ప్ర.జ.లు. 5. మరి హ్యాండ్ షేకుల మాటేంటి ?
మనం హగ్గు ల సంగతులు చాలా వరకు తెలుసుకున్నాం కదా ! మరి హ్యాండ్ షేకుల మాటేంటి ?
జవాబు: హ్యాండ్ షేకు కూడా హగ్గు లాగానే , నవీన మానవ సంబంధాల పరంపర లో ఒక ముఖ్యమైన సాధనం. హ్యాండ్ షేకు కు కూడా , హగ్గు లానే , మీరు ఏమీ డబ్బు చెల్లించ నవసరం లేదు. కానీ ఎంతో విలువైన స్నేహాన్నీ , పరిచయలనూ , కేవలం మీరు హ్యాండ్ షేక్ చేయడం ద్వారానే పెంపొందిస్తుంది. కొందరు కరచాలనం అదే హ్యాండ్ షేక్ చేస్తే , వారిలో ఆత్మ విశ్వాసం ఉట్టి పడుతూ ఉంటుంది. మరి కొందరి హ్యాండ్ షేకు , బలహీనం గా , పేలవం గా ఉంటుంది. మరి మంచి హ్యాండ్ షేక్ ఎట్లా చేయాలి ? ఆ విషయాలు ఇప్పుడు తెలుసు కుందాం !
మనం చాలా తేలిక గా తీసుకునే ఒక సాధారణ కరచాలనం లేదా హ్యాండ్ షేక్ మన గురించి ఎదుటి వారికి చాలా తెలియ చేస్తుంది. చక్కగా చేసిన హ్యాండ్ షేక్ మీలో ఆత్మ విశ్వాసాన్ని ఎదుటి వారికి తెలియ చేసి , వారికి మీపైన ఉన్న అభిప్రాయాన్ని పాజిటివ్ గా మారుస్తుంది. అదే హ్యాండ్ షేక్ మీరు సరిగా చేయక పొతే ,మీ వ్యక్తిత్వాన్ని ఎదుటి వారు డౌట్ చేసేలా లేదా అనుమానాలు వ్యక్తం చేసేలా చేస్తుంది.
మరి హ్యాండ్ షేక్ ఎట్లా చేయాలి ? :
1.ఎదుటి వారి తో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ , మీరు మీ కుడి చేతిని , మీరు హ్యాండ్ షేక్ చేయాలను కుంటున్న వారి దిశగా చాచండి.
2. అట్లా చాచుతున్నప్పుడు , మీ చేతిని భూమికి సమాంతరం గా ఉంచండి. మీ కుడి చేతి బొటన వేలు ఆకాశం వైపు ఉంచండి.
3. ఎదుటి వ్యక్తీ వారి కుడి చేతిని చాచినప్పుడు , దానిని మీ హస్తం తో అందుకోండి.
4. మీ చేతి తో ఎదుటి వారి చేతిని ఫర్మ్ గా నొక్కండి అంటే స్క్వీజ్ చేయడం. అట్లా చేస్తున్నప్పుడు మీ హస్తం తో వారి హస్తాన్ని కొద్దిగా క్రిందకు, అంటే రమారమి రెండు సెంటీ మీటర్లు క్రిందకు వంచండి.
5.తరువాత మీ హస్తం లో ఉన్న ఎదుటి వారి హస్తాన్ని వదిలేయండి.
6.ముఖ్యం గా హ్యాండ్ షేక్ చేసిన వెంటనే , మీ హస్తాన్ని , మీ బట్టలకు కానీ , టవల్ కు కానీ తుడవడం మాత్రం చేయకండి.
మీరు ఈ హ్యాండ్ షేక్ ను మీ స్నేహితులతో ప్రాక్టిస్ చేసి వారి కామెంట్స్ తెలుసుకోండి. తరువాత జరిగే ఇంటర్వ్యు లలో మీదే విజయం !
ఇంకా వివరాలు కావాలంటే పైన ఉన్న వీడియో చూడండి.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !