వెనక నొప్పి . 8. సయాటికా కు శస్త్ర చికిత్స ఎట్లా చేస్తారు ?
సయాటికా కు శస్త్ర చికిత్స, అంటే సర్జరీ ఏ పరిస్థితులలో చేస్తారు ?
1. వెనక నొప్పి తీవ్రత ఎక్కువ గా ఉండి , అనేక రకాల మందులతో కూడా నొప్పి తగ్గక పోతూ ఉంటే,
2. క్రమేణా వెనక నొప్పి తీవ్రత ఎక్కువ అవుతూ ఉంటే , అంటే కొన్ని ఏళ్ల తరబడి ఉన్న నొప్పి అకస్మాత్తు గా తీవ్రం అవుతే ,
3. నొప్పి ఉన్న వారి ఉద్యోగాలు , కుటుంబ జీవనం, నొప్పి వల్ల అతలాకుతలం అవుతూ ఉంటే,
4. నొప్పి తీవ్రత ఎక్కువ అయి, మూత్ర విసర్జన లేదా మల విసర్జన లో సమస్యలు ఏర్పడితే ( ఈ పరిస్థితి వెన్ను పూస ఎముక ( వర్టిబ్రా ) భాగం వెన్ను నాడిని నొక్కే ప్రదేశం బట్టి ఉంటుంది , అన్ని వెనక నొప్పులూ ఈ పరిస్థితి కలిగించవు )
వెన్ను నొప్పికి సర్జరీ ఎన్ని రకాలు గా ఉంటుంది ?

1. డి స్కె క్టమీ : ఈ రకమైన శస్త్ర చికిత్స లో సహజ స్థానం లో నుంచి బయటకి వచ్చి , పక్కన ఉన్న వెన్ను నాడిని నొక్కుతున్న డిస్కు భాగాన్ని జాగ్రత్త గా తొలగించడం జరుగుతుంది. ఇది సర్వ సాధారణం గా చేసే శస్త్ర చికిత్స.( పైన ఉన్న చిత్రం గమనించండి ).

2. సంధాన సర్జరీ లేదా ఫ్యూజన్ సర్జరీ : కొన్ని సమయాలలో వెన్నెముకే అంటే వర్టిబ్రా అమాంతం గా ఉన్న స్థానం నుంచి పక్కకు జరుగుతూ ఉండి , పక్కన ఉన్న నాడులకు వత్తిడి కలిగించి , లేదా ఆ నాడులను నొక్కుతూ , నొప్పి కలిగిస్తూ ఉంటే ఆ వెన్ను పూస ఎముకను అంటే వర్టిబ్రాను పైనా క్రిందా ఉన్న వెన్ను పూస ఎముకలతో కలిపి స్థిరం గా ఉంచుతారు. అంటే ఉక్కు మొలలతో ( స్టీల్ రాడ్స్ తో ) వెన్ను పూస ఎముకలకు రంధ్రాలు చేసి పైనా క్రిందా ఉన్న వెన్ను పూస ఎముకల సహాయం తో మధ్యలో ( ఊగుతూ ఉన్న ) వెన్ను పూస ఎముకకు స్థిరత్వం కలిగిస్తారు. దానితో ఆ స్థిరం గా ఉన్న వర్టిబ్రా , నాడుల మీద వత్తిడి కలిగించడం ఆగిపోతుంది. ఆ కారణం గా నొప్పి కూడా నివారణ అవుతుంది. గమనించ వలసినది వెన్ను పూస ఎముకలన్నీ కూడా , అంటే వర్టిబ్రా అన్నీ కూడా కొంత మేర మన జీవితాంతం , అంటే మనం కదులుతూ , వంగుతూ, లేవగలుగుతూ ఉన్నంత కాలం , కదులుతూ ఉంటాయి , కానీ అప్పుడు నొప్పి కలగదు కదా ! కేవలం సరి అయిన పధ్ధతి లో కదలక , అస్తవ్యస్తం గా కదిలితేనే , ప్రక్కన ఉండే వెన్ను నాడి నొక్క బడి , నొప్పి కలుగుతుంది. ( పైన ఉన్న చిత్రం గమనించండి ).
.jpeg.aspx)
3. లామి నెక్ట మీ: ఈ రకమైన సర్జరీ లో వెన్ను పూస ఎముక(ల ) ఎముక భాగాన్ని తొలగించి , వాటి ప్రక్కన ఉన్న నాడి మీద ఆ వెన్ను పూస ఎముక (లు ) వత్తిడి కలిగించడం లేదా నొక్కడం నివారిస్తారు. దానితో నొప్పి కూడా నివారించ బడుతుంది. ( పైన ఉన్న చిత్రం గమనించండి ).
వెన్నెముక సర్జరీ లలో ఉండే రిస్కులు ఏమిటి ?
ప్రతి శస్త్ర చికిత్స లో ఉండే రిస్కుల లాగానే , వెన్నెముక మీద చేసే సర్జరీ కూడా కొంత రిస్కు తో కూడుకున్నది. ఆ రిస్కులు ఏమిటి ?
1. ఇన్ఫెక్షన్ : వెన్నెముక ఆపరేషన్ చేసే భాగం లో ఇన్ఫెక్షన్ చేర వచ్చు . అంటే బ్యాక్టీరియా లు అక్కడ చేర వచ్చు. సర్వ సామాన్యం గా ఈ పరిస్థితి , చేసే సిబ్బంది , లేదా మేనేజ్మెంట్ వాళ్ళు కక్కుర్తి పడి కానీ , లేదా అజ్ఞానం వల్ల కానీ , లేదా బాధ్యతా రాహిత్యం వల్ల కానీ సరి అయిన శుభ్రత పాటించక పొతే కలుగుతుంది.
2. నాడులు దెబ్బ తినడం : కొన్ని సమయాలలో , సర్జన్ ఆపరేషన్ సరిగా చేయక పొతే , కొన్ని సున్నితమైన నాడులు తెగి పోయి , ఆ భాగం లో ఉన్న కండరాలు ‘ చచ్చు ‘ బడ వచ్చు
3. సరిగా ఆపరేషన్ చేయక పొతే , నొప్పి అట్లాగే ఉండ వచ్చు ! ఇంకో రకం గా చెప్పుకోవాలంటే , ఆపరేషన్ ఫెయిల్ అవడం !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !