తినే ఆహారం తో, కామ వాంఛ ను అధికం చేసుకోవడం ఎట్లా ?8.

కుంకుమ పువ్వు ( saffron , శాఫ్రన్ ) : ( పైచిత్రం చూడండి ) దీనినే కీసరి అని కూడా అంటారు ! కుంకుమ పువ్వు , ఒక పుష్పం యొక్క రేకుల నుంచి తయారు చేయబడే సుగంధ ద్రవ్యం ! స్వచ్ఛ మైన ఈ సుగంధ ద్రవ్యం ఖరీదు , బంగారం ఖరీదు కన్నా ఎక్కువ ! ఈ కుంకుమ పువ్వు ను అనేక రకాల తీపి పదార్ధాలలోనూ , ఇంకా కూరలూ , బిర్యానీ లలోనూ కలుపుతూ ఉంటారు ! అనేక తినుబండారాల లో కలిసిపోయి , సుగంధం వెదజల్లే ఈ కుంకుమ పువ్వు కు , ప్రేయసీ ప్రియుల ను కూడా కలిపి , వారిలో, అనురాగాలతో పాటుగా , పరస్పర కామ వాంఛ ను కూడా అధికం చేస్తుందని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు ! అంతే కాకుండా , ఈ కుంకుమ పువ్వు , కామ క్రియా శక్తి ని కూడా ఇనుమడిస్తుంది !
ఈ కుంకుమ పువ్వు ను ఎట్లా తినాలి ? ఎంత తినాలి ? : కొద్ది పాటి కుంకుమ పువ్వు , మంచి సుగంధం వెద జల్ల గలిగే ధర్మం వల్ల , కేవలం ఒక చిటికెడు , వేడి నీళ్ళలో ఒక పావు గంట నానాక , దానిని కావలసిన వంటకాల లో కలుపుకోవచ్చు , రోజూ !

లవంగాలు : ( పైచిత్రం చూడండి ) అనేక శతాబ్దాలు గా ఈ లవంగాలు , పురుషులలో , కామ వాంఛ ను అధికం చేయడమే కాకుండా , కామ క్రియా శక్తి ని కూడా పెంపొందించే అఫ్రొ డైసియాక్ గా ప్రసిద్ధి చెందిన సుగంధ ద్రవ్యం ! అందుకే , లవంగాలు , ఇప్పటికీ ,భారత దేశం లో ,ప్రతి ఇంటిలోనూ , అనేక వంటకాలలో తరచూ వాడబడు తున్నాయి !
ప్రత్యేకించి , తోలి రేయి , ప్రేయసి అలవోకగా , తమలపాకు , వక్క పొడి , సున్నం , యాలకులు , కలిపిన , తాంబూలాన్ని , లవంగాలతో గుచ్చి ప్రియుడి కి ఇవ్వడమో , లేదా , ప్రియుడు , ప్రియురాలికి ఇవ్వడమో , ఇప్పటికీ ఒక సదాచారం ! లవంగాల తో ‘ love ‘ అంగాలు శాస్త్రీయం గా కూడా ప్రేరేపించ బడతాయి !

వెల్లుల్లి : ( పైచిత్రం చూడండి ) వెల్లుల్లి లో అలిసిన్ అనే రసాయన పదార్ధం ఉంటుంది ! ఈ పదార్ధం , స్త్రీ పురుష జననాంగాల రక్త ప్రసరణ అధికం చేస్తుంది ! తద్వారా , రతి సామర్ధ్యం అధికం అవడమే కాకుండా , అలసట కూడా తగ్గుతుంది ! ముఖ్య గమనిక : వెల్లుల్లిని సాయింత్రం భోజనం లో కానీ , రాత్రి భోజనం లో కానీ తినకూడదు , మీ భాగస్వామి మీద మీకు బాగా కోపం వస్తే తప్ప !
కోడి గుడ్డు : అనేక విటమిన్లూ , శక్తి నిచ్చే మాంస కృత్తులు , సమృద్ధి గా లభించే కోడి గుడ్డు , సంగమ సామర్ధ్యం పెంపొందించడమే కాకుండా , రతి సామర్ధ్యానికి , అనివార్య మయే అనేక హార్మోనులకు అవసరమయే , విటమిన్ B 5, విటమిన్ B 6 లు కూడా లభిస్తాయి కోడి గుడ్డు లో !
కోడి గుడ్డు ను ఎట్లా తిన వచ్చు ? : సరిగా ఉడక పెట్టిన కోడి గుడ్డు ఒకటి రోజూ తినవచ్చు ! నూనె లో వేయించి చేసిన ఆమ్లెట్ రుచి కి బాగుంటుంది, కానీ పోషక పదార్ధాలు కొన్ని తక్కువ అవుతాయి , ఆ పధ్ధతి లో ! స్వచ్ఛ మైన శాకాహారులు మిగతా పదార్ధాలను తీసుకోవచ్చు !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !