తినే ఆహారం తో, కామ వాంఛ ను అధికం చేసుకోవడం ఎట్లా ?3.
Fig : ఫిగ్ లేదా తెలుగులో దానినే అత్తి పండు లేక అంజీరము అని కూడా అంటారు ! ( పై న ఉన్న చిత్రం చూడండి ! ) ఈ పండు లో, కామ వాంఛ ను అధికం చేయడానికి అవసరమయే అనేక రకాల అమీనో యాసిడ్ లు ( అంటే జీవ రసాయన పదార్ధాలు ) లభిస్తాయి !
మరి కామ వాంఛ కు అమీనో యాసిడ్ లు ఎందుకు అవసరం ?
అమీనో యాసిడ్ లు అనేక రకాల రసాయన చర్యల తరువాత , నైట్రిక్ ఆక్సైడ్ గా మారుతాయి , మన శరీరం లో ! ఈ నైట్రిక్ ఆక్సైడ్ మార్మాంగాల రక్త నాళాలను వ్యాకోచింప చేసి , తద్వారా వాటిని ఉత్తేజ పరుస్తుంది ! దానితో , మానసిక ఉత్తేజం కూడా కలిసి , కామ వాంఛ అధికం అవడమే కాకుండా , కామ క్రీడ లో ఉత్సాహం గా పాల్గొంటూ , అధికానందం కలుగుతుంది ! అత్తి పండు లో పొటాషియం , మెగ్నీషియం , ఇంకా అనేక రకాలైన యాంటీ ఆక్సిడెంట్ లు కూడా లభిస్తాయి ! అత్తి పండు లో లభించే అనేక రసాయనాలు , మన శరీరం లో , ముఖ్యం గా మన రక్తాన్ని సమతుల్యం గా ఉంచడానికి ఉపయోగ పడతాయి ! అంటే మన రక్తం లో ఆమ్ల క్షారాల నిష్పత్తి , సమ పాళ్ళ లో ఉంచుతాయి !

Chillies : మిరపకాయ / మిరప పండు : ( పైన ఉన్న చిత్రం ) : తెలుగు వారికి చిర పరిచితమైన మిరప కాయలూ , మిరప పళ్ళూ , కామ వాంఛ ను , అతి తక్కువ ధరలోనే అధికం చేయ గల అమూల్యమైన ఆహారం ! వీటిలో ఉండే , క్యాప్సియాసిన్ అనే జీవ రసాయనం , మన శరీరం లో వివిధ కీలక అవయవాలలోనూ , మర్మాంగాల లోనూ , రక్త ప్రసరణ అధికం చేయడమే కాకుండా , కామ వాంఛ కూ , రతి క్రీడ కూ ఎంతో అవసరమయే , కీలకమైన ఎండార్ఫిన్ లను విడుదల చేయడం లో ప్రముఖ పాత్ర వహిస్తాయి ! అంతే కాకుండా హృదయ స్పందనకూ , హృదయ ఆరోగ్యానికీ ఎంతగానో ఉపయోగ పడతాయి మిరప కాయలూ , మిరప పళ్ళూ ! మెక్సికో దేశం లో సగటున ప్రతి ఒక్కరూ , నెలకు ఒక కిలో కు పైగా మిరప కాయలను తింటారు ! ( వారి కామ వాంఛ ను కొలిచిన దాఖలాలు కనబడలేదు ! )
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు !