మరీ మంచిది , లేదంటే  ఆ పాట ను మీ మనసులలోనే ఊహించు కొండి ! )తరువాత మీరు ‘ ఆమెను ‘ ప్రేమిస్తున్నట్టు చెప్పండి. ఆమెతో ఉన్న ప్రతి క్షణం ఎంత ఆనందం గా మీరు అనుభూతి చెందుతున్నారో కూడా తెలియ చేయండి. ఆ తరువాత మీరు ఆమెలోనూ , ఆమె మీలోనూ  హృదయ పూర్వకం గా ‘ కలిసి పోండి’ , కరిగి పోండి ! 
ఇక్కడ ప్రేమికులు ఇరువురూ  ఒక్క విషయం ఎప్పుడూ గుర్తు ఉంచు కోవాలి ! ఆ ప్రేమ , నిజాయితీ గా , స్వచ్చం గా ఉండాలి ! అంతే కానీ ‘ నటన ‘ కాకూడదు ! 
 
ఇంత వరకూ మనం హగ్ చేసు కోవడానికి మనకు పరిచయం ఉన్న వారిని ఎట్లా సమీపించాలో తెలుసుకున్నాం కదా ! వచ్చే టపాలో  అసలు  ‘ ఆలింగనం ‘ సంగతి కూడా తెలుసుకుందాం ! 
 

హగ్గులూ , హ్యాండ్ షేకులూ ! .1. అమ్మ ఆలింగనం.

In మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 10, 2012 at 7:21 సా.

హగ్గులూ , హ్యాండ్ షేకులూ ! .1. అమ్మ ఆలింగనం.

మన బాల్యం నుంచీ మనకు  ఏ చిన్న గాయం తగిలినా , ఏ మాత్రం ఆలోచించ కుండా  అమ్మ దగ్గరికి  పరిగెత్తే వాళ్లము కదా ! మనం ఆ విధం గా అమ్మ కమ్మని మాటలూ , దీవెనలూ , ఆప్యాయత, ప్రేమ తో కూడిన ఆలింగానాలూ , మనం పెరిగి పెద్దయాక కూడా ,అంతే ప్రభావం తో మన జీవితాలలోని వత్తిడులూ, కష్టాలూ , నిరాశా నిస్ప్రుహలూ , భయాలూ, ఆందోళన లూ  , ఆ ప్రేమా , వాత్సల్యాలతో అమ్మ ఇచ్చే ఆలింగనం లో వెన్న పూస లా కరిగి పోతాయి.  ఏళ్ళు గడిచే కొద్దీ ,  మనంతట మనం ,  మన జీవితాలలో ఒడు దుడుకులను , స్వతంత్రం గా అధిగమించి , ఆత్మ విశ్వాసం తో ముందుకు సాగి పోతున్నా కూడా  ,  మనం సాగించే జీవన యానం లో , సదా మన శ్రేయస్సు కోరే , ఆ కమ్మని అమ్మ ఒడి కోసం , అప్పుడప్పుడూ పరితపిస్తూ ఉంటాము.  ఆ ఆలింగనం లో మన బాధలు అన్నీ కరిగించుకోవాలని అనుకుంటూ ఉంటాము కూడా ! 
జన్మ నిచ్చే తల్లి ఆలింగనం, శిశువులకు , సంతానానికీ  ఎంతో స్వాంతన చేకూరుస్తుంది.  ఇటీవల శాస్త్రజ్ఞులు , దేశ భాషల తేడాలు ఏవీ లేకుండా ,  మాత్రు మూర్తులు తమ పిల్లలకు ఇచ్చే ఆలింగనం ఎంతో ఆరోగ్య కరమైనదీ , లాభ దాయకమైనదీ అని తేల్చారు. ఇందులో పెద్దగా చెప్పుకోవలసినది ఏమీ లేదు ఎందుకంటే , ఈ విషయం అందరికీ తెలిసినదే కదా ! కానీ  శాస్త్రజ్ఞులు కించిత్తు ముందుకు పోయి , శాస్త్రీయం గా  తల్లి ఆలింగనం వల్ల  లాభాలు పరిశీలించారు. తీవ్రమైన మానసిక వత్తిడి ఉన్నపుడు, జీవితం దుర్భరమైనట్టు అనిపించినప్పుడూ , తల్లి  ఇచ్చే ఆలింగనం , వత్తిడి ని తగ్గించి , తద్వారా రక్త పీడనాన్ని కూడా తగ్గించి , మనసుకు ఎంతో ప్రశాంతత ను కలిగిస్తుందని తెలిసింది. హృదయ పూర్వకం గా తల్లి ఇచ్చే ఆలింగనం , సంతానంలో హృదయ సంబంధ మైన వ్యాధులు కూడా తగ్గిస్తుందని తెలిసింది. శాస్త్రీయ పరిశోధనలలో  హగ్గు చేసుకునే వారిలో  సిస్టోలిక్ ఇంకా డయా స్టోలిక్ రక్త పీడనాలు రెండూ , హగ్గు చేసుకొని వారి లో కంటే తక్కువ గా ఉంటాయని నిర్ధారించ బడింది ( ఈ పరిశోధన నార్త్ కరోలినా విశ్వ విద్యాలయం వారు చేశారు ) .  ఆ విధం గా సంతానం  దీర్ఘాయుషు తో జీవించడానికి సహాయ పడుతుంది కూడా !  కేవలం హగ్గు ఒక  యాంత్రిక మైన ఆలింగనం కాకుండా ,  ఆప్యాయతా, అనుభూతుల సమ్మేళనం అయినప్పుడు దాని ప్రభావం ఎక్కువ గా ఉంటుంది. 
అందుకే ఒక కవి చక్కని పాట : అమ్మ అన్నది, ఒక కమ్మని మాట , అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూటా ! అని.
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

హగ్గులూ , హ్యాండ్ షేకులూ !

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 9, 2012 at 6:08 సా.

హగ్గులూ , హ్యాండ్ షేకులూ !

 

మానవులనందరినీ ,  జన్మ నిచ్చిన తల్లి ప్ర ప్రధమం గా తన హృదయానికి హత్తుకుని ముద్దాడుతుంది. అక్కడి తో మొదలవుతుంది, ఈ ఆలింగనాల , లేదా హగ్గుల  హడావిడి. అసూయా ద్వేషాలకు తావు లేకుండా ,  హృదయ పూర్వకం గా ఇచ్చే హగ్గు , మనసుకు ఎంతో ప్రశాంతతనూ , ఆనందాన్నీ , ఇస్తుంది. అంతే కాక  నేను నీ ఆప్తుడిని , లేదా ఆప్తురాలిని ,  నీ శ్రేయస్సు కోరే  వారము ‘ అని కూడా తెలియ చేస్తుంది ఆ హగ్గు. తల్లి దండ్రుల తో ఆలింగనం , ఆప్యాయతనూ , ఆపేక్షనూ తెలియ చేస్తూ ఉంటుంది.  స్నేహితులతో చేసే ఆలింగనం లేదా హగ్గు , స్నేహ పూర్వకం గా , రి అషురింగ్ గా ఉంటుంది. ప్రేమికుల మధ్య ఆలింగనం  ప్రేమ, ప్రణయ భావనలను ప్రతి బింబిస్తూ ఉంటుంది.  రాజ కీయ నాయకుల హగ్గు ‘ రాజకీయం ‘ గా ఉంటుంది. మరి మనం ఈ హగ్గుల, హ్యాండ్ షేకుల కధా కమామీషు తెలుసుకుందాం వచ్చే టపా నుంచి ! 

జీవన శైలి లో మార్పుల తో 50 % క్యాన్సర్ లు నివారించ వచ్చు

In ప్ర.జ.లు., Our Health on సెప్టెంబర్ 8, 2012 at 8:05 సా.

జీవన శైలి లో మార్పుల తో 50 % క్యాన్సర్ లు  నివారించ వచ్చు ! 

ప్రశ్న: మనం వివిధ క్యాన్సర్ ల గురించి ఎప్పుడూ తెలుసుకుంటూ ఉంటాము. మరి  వాటి నివారణకు మనం చేయ వలసినది ఏమైనా ఉందా ? లేక  అంతా దైవాధీనమా ? 
జవాబు: ఇది చాలా మంచి ప్రశ్న .  సాధారణం గా మనం వివిధ క్యాన్సర్ ల గురించి వింటూ ఉంటాము. తెలిసిన వారికి ఆ క్యాన్సర్ వచ్చింది , లేదా వీరికి ఈ క్యాన్సర్ వచ్చింది. ‘ అయ్యో పాపం, ఆరోగ్యం గా తిరిగే వాడు లేదా చాలా ఆరోగ్యం గా ఉండేది ఆమె ‘ అని కూడా మనం  అనుకుంటూ, కలత చెందుతూ ఉంటాము , బాధ పడుతూ ఉంటాము. 
ఇటీవల ప్రపంచ క్యాన్సర్ కాంగ్రెస్ అంటే ప్రపంచ క్యాన్సర్  మీటింగ్ ఒకటి జరిగింది, కెనడా లో ( క్యుబెక్ అని ఒక పట్టణం లో ).  ప్రపంచం లోని వివిధ దేశాలలో ఉన్న క్యాన్సర్ స్పెషలిస్టులు  ఈ మీటింగ్ లో తమ తమ పరిశోధనా ఫలితాలను తెలిపారు. వాటి  సంగ్రహమే ఈ టపా.వాషింగ్టన్ విశ్వ విద్యాలయానికి చెందిన గ్రహం కోల్దిజ్ అనే శాస్త్రజ్ఞుడు తన పరిశోధనా  ఫలితాలను  ‘ ప్రపంచం లో వివిధ దేశాలలో  క్యాన్సర్ నివారణ చర్యలను విస్తృతం గా అమలు పరిస్తే , వచ్చే పదిహేను , ఇరవై సంవత్సరాలలో ,  అనేక  రకాల క్యాన్సర్ లను చాలా వరకూ నివారించ వచ్చు ‘ అని ఘంటా పధం గా చెప్పాడు.  ప్రస్తుతం అమెరికా లోని  యుటా  రాష్ట్రం లో స్మోకింగ్ చేస్తున్న వారు కేవలం పదకొండు శాతమే !  అంటే స్మోకింగ్ చేసే వారు, అనేక చర్యల ఫలితం గా చాలా తక్కువ అయ్యారు.  గ్రహం అంచనా ప్రకారం , స్మోకింగ్ నివారణ చర్యలను వివిధ దేశాలలో, ఇదే విధం గా ,  ఖచ్చితం గా అమలు చేస్తే , స్మోకింగ్ వల్ల వచ్చే క్యాన్సర్ లను మూడు వంతులు నివారించ వచ్చు అని పేర్కొన్నాడు.  
అదే విధం గా ఊబకాయం అంటే ఒబీసిటీ ప్రస్తుతం కనీసం ఇరవై శాతం క్యాన్సర్ లకు కారణం. వివిధ దేశాలలో ప్రజలు , ఊబకాయం లేకుండా , నివారణ చర్యలు తీసుకుంటే , ఒక ఇరవై ఏళ్ళ లో ఒబీసిటీ వల్ల కలిగే వివిధ క్యాన్సర్ లను యాభయి శాతం వరకూ నివారించ వచ్చు. మనకందరికీ తెలిసిందే కదా , ఒబీసిటీ నివారణ కేవలం మనం తీసుకునే రెండు చర్యల వల్ల  సఫలం అవుతుంది. ఒకటి  డయట్. రెండు ఎక్సర్సైజ్. 
అట్లాగే   బాల్యం లో , తప్పని సరిగా టీకాలు వేయించుకోవడం వల్ల  కూడా క్యాన్సర్ లను వంద శాతం నివారించు కోవచ్చు. ప్రత్యేకించి  హ్యూమన్ పాపిలోమా వైరస్ , హెపటైటిస్  బీ ఇంకా సి  వైరస్ లు కలిగించే క్యానర్ లకు టీకాలు అందుబాటు లో ఉన్నాయి. ఇది మన వైద్య శాస్త్ర విజ్ఞానం  చేసిన  విశేషమైన పురోగతి.  ఈ టీకాలను సరి అయిన సమయం లో చేయించు కుంటే  ఈ వైరస్ లు కలిగించే అనేక క్యాన్సర్ లను వంద శాతం నివారించు కోవచ్చు.టమాక్సిఫెన్ అనే మందు కూడా  కొన్ని రకాల రొమ్ము లేదా స్తన క్యాన్సర్ లను కనీసం యాభయి శాతం నివారిస్తుంది అని అనేక పరిశోధనల వల్ల విశదమైంది. అదే విధం గా మనం సామాన్యం గా జ్వరం వచ్చినప్పుడు వేసుకునే యాస్పిరిన్ టాబ్లెట్ కూడా  పెద్ద ప్రేగు లేదా కోలన్ క్యాన్సర్ ను కనీసం నలభై శాతం నివారిస్తుంది.
తెలిసింది కదా , మానవులలో వచ్చే అన్ని క్యాన్సర్ లూ దైవాధీనం కాదు , మానవాధీనం కూడా అని !  నివారణ మీ చేతులలో నే ఉంది కదా ! కాల యాపన ఎందుకు ఆచరణకు? ! 
( రొమ్ము క్యాన్సర్ , సెర్వికల్ క్యాన్సర్ , లంగ్ క్యాన్సర్ నివారణ చర్యల గురించి , విపులం గా క్రితం టపాలలో తెలియ చేయడం జరిగింది. వీలు చేసుకుని  బాగు ఆర్కివ్స్ లో చూడండి మీ ‘ బాగు ‘ కోసం ! ) 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

ప్ర.జ.లు. 16. ఇన్ ఫిడిలిటీ కనుక్కోవడం ఎట్లా ?

In ప్ర.జ.లు., మానసికం, Our minds on సెప్టెంబర్ 5, 2012 at 10:31 సా.

 ప్ర.జ.లు. 16. ఇన్ ఫిడిలిటీ కనుక్కోవడం ఎట్లా ? 

9. అతి రొమాన్సు ఒలక పోయడం : ఉదా:  మధు తన భార్య కు ఒక పార్టీ కి తీసుకు వెళ్ళాడు. కార్పోరేట్  సంస్థ ల ఉద్యోగులంతా కలవడం తో వాతావరణం  చాలా ఉత్సాహ భరితం గా ఉంది. చాలా మంది విదేశాలకు కూడా వెళ్లి , అక్కడ పార్టీ వాతావరణం , రొమాంటిక్ గాలులు ఎట్లా వీస్తాయో అన్నీ చవి చూశారు కాబట్టీ , తలా ఒకరు , ఒక మందు గ్లాసు , వైన్ గ్లాసు పట్టుకుని , మిగతా పార్టీ ఆహ్వానితులను చూస్తూ, కరచాలనం చేస్తూ , సంభాషణలు కూడా చేస్తూ చాలా సరదాగా సమయం వెళ్ళ బుచ్చుతున్నారు. జోకులు వేసే వారు ఉన్న చోట, చుట్టూ చేరిన వారు , నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మధు తన భార్య ను కనీసం నలుగురు పర స్త్రీల దగ్గరకు తీసుకు వెళ్ళాడు. వారికి పరిచయం చేశాడు. అంతే కాక వారిని తను విష్ చేయవలసిన సమయం లో అతి ప్రేమతో వారి నాజూకు చేతులు అంది పుచ్చుకుని అతి సున్నితం గా వారి చేతి మీద తన పెదవులతో ముద్దులు పెడుతున్నాడు. మధు భార్య కు ఇదంతా చాలా ఎబ్బెట్టుగా , వింత గా ఉంది.  మధు కు ఇవన్నీ పట్టడం లేదు.’  మా ఆఫీసు లోనే పని చేస్తుంది, లతా యు ఆర్ సో స్వీట్ టుడే ‘ అని ఒక స్త్రీనీ ,  ‘ యూ లుక్ సో సో సెక్సీ టు నైట్ ‘ అని మెల్లగా చెవిలో గుస గుసలాడుతూ , ఇంకో  అమ్మాయినీ పరిచయం చేస్తున్నాడు, తన భార్యకు. ఇట్లా ఏమాత్రం సంకోచం లేకుండా ఇతర స్త్రీల మీద ఎక్కువ ప్రేమ చూపుతూ , రొమాన్సు సీన్సు క్రియేట్ చేస్తూ వారి ‘ మనసు దోచుకోడానికి ‘ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. 
10. ఏకాంత సమయం, ఏకాంత కోసమైనా : ఎఫైర్స్ మొదలు పెట్టే వారు అబ్సెసివ్ గా తమకై  ప్రత్యెక సమయం, అంటే  పర్సనల్ గా సమయం ఉండాలని , తమ భార్య తో చెబుతూ ఉంటారు. అంతే కాక , ఇంట్లో భార్య తో ఉంటున్నా , తమ  కై ఒక ప్రత్యెక గది లో ఏకాంత సమయం గడుపుతూ ఉంటారు. ఈ రోజులలో , ఇంటర్నెట్  , చాట్ రూం , మొబైల్ తో  మేసేజీలూ , అన్నీ వీలవుతున్నాయి కాబట్టి , ఇతరుల తో ప్రేమ వ్యవహారాలు నడపడం బహు శులభం అయి పోయింది.  బ్యాంక్ జామా ఖర్చులు , ఫోను బిల్లులు భార్య కు కనపడకుండా దాచి పెట్టడం కూడా , ఇన్ ఫిడిలిటీ ఉన్న వారు తరచూ చేసే పనులే !  
ఒక గమనిక : పైన ఇంత వరకూ ఉదాహరించినవి సామాన్యం గా కనపడే లక్షణాలు. కానీ  వీటిలో ఒకటైనా కానీ , లేదా అన్నీ కానీ లేకుండా కూడా ఎఫైర్స్ పెట్టుకుని  ‘ విజయ వంతం గా ‘ పర పురుషులతోనూ , పర స్త్రీల తోనూ, ‘ స్వర్గ సుఖాలు ‘ అనుభవిస్తున్న వారు కూడా ఉన్నారు. ఈ వ్యాసం మొదటిలో తెలుసుకున్నట్టు , ఎఫైర్స్ నూ , ఇన్ ఫిడిలిటీ నీ సంపూర్ణం గా ఖచ్చితం గా కనిపెట్టడం లేదా తెలుసుకోవడం చాలా కష్ట సాధ్యమైన పని. అంత వరకూ , ఎఫైర్స్  ఉన్న వారు, వారి వారి  జీవితాలు , మూడు ముద్దులూ , ఆరు కౌగిళ్ళు గా ‘ సుఖం’ గా వర్ధిల్లు తారనడం లో ఏ మాత్రం సందేహం లేదు !  
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

ప్ర.జ.లు.15. ఇన్ ఫిడిలిటీ లక్షణాలు:

In ప్ర.జ.లు., మానసికం, Our minds on సెప్టెంబర్ 4, 2012 at 10:43 సా.

ప్ర.జ.లు.15. ఇన్ ఫిడిలిటీ లక్షణాలు:

6.సొంత షోకు: ఎఫైర్ లలో పడ్డవారు , లేదా పెట్టుకుంటున్న వారు , తమ స్వంత  వేష ధారణా , వ్యక్తిగత గ్రూమింగ్ అంటే పోషణా , అందం, ఆకర్షణా , ఇట్లాంటి విషయాల మీద , మునుపెన్నడూ లేని శ్రద్ధ  చూపుతారు. లేటెస్టు హెయిర్ స్టయిల్ లు చేయించుకోవడం, జిమ్ కు వెళ్ళడం , అందమైన అలంకరణలు చేసుకోవడం , ఆకర్షణీయం గా కనిపించడం ,మంచి ఖరీదైన బట్టలు వేసుకోవడానికి ఉత్సాహం చూపడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. 
7. జీవితేచ్చ పెరుగుతుంది: అంత వరకూ దిగాలు పడి , జీవితం మీద, జీవించడం మీద అంత గా ఉత్సాహం చూపని వారు కూడా, ఎఫైర్స్  పెట్టుకోగానే , అత్యంత ఉత్సాహం తో , జీవితం లో ఆశా జనకమైన మార్పులు కోరుతూ , అందు కు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే ఒక విధం గా చెప్పుకోవాలంటే , ఎఫైర్స్ పెట్టుకుంటున్న వారు , డిప్రెషన్ బూజు దులుపుకుని ,ఆశ , ఉత్సాహాల వెలుగు తో  ఇన్ ఫిడిలిటీ ‘ పధం ‘ వైపు పయనిస్తారు. అంతే కాక , అంతకు ముందు ఎపుడూ చేయని సాహస వంత మైన కార్యాలు , ఆటలూ , పర్యటనలు , ఇట్లాంటివి కూడా ఎంతో ఉత్సాహం తో చేపడుతూ ఉంటారు. ఉదా:  ప్రకాష్ , ఇంటి పట్టున భార్యను అంటి పెట్టుకునే ఉండేవాడు ఎపుడూ ! ఆటలలో , వ్యాయామం లో ఎక్కువ ఉత్సాహం చూపే వాడు కాదు. అట్లాంటిది , ఒక రోజు ఉన్నట్టుండి , భార్య తో  బజారు కు వెళ్లి టెన్నిస్ ఆట కు కావలసిన సరంజామా అంతా కొనేశాడు. అంతే కాక , మంచి డిజైనర్ స్పోర్ట్ షార్ట్స్ తీ షర్ట్ లు కూడా కొన్నాడు. భార్య ఆశ్చర్య పోయినా , ఏ మాత్రం అభ్యంతరం చెప్పలేదు , పైగా చాలా ఆనంద పడ్డది కూడా , తన  భర్త ఆరోగ్యం విషయం లో ఎక్కడ లేని శక్తి ఉత్సాహం తెచ్చుకుని ,తగిన వ్యాయామాలూ , ఆటలు ఆడడం మొదలు పెడుతున్నందుకు. ప్రకాష్ ఆటలు, ఆఫీసులో తన లేడీ కొలీగు తో జత కట్టి , టెన్నిస్ తో పాటుగా ఆడే  ప్రేమాటలూ, కామ వాంఛ ల మాచ్ లూ అని ఏమాత్రం తెలియదు ఆమెకు !
8. అసమంజసమైన సమర్ధన : ఈ ఇన్ ఫిడిలిటీ లక్షణాలు ఉన్న వారు , వారు చేస్తున్న పనులనూ , వ్యవహారాలనూ , చాలా అసమంజసం గా సమర్ధించు కుంటారు. అంటే వారికి ఆ విషయం అర్ధమైనా , తమ పొరపాటును , చాలా తీవ్రం గా సమర్ధించు కుంటారు, ఎట్టి పరిస్థితులలోనైనా ! ఉదా:  ‘ ఏమండీ , నా ప్రక్కన పడుకుని రాత్రంతా నిద్ర పోనిచ్చే వారు కాదు ,మీ చిలిపి పనులతో , ఇప్పుడు అది లేక పోగా మీరు కూడా నిద్ర పోవట్లేదు , ఎప్పుడూ , మొబైల్ తో ఎవరికో టెక్స్ట్ లూ ,  గుస గుసలూ , ఎవరితో చేస్తున్నారండీ , మీ ఆఫీసులో ఉన్న ఆ రమ తో నేనా? ! అని పొరపాటున అడిగితే ‘  పిచ్చి పిచ్చి గా నోరు పారేసుకోక , నీ వాదనలకూ , అపవాదులకూ అర్ధం పర్ధం లేకుండా పోతుంది మరీ , మాటలు జాగ్రత్తగా రానీయి ‘ అని భార్యను తీవ్రం గా మందలించి తాను మాత్రం రమకు మొబైల్ లో ‘  రేపు ఆఫీసుకు పింకు చీర కట్టుకు రా !  చాలా అందం గా ఉంటావు అందులో , అలా ఆఫీసు అయ్యాక  పార్కు దగ్గర కలుద్దాము ‘ అని టెక్స్ట్ పంపాడు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు  ! 

