Our Health

Archive for అక్టోబర్ 6th, 2012|Daily archive page

నవ్వితే లాభాలు. 3. కారణం లేకుండా నవ్వండి !

In మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 6, 2012 at 4:52 సా.

నవ్వితే లాభాలు. 3. కారణం లేకుండా నవ్వండి ! 

మనసారా మనం బాగా నవ్వితే , ఆ నవ్వు మన హృదయాలనూ , మెదడు నూ , ఆత్మనూ తాకి వాటిని ఉత్తేజ పరుస్తుంది. మన కందరికీ తెలుసు కదా , మనం ఒక మంచి హాస్య సంఘటననో , లేదా భాగా నవ్వు పుట్టించే జోకునో ఇతరులతో పంచుకుని ,మనం కూడా నవ్వితే అది ఏంటో ఆనంద కర మైన అనుభూతి అని ! ఆ అనుభూతి మనం ఒక విషాద సంఘటనను ఇతరులతో పంచుకున్నప్పుడు ఎట్లా అనుభూతి చెందుతామో అట్లాగే ఉంటుంది. అందుకే ఈ ఎమోషన్స్ , అంటే హావ భావాలు, వాటికి చాలా సారూప్యం ఉండడం వల్లనే , మనం బాగా ఆనందం తో నవ్వినా , లేదా విషాదం తో ఏడ్చినా  కూడా మన కళ్ళ నుంచి ఆశ్రువులు రాలుతాయి కదా ! 
అదే కారణం చేత నే మనం సామాన్యం గా నవ్వడం కూడా మరచి పోతూ ఉంటాము. ఎందుకంటే విషాదం లాగానే ఇతరులతో అంత తేలిక గా పంచుకోడడానికి సహజం గా సుముఖం గా ఉండము. మనకు చాలా సన్నిహితం గా ఉండే స్నేహితులతో కానీ, బంధువులతో కానీ మాత్రమె మనం పంచుకోగలం ఆ ఎమోషన్స్ ను !  అదే కారణం చేత నే మనం ఎంతో ఆరోగ్య కరమైన నవ్వును దాచుకుని  యాంత్రికం గా జీవితాలు గడపడానికి అలవాటు పడుతున్నాము. ఈ పరిస్థితిని మార్చి మనలను లాఫుతూ ఉండమని చెపుతూ అనేకమంది లాఫింగ్ గురూ లు పుట్టుకొచ్చారు. వీరిలో ప్రముఖులు డాక్టర్  మదన్ కటారియా. ఈ యన గారు , మనం మనస్పూర్తి గా నవ్వుకోడానికి ఎప్పుడూ మన అంతరంగిక మిత్రుల కోసమో , బంధువుల కోసమో వేచి చూస్తూ , మన నవ్వులను  దాచుకో నవసరం లేదని చెపుతూ , పబ్లిక్ లాఫింగ్ డేస్ ఏర్పాటు చేసి , అందరూ ( ఏ సంబంధం లేని వారు కూడా , కేవలం నవ్వు అనే బంధాన్ని ఏర్పరుచుకుని ) హాయి గా తనివి తీరా నవ్వు కోండని  ప్రవచించు తున్నారు ,  ఈ పధ్ధతి బాగుంది కదూ నవ్వుకోడానికి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని లాఫింగ్  సంగతులు !