హగ్గులూ , హ్యాండ్ షేకులూ .2. ఎట్లా హగ్ చేసుకోవాలి ?
మానవులు పరస్పరం తమ తమ ప్రేమా, ఆప్యాయతా స్నేహ శీలతా తెలుపుకునే, లేదా ప్రకటించుకునే ఒక అతి ముఖ్యమైన చర్య హగ్గు లేదా ఆలింగనం. మనలో చాలా మంది ఈ అతి ముఖ్యమైన చర్యను సరిగా పాటించక , తమ భావాలనూ , అనుభూతులనూ ,సరిగా తెలియ చేయ లేక పోతూ ఉంటారు సామాన్యంగా ! కొన్ని సమయాలలో ఈ హగ్గు ఇబ్బంది కరం గా కూడా మారుతుంది. మరి ఈ ఉచితమైన చర్య అత్యంత విలువైన మానవ సంబంధాలు కూడా పెంపొందింప చేస్తుంది అనుకున్నప్పుడు , సరిగా హగ్ చేసుకోవడం తెలుసుకోవడం లో తప్పేంటి ? ఆ సరి అయిన హగ్గు వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు !
హగ్గులలో మొదటి పాఠం ఎట్లా సమీపించాలి అని. ఇక్కడ గమనించ వలసిన విషయం ఏమిటంటే , మీరు హగ్గు చేసుకోవాలనుకుంటున్న వారు మీకు బాగా తెలిసిన వారై ఉండాలి. పరిచయాలు సరిగా లేక పోయినా అతి దగ్గరకు సమీపించడం, హగ్గు చేసుకోవడం లాంటి చర్యలు తీవ్రం గా పరిగణించ బడతాయి చాలా దేశాలలో !
ఫ్యామిలీ హగ్ : కుటుంబ సభ్యులను ఆప్యాయత తో ఆలింగనం చేసుకోవాలనుకుంటే మీరు వారిని దయ తో సమీపించాలి. ఎక్కువ ఎమోషనల్ గా కూడదు.
గర్ల్ ఫ్రెండ్ ను సమీపించే సమయం లో , చాలా కేరింగ్ గా అప్రోచ్ అవాలి. కొన్ని సమయాలలో హాస్య పూరితం గా అంటే హ్యుమరస్ గా ఒక చిరు మంద హాసం తో కూడా అప్రోచ్ అవవచ్చు.
తోటి మగ స్నేహితులను సమీపించే సమయం లో , మీరు జన్యన్ గా అంటే నిజాయితీ గా ఒక చిరు నవ్వు తో హగ్ చేసుకోవచ్చు. ఒక వేళ మీరు ( మగ వారై ) హగ్ చేసుకుంటున్న ( మగ ) వారు మీతో ‘ ఇంకో ఉద్దేశం ‘ తో స్పందిస్తే , మీరు వెంటనే మీ అయిష్టత ను వారికి తెలియ చేయాలి , అంటే వెంటనే ఆ ఆలింగనం , చాలా ఇబ్బంది కరం గా మీకు ఉన్నట్టు చెపుతున్నట్టుగా , దూరం జరగాలి.
క్రష్ హగ్: ఈ హగ్ మీ గర్ల్ ఫ్రెండ్ తో చేసే సమయం లో మీరు సిగ్గు పడకుండా , మీ స్నేహితురాలిని అప్రోచ్ చేసి , ఒకటో రెండో లాలించే మాటలు అంటే కేరింగ్ వర్డ్స్ ఆమె చెవి లో ‘ ఊదండి ‘ !
ప్రేమికుల హగ్ : ప్రేమికుల హగ్ ను ఆమె అయినా, అతడైనా మొదలు పెట్ట వచ్చు. ముఖ్యం గా ఆమె భుజాల మీద అతడు తన చేతులను ఉంచాలి. లేదా ఆమె అతడి భుజాల మీద తన చేతులు సున్నితం గా ఉంచాలి. అంతే కానీ వారి బరువులను చేతుల ద్వారా భుజాల మీదకు ‘ బదిలీ ‘ చేయ కూడదు. ఆ తరువాత వారు తమ చూపులు తదేకం గా కలుపుకోవాలి ! ( వెనుక ఎక్కడ నుంచైనా చూపులు కలిసిన శుభ వేళా ! అనే పాట వినిపిస్తూ ఉంటే మరీ మంచిది , లేదంటే ఆ పాట ను మీ మనసులలోనే ఊహించు కొండి ! )తరువాత మీరు ‘ ఆమెను ‘ ప్రేమిస్తున్నట్టు చెప్పండి. ఆమెతో ఉన్న ప్రతి క్షణం ఎంత ఆనందం గా మీరు అనుభూతి చెందుతున్నారో కూడా తెలియ చేయండి. ఆ తరువాత మీరు ఆమెలోనూ , ఆమె మీలోనూ హృదయ పూర్వకం గా ‘ కలిసి పోండి’ , కరిగి పోండి !
ఇక్కడ ప్రేమికులు ఇరువురూ ఒక్క విషయం ఎప్పుడూ గుర్తు ఉంచు కోవాలి ! ఆ ప్రేమ , నిజాయితీ గా , స్వచ్చం గా ఉండాలి ! అంతే కానీ ‘ నటన ‘ కాకూడదు !
ఇంత వరకూ మనం హగ్ చేసు కోవడానికి మనకు పరిచయం ఉన్న వారిని ఎట్లా సమీపించాలో తెలుసుకున్నాం కదా ! వచ్చే టపాలో అసలు ‘ ఆలింగనం ‘ సంగతి కూడా తెలుసుకుందాం !