ప్ర.జ.లు.14. ఇన్ ఫిడిలిటీ ని ఎట్లా కనుక్కోవచ్చు ?

In ప్ర.జ.లు., మానసికం, Our minds on సెప్టెంబర్ 2, 2012 at 12:51 సా.

ప్ర.జ.లు.14. ఇన్ ఫిడిలిటీ ని ఎట్లా కనుక్కోవచ్చు ?

జవాబు: 3. నియంత్రణా ధికారం:   ఎఫైర్స్ పెట్టుకునే వారు , తరచూ  తమ భాగ స్వామి తమను ఎక్కువ గా నియంత్రించడానికి చూస్తుందని అపవాదు వేస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి , వారే తమ భాగ స్వామి ని కంట్రోలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఉదా: ‘ ఆమె తనకు ఎక్కువ స్పేస్ కావాలని అడుగుతుంది. నాతో ఉంటే తనకు ఊపిరి అందనట్టు గా సఫోకేటింగ్ గా ఉంటుందని చెబుతుంది’ అనీ ,  ఇంకొకరు తన భార్య ‘ ఇట్ ఈజ్ మై వే ఆర్ హైవే ‘ లాగా ప్రవర్తిస్తుంది ‘ అనీ అపవాదు వేస్తారు. ఇంకా కొందరు వారు వారి సంబంధాలలో ‘ చిక్కుకు ‘ పోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు.  ఇక్కడ జరుగుతున్నది యదార్ధానికి ఎవరైతే , పర పురుషుడు , లేదా పర స్త్రీ వ్యామోహం లో పడతారో , వారే వారి వారి భాగ స్వాములను , వారి చర్యలనూ , గట్టి పట్టు తో ,తమ నియంత్రణ లో ఉంచుదామని సర్వ విధాలా , నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. తమ ఆత్మ న్యూనతా భావాలనూ , లేదా గిల్టు భావనలనూ , ఆ విధం గా ఎదుటి వారి మీదకు మళ్ళించడానికి శత విధాలా ప్రయత్నిస్తూ ఉంటారు.  ఒక విధం గా చెప్పుకోవాలంటే ,వారు, తమ చర్యలను సమర్ధించు కోవడానికి ఇట్లాంటి వ్యూహాలు పన్నుతూ ఉంటారు. తమ భాగ స్వాములను చిన్న బుచ్చడం, ఎమోషనల్ గా గాయ పరచడం చేస్తూ ఉంటారు. 
4.ఎక్కువ పని గంటలు:  పని గంటలు ఎక్కువ అవుతున్నట్టు ఇంట్లో చెప్పడం , మీటింగు ఉందని , బిజినెస్స్ ట్రిప్ ఉందనీ , లేక వేరే ఊరికి లేదా టౌన్ కు వెళ్లి పని చేసుకు రావాలనీ , అక్కడ ఒక వారం రోజులు పని ఉంటుందనీ కల్ల బొల్లి మాటలు చెబుతూ ఉంటారు.ఉదా:  మదన్ , సరదా మనిషి, చిన్నప్పుడే అందరూ  అనే వారు , పెళ్లి చేసుకోకు రా మదనా ! అని ఎందుకంటే , అమ్మాయిలను ‘బుట్టలో ‘ వేసుకోవడానికి ఎప్పుడూ మదనుడు బహు  సందడి చేసే వాడు. కాలేజీ లోనూ   అంతే ! తరువాత ఉద్యోగం చేసే సమయం లో చేస్తున్నదీ అదే ! చదువు లొనూ రాణించాడు , అంతే కాక , కాస్త ‘ ఉన్న ‘ కుటుంబం కూడా కావడం తో , ‘ మంచి  సంబంధం ‘ వెదికి చేశారు మదన్ కు , ఇంట్లో వాళ్ళు, ఒక ఇంటి వాడైతే , ‘ కుదురు ‘ వస్తుందని. కానీ మదనుడు , తన పేరును సార్ధకం చేయడానికా అన్నట్టు ,  కామ విశృంఖలత కు అలవాటు పడ్డాడు. అందుకు తగ్గట్టుగా తన పని గంటలు తానే నిర్ణయించు కుంటాడు  ప్రతి రోజూ ! ప్రతి వారం, ప్రతి నెలా ! కేవలం అమ్మాయిలతో వ్యవహారాలకు , సాయింత్రాలూ , పిక్నిక్ లకూ , వీకెండ్ లకూ , కొన్ని రోజులూ , స్త్రీలు నచ్చితే , హాలిడేలూ , ఇట్లా ‘ వివిధ కార్యక్రమాలకు , తన ఆఫీసు ను , పనిగంటలనూ , వోవర్ టైం నూ , బిజినెస్ ట్రిప్ లనూ , బోర్డ్ మీటింగ్ లనూ సాకు గా  చాక చక్యం గా ఉపయోగించు కుంటాడు.   భార్య  మాత్రం ‘ వారికి ఆఫీసులో చాలా పని, మరి బాధ్యత కల ఉద్యోగమాయె ! బాగా చూసుకోవాలి వారిని  నేను అనుకుంటూ , కృత నిశ్చయం తో , ‘ వారిని  బంగారం లా చూసుకుంటూ , తన శృంగారమంతా ‘ తన ‘ మదనుడికి విందు  చేస్తూ ఉంటుంది, ఇంటి పట్టున ఉన్న సమయం లో !  
5. అనారోగ్యం సాకు:  తాము ఎవరితోనైతే ఉంటున్నారో వారి ఆరోగ్యం అనివార్య కారణాల వల్ల బాగో లేనప్పుడు , ఆ సమయం లో వారు అవకాశం తీసుకుంటారు. ఇట్లా సాధారణం గా కనీసం యాభై శాతం మంది ఎఫైర్స్ లో నూ ఇన్ ఫిడిలిటీ లోనూ పడుతుంటారని ఒక పరిశీలనలో తెలిసింది.  భార్య కు ఏదైనా దీర్ఘ కాలిక వ్యాధి ఉన్నప్పుడు, లేదా కాలో , చెయ్యో విరిగి , ఆసుపత్రి పాలయినప్పుడు , వారి భర్తలు  ఆ ‘ సదవకాశాన్ని ‘ తమ  కామ లాభం కోసం ఉపయోగించు కుంటూ ఉంటారు. ఇట్లాంటి పరిస్థితులలో , యుక్తా యుక్తాలు , అంటే ఏది మంచి , ఏది చెడు అని వ్యాఖ్యానించడం కూడా కష్టమే ! కొందరు ‘ భార్యలు  ‘ కూడా ‘ నీ సుఖమే నే కోరుతున్నా ! అనే భావనతో ఉంటారు. ముఖ్యం గా ఇక్కడ జరిగేది , భర్తలు, తమ భార్యల ఆరోగ్యం కన్నా , తమ  కామ వాంఛ లకు ప్రాధాన్యత ఇస్తారు, ఆ కుటుంబ విపత్కర పరిస్థితులలో కూడా ! కొందరు భార్యలు కూడా, తమ భర్తలు అనారోగ్యం పాలయినప్పుడు , పర పురుషులతో కామ సంబంధాలు  పెట్టుకుని ,’  రతి బంధాలలో తల మునకలవుతూ ‘  ఉంటారు. 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !