Our Health

తినే ఆహారం తో, కామ వాంఛ ను అధికం చేసుకోవడం ఎట్లా ?1.

In Our Health on డిసెంబర్ 15, 2014 at 6:39 సా.

తినే ఆహారం తో, కామ వాంఛ ను అధికం చేసుకోవడం ఎట్లా ?1. 
మునుపటి టపాలలో , మనకు నిత్యం అవసరమయే అనేక రకాల విటమిన్లు , ఏ ఏ  సహజ మైన ఆహార పదార్ధాలలో లభిస్తాయో , ఆ యా విటమిన్లూ , ఖనిజాలూ , మన శరీరం లో లోపిస్తే , లేదా, ఉండ వలసిన దానికన్నా తక్కువ గా ఉంటే , కలిగే అనారోగ్యాల గురించి కూడా , వివరం గా తెలుసుకోవడం జరిగింది కదా ! 
ఇప్పుడు , కామ వాంఛ ను అధికం చేసే ,ఆ కొన్ని  సహజ ఆహార పదార్ధాల గురించి తెలుసుకుందాం ! 
ఈ సంగతి తెలుసుకోవడం ఎందుకు ? :  కామ కోరికలు, ప్రకృతి లో ,  అత్యంత సహజమైన కోరికలు !  నవీన మానవులు, అనేక మంది ,  అనేక కారణాల వల్ల , రతి లో సుఖం అనుభవించ లేక పోవడమే కాకుండా , అశాస్త్రీయ పద్ధతుల ద్వారా , ఆ కామ కోరికలను ఎక్కువ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ! బజారు లో దొరికే , అనేక రకాల మందులు కొంటూ , ఫలితాలు లేక పోగా , తమ ధనం కూడా వృధా చేసుకుంటున్నారు ! సహజం గా లభించే ఆహార పదార్ధాలను తీసుకుంటే , ఎక్కువ ఫలితాలు ఉండడమే కాకుండా , అవి తినే వారి ఆరోగ్యం కూడా అనేక రకాలు గా వృద్ధి చెందుతుంది ! అంటే , శారీరిక , మానసిక , కామ ఆరోగ్యాలు అన్నీ కూడా !   

1.కర్బూజా పండు: 

సహజ వయాగ్రా గా పేరు గాంచిన కర్బూజా పండు ( పై చిత్రం చూడండి )  లో  సిట్రుల్లిన్ అనే రసాయన పదార్ధం ఉంటుంది. ఈ సిట్రుల్లిన్  , శరీరం లోని రక్త నాళాలను వ్యాకోచింప చేసి , తద్వారా కామోద్దీపన ఎక్కువ చేస్తుంది ! అంటే , మిగతా భాగాల తో పాటుగా , మెదడూ , మర్మాంగాలలో  కూడా రక్త ప్రసరణ ఎక్కువ అయి ( ఆయా భాగాలలో ఉన్న రక్త నాళాలు వ్యాకోచించడం ద్వారా )  కూడా ! ఈ సిట్రుల్లిన్ ను  వ్యాపార పరం గా , వివిధ హెల్త్ ఫుడ్స్ లోనూ టానిక్ లలోనూ కలుపుదామని , వ్యాపారులు, శాస్త్ర వేత్తలూ , అనేక ప్రయత్నాలు చేసి విఫలం చెంది ,  కర్బూజా పండు ను సహజం గానే తింటే , ఈ సిట్రుల్లిన్ , అత్యధికం గా  శరీరానికి లభించి , తగిన ఫలితాలను ఇస్తుందని తేల్చారు ! 
కర్బూజా పండు ను ఎట్లా తినాలి ? :  పుడ్డింగ్ లో కానీ , కేకు లలో కానీ , తినేకన్నా , కర్బూజా పండు ను సహజం గానే ముక్కలు గా కోసి తినడం ఉత్తమం !  దాని ఔషధ గుణాలు కావాలనుకుంటే ! పైన చెప్పిన కారణాల వల్ల ! 

2. సెలరీ : సెలరీ  ఆకుపచ్చని కాడల లా కనిపిస్తుంది ! ( పైన ఉన్న చిత్రం చూడండి ) ! మన దేశం లో కూడా దొరుకుతుంది , కూరగాయల మార్కెట్ల లో ! విదేశాలలో , అన్ని సూపర్ మార్కెట్ లలోనూ కనిపిస్తుంది !  సెలరీ లో యాన్ డ్రో స్టిరోన్ అనే హార్మోను ఉంటుంది ! ఈ హార్మోను  ఫిరమోను లా పనిచేస్తుంది ! ఫిరమోను లు , స్త్రీలలోనూ , పురుషుల్లోనూ ఉంటాయి ! ప్రత్యేకించి , స్త్రీలోనూ , పురుషుల్లోనూ , వారి , వారి స్వేదం , అంటే, చెమట ద్వారా బయటకు వస్తాయి , శరీరం నుంచి  !  తద్వారా ,  ప్రతి స్త్రీకీ , పురుషుడి కీ ఒక ప్రత్యేక మైన వాసన కలిగిస్తాయి !  పరస్పర ఆకర్షణ కు కారణమవుతాయి ! ఫిరమొనులు  స్త్రీలలో నూ , పురుషుల్లోనూ ,  మెదడు మీద తమ ప్రభావం చూపి , వారిని కామ కేళి కు ప్రేరేపిస్తాయి ! అంటే , సెలరీ లో ఉండే యాన్ డ్రో స్టిరోన్  అనే హార్మోను , కామకేళి మొదలు పెట్టమని సంకేతాలిచ్చే సిగ్నల్ ! 
మరి సెలరీ ని ఎట్లా తినాలి ? : సెలరీ ని  పచ్చిగానే సలాడ్ లలో వేసుకుని తినాలి !   
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
  1. sir,
    mee article bavundi. selari ki telugu peru chepagalara pl.
    a.v. ramana.

  2. ప్రతి మొక్కకూ , ఒక్కో దేశం లో ఒక్కో పేరు ఉన్నా , అంతర్జాతీయం గా, ఓకే శాస్త్రీయ నామం ఉంటుంది ! సెలరీ కి శాస్త్రీయ నామం ‘ Apium graveolens var .dulce ‘ ! కొన్ని చోట్ల సెలరీ అంటే, ‘ వాము ‘ మొక్క అని కూడా అన్నారు, అంటే మనం జంతిక లలోనూ , బజ్జీలలోనూ వేసుకునే వాము విత్తనాల నుంచి పుట్టే మొక్క ! మరి ఇందులో నిజం నాకు తెలియదు ! అట్లాగే తెలుగులో ‘ సరస్వతి ‘ ఆకు అని కూడా అంటారని చదివాను ! నాకు ఖచ్చితం గా తెలియదు !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: