హగ్గులూ , హ్యాండ్ షేకులూ ! .3. కీలక ఘట్టం !
క్రితం టపాలో హగ్గు కు ప్రధమం గా ఎట్లా సమీపించాలో తెలుసుకున్నాం కదా !
ఇప్పుడు అత్యంత కీలకమైన ఆలింగనం ఎట్లా చేసుకోవాలో చూద్దాం !
కుటుంబ సభ్యులతో హగ్గు: మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉండ వచ్చు , హగ్గు చేస్తున్న సమయం లో ! అట్లా చేయడం , మీ ఆలింగానా సమయానికి ఏవిదం గానూ అంతరాయం కలిగించదు.
మీరు కుటుంబ సభ్యులతో బంధువులతో ఆలింగనం చేస్తున్నప్పుడు , మీ చేతులు ఎక్కడ ఉన్నాయి అనే విషయం ముఖ్యమైన విషయం కాదు. అది వారు పట్టించుకోరు. అట్లాగే మీరు మీ తలను కూడా ఆలింగనం చేస్తున్న వారి తలను తాకించ నవసరం లేదు.
మీరు ఆలింగానాన్ని వదిలే సమయం లో ఎదుటి వారి వీపు మీద మీ చేతులతో కొద్ది క్షణాలు రుద్ద వచ్చు , లేదా స్ట్రోక్ చేయ వచ్చు. అట్లాగే మీరు మంద హాసం చేస్తూ ( అంటే మీ ఆనందాన్ని తెలియ చేస్తూ ) హగ్గు ను వదల వచ్చు.
స్నేహితురాలితో హగ్గు : స్నేహితురాలితో ఆలింగనం ఒక పట్టాన వదల బుద్ధి కాదు కదా ! కానీ మీరు స్నేహితురాలిని హగ్గు చేస్తున్నప్పుడు , వీలైనంత బిగువు గా కౌగిలించు కొండి. మీ కళ్ళు మూసుకుని , మీ స్నేహితురాలిని ఎంత గా ప్రేమిస్తూ ఉన్నారో మననం చేస్తుకోండి. ఒక గమనిక : ఆలింగనాన్ని వదిలే సమయం లో మీ స్నేహితురాలి వీపు చరచడం చేయకండి. ఆమె మీరు మీ అయిష్టతను తెలియ చేస్తున్నారని పొరపాటు పడే అవకాశం ఉంది.
మగ స్నేహితులతో హగ్గు: మగ స్నేహితులను మగ వారు గట్టిగా హగ్గు చేసుకోవచ్చు. అట్లాగే మీ కలయిక ఆనంద కరమైనది అవుతే పరస్పరం వీపు చరుచుకోవడం కూడా చేయ వచ్చు. కానీ ఆ కలయిక విషాద కరమైన సందర్భానికి సంబంధించినదైతే , కేవలం కొన్ని క్షణాలు ఆలింగనం చేసుకుని వదిలేయాలి.
క్రష్ హగ్గు: మీరు మగ వారైతే , మీరు ఆలింగనం చేస్తున్న అమ్మాయి చేతులు మీ మెడకు రెండు వైపులా ఉంచుకోవాలి. కానీ మీరు మీ చేతులు మాత్రం , ఆమె నడుము చుట్టూ వేయాలి. మీరు ఆమె ను మీ దగ్గరగా హత్తుకోవచ్చు. ఆమె వక్షోజాలూ , ఉదరమూ మీ కు హత్తుకోవాలి. ఆ సమయం లో ఆమెను కొన్ని అంగుళాలు భూమి మీదనుంచి పైకెత్తితే , అంటే లిఫ్ట్ చేస్తే మరీ మంచిది. ఆమె ప్రణయ మేఘాలలో తేలిపోతుంది ! ఆ పరిస్థితిని కొన్ని క్షణాలు ఫ్రీజ్ చేయండి. మీ మనసులో కూడా మీ మనో నేత్ర కెమెరా తో ఆ క్షణాలు పదిలం చేసుకోండి. ఆమె కౌగిలి వదిలే సమయం లో , ఆమె కళ్ళ లో చూస్తూ , మీ సంభాషణ కొన సాగించండి సహజం గా !
మీరు అమ్మాయి అయితే, అతడి మెడ చుట్టూ మీ చేతులు పోనిచ్చి , మీ చాతీ తో , సున్నితం గా అతడి చాతీని హత్తుకోండి.
ప్రేమికుల హగ్గు: మీరు మగ వారైతే : ఆమె భుజాల మీదుగా మీ చేతులు జార వేసి , ఆమె నడుము చుట్టూ గా , ఆమె వీపు క్రింది భాగానికి చేర్చండి. తరువాత మీ తలను ఆమె భుజం మీద ఉంచి ఆమెను మీకు ఎంత సేపు కావాలనుకుంటే అంత సేపు హత్తుకోండి !
మీకు ఇష్టం గా ఉంటే , ఆమెకు మీ చేతులతో ఓ మినీ మసాజ్ చేయండి. ఈ సమయం లోనే ఆమెను భూమి మీద నుంచి కొన్ని క్షణాలు పైకెత్తండి, వారి బరువును కొన్ని క్షణాలు మీ మీద వేసుకుని. చాలా మంది యువతులు ఇట్లా చేస్తే , స్వర్గం లోకి ఎగిరి పోతున్నట్టు అనుభూతి చెందుతారు ! కౌగిలి నుంచి విడి పోయే సమయం లో చిరునవ్వు తో ప్రేమ పూర్వకం గా కౌగిలిని వదలండి, ఆమె కళ్ళలోకి చూస్తూ. సమయం, సందర్భం అనుకూలిస్తే , ఆమె పెదవుల మీదనైనా , లేదా బుగ్గల మీదనైనా ( మీ పెదవులు జారిపోకుండా ! ) ముద్దులు కురిపించండి, ఆమె ముంగురులు సవరిస్తూ !
మీరు యువతులవుతే : మీ చేతులు అతని మెడ చుట్టూ పోనీయండి. తరువాత అతని భుజాలూ , మెడ మధ్య ఉంచి పట్టుకోండి. అతనికి వీలైనంత దగ్గరగా కదిలి , తొడ భాగాలను తాకించి , అతనికి అతి సమీపం లోకి రండి. పరిస్థితులు బాగా అనుకూలం గా ఉండి , మీ ఇద్దరి మధ్యా ఏకాంతం ఎవరూ భంగ పరచక పొతే , మీ కాలు అతని కాలి మధ్య పెన వేయ వచ్చు కూడా. మీరు అతని కి సమానం అయిన ఎత్తు ఉన్నా , మీ చేతులను , అతని భుజాల క్రిందకు పోనీయడం కానీ , గట్టిగా , లేదా బిగువుగా కౌగిలించుకోవడం కానీ మీ అంతట మీరు చేయకండి. అప్పుడు ప్రణయ బంధం మధురం గా ఉంటుంది. ఆ కౌగిలి మనసులలో గిలిగింతలు పెడుతుంది.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
హగ్గుల్లో ఇన్ని రకాలా! బాగుందే!! ఎవరితో మొదలెట్టనబ్బా!!! 🙂