పక్ష వాతం.5.మరి ఎట్లా కనుక్కోవచ్చు? .
ప్రశ్న: మనం పక్ష వాతం సూచనలూ , కారణాలూ తెలుసుకున్నాం కదా ! మరి పక్ష వాతం వచ్చినట్టు ఎట్లా కనుక్కోవడం జరుగుతుంది.
జవాబు: పక్ష వాతం ( stroke ) అనగానే మనకందరికీ స్మరణ కు వచ్చేది , చేయి , లేదా కాలు బలహీన పడి పోయిన వారో , లేదా మాట పోయిన వారో గుర్తుకు వస్తారు.
కానీ పక్ష వాతం తీవ్రత చాలా రకాలు గా ఉంటుంది. అంటే కొద్ది గా వస్తే , మెదడు లో కొద్ది మార్పులు జరుగుతాయి. అందుకు తగినట్టుగా శరీరం లో కండరాల బలహీనత కూడా కొద్ది మాత్రం గా ఉంటుంది. కానీ అదే పక్షవాతం తీవ్రం గా వస్తే , మెదడులో మార్పులు కూడా తీవ్రం గా ఉండి, బలహీనత కూడా ఎక్కువ కండరాలలో కనిపిస్తుంది.
ప్రశ్న: కొద్ది మార్పులు వస్తే , మరి పక్ష వాతం వచ్చిందో , లేదో తెలుసుకోవడం ఎందుకు ? దాని వల్ల ప్రయోజనం ఏమిటి ?
జవాబు: ఇక్కడే అందరూ గమనించ వలసిన విషయం ఉంది. పక్ష వాతం కొద్ది గా వచ్చినా , తీవ్రం గా వచ్చినా , తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే , పక్ష వాతానికి కారణాలు, ఒకటి కానీ , ఒకటి కన్నా ఎక్కువ కానీ శరీరం లో ఉన్నట్టే కదా !
అంతే కాక , ఒక సారి పక్ష వాతం కనుక వస్తే , ‘ మిమ్మల్ని ఎప్పుడూ ఇక ఇబ్బంది పెట్టాను , మీ నుంచి శాశ్వతం గా శలవు తీసుకుంటాను ‘ అని పక్ష వాతం అనుకోదు. పక్ష వాతానికి అనుకూలమైన వాతావరణం అంటే కారణాలు మనలో ఉన్నంత కాలం, పక్ష వాతం మళ్ళీ మళ్ళీ వచ్చే రిస్కు కూడా ఉంటుంది. అందు వల్లనే , ఒక సారి ఆ సూచనలు వచ్చినా, గమనించినా , వెంటనే స్పెషలిస్టు ను సంప్రదించి, అవసరమైన పరీక్షలు అంటే ఇన్వెస్టిగే షన్స్ చేయించుకుని , తగిన చికిత్స కూడా చేయించు కోవాలి. అప్పుడు పక్ష వాతం రాకుండా నివారించు కోవచ్చు.
ప్రశ్న: మరి ఏ ఏ పరీక్షలు అవసరమవుతాయి?:
జవాబు: నిపుణుడైన డాక్టరు మొదట గా చేయవలసిన పరీక్ష మీ బీ పీ , అంటే రక్త పీడనం కనుక్కోవడం. అట్లాగే మీకు షుగర్ ఉందొ లేదో తెలుసుకోవడం, అంటే మధు మేహం వ్యాధి. అట్లాగే మీ నాడి పరీక్ష చేసి , మీ పల్స్ సవ్యం గా ఉందొ లేక అప సవ్యం గా ఉందొ తెలుసుకోవడం , అవసరమైతే ఈ సి జీ పరీక్ష కూడా చేయడం. ఇందులో ఏవి చేయక పోయినా , రిస్కు ఫాక్టర్ లను అశ్రద్ధ చేయడమే అవుతుంది. కాబట్టి మీరు కూడా ‘ ఆ పరీక్షలూ , ఈ పరీక్షలూ అంటూ వాయించేస్తారు డాక్టర్లు ‘ అని అనుకోకూడదు మరి !
ఈ మొదటి దశలో కనుక్కొన్న ఫలితాలను బట్టి మిగతా పరీక్షలు కూడా చేయించుకో వలసిన అవసరం ఉంటుంది. మిగతా పరీక్షలు క్రింద పేర్కొనడం జరిగింది.
1. CT scan.
2. MRI scan.
3. Swallow test.
4. Ultra sound ( Carotid ultra sonography )test.
5. Catheter angiogram or arteriography.
5. Echo cardiography.
క్రింద ఉన్న వీడియో లో సంక్షిప్తం గా పక్ష వాతాన్ని వెంటనే కనుక్కుంటే ఏ విధం గా చికిత్స చేయ వచ్చో తెలుప బడింది. చూడండి. ( ఆంగ్లం లో ఉంది )
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !