Our Health

తినే ఆహారం తో, కామ వాంఛ ను అధికం చేసుకోవడం ఎట్లా ?8.

In Our Health on జనవరి 24, 2015 at 1:15 సా.

తినే ఆహారం తో, కామ వాంఛ ను అధికం చేసుకోవడం ఎట్లా ?8. 

కుంకుమ పువ్వు  ( saffron , శాఫ్రన్ )  : ( పైచిత్రం చూడండి ) దీనినే   కీసరి అని కూడా అంటారు ! కుంకుమ పువ్వు , ఒక  పుష్పం యొక్క రేకుల నుంచి తయారు చేయబడే సుగంధ ద్రవ్యం !  స్వచ్ఛ మైన ఈ సుగంధ ద్రవ్యం ఖరీదు , బంగారం ఖరీదు కన్నా ఎక్కువ ! ఈ కుంకుమ పువ్వు ను అనేక రకాల  తీపి పదార్ధాలలోనూ , ఇంకా  కూరలూ , బిర్యానీ లలోనూ కలుపుతూ ఉంటారు ! అనేక తినుబండారాల లో కలిసిపోయి , సుగంధం వెదజల్లే  ఈ కుంకుమ పువ్వు కు , ప్రేయసీ ప్రియుల  ను కూడా కలిపి , వారిలో,  అనురాగాలతో పాటుగా , పరస్పర  కామ వాంఛ ను కూడా అధికం చేస్తుందని  శాస్త్రజ్ఞులు నిర్ధారించారు ! అంతే కాకుండా , ఈ కుంకుమ పువ్వు ,  కామ క్రియా శక్తి  ని కూడా  ఇనుమడిస్తుంది ! 
ఈ కుంకుమ పువ్వు ను ఎట్లా తినాలి ? ఎంత తినాలి ? : కొద్ది పాటి కుంకుమ పువ్వు , మంచి సుగంధం వెద జల్ల గలిగే ధర్మం వల్ల , కేవలం ఒక చిటికెడు  , వేడి నీళ్ళలో ఒక పావు గంట నానాక , దానిని కావలసిన వంటకాల లో కలుపుకోవచ్చు , రోజూ ! 
లవంగాలు : ( పైచిత్రం చూడండి )  అనేక శతాబ్దాలు గా ఈ లవంగాలు , పురుషులలో , కామ వాంఛ ను అధికం చేయడమే కాకుండా ,  కామ క్రియా శక్తి ని కూడా పెంపొందించే  అఫ్రొ డైసియాక్  గా  ప్రసిద్ధి చెందిన సుగంధ ద్రవ్యం !  అందుకే , లవంగాలు , ఇప్పటికీ ,భారత దేశం లో ,ప్రతి ఇంటిలోనూ ,  అనేక వంటకాలలో  తరచూ వాడబడు తున్నాయి ! 
ప్రత్యేకించి , తోలి రేయి , ప్రేయసి అలవోకగా , తమలపాకు , వక్క పొడి , సున్నం , యాలకులు , కలిపిన , తాంబూలాన్ని , లవంగాలతో గుచ్చి ప్రియుడి కి ఇవ్వడమో , లేదా , ప్రియుడు , ప్రియురాలికి ఇవ్వడమో , ఇప్పటికీ  ఒక సదాచారం !  లవంగాల తో  ‘   love  ‘ అంగాలు శాస్త్రీయం గా కూడా ప్రేరేపించ  బడతాయి ! 
వెల్లుల్లి : ( పైచిత్రం చూడండి ) వెల్లుల్లి లో  అలిసిన్ అనే రసాయన పదార్ధం ఉంటుంది ! ఈ పదార్ధం , స్త్రీ పురుష జననాంగాల రక్త ప్రసరణ అధికం చేస్తుంది !   తద్వారా , రతి సామర్ధ్యం అధికం అవడమే కాకుండా , అలసట కూడా తగ్గుతుంది ! ముఖ్య గమనిక : వెల్లుల్లిని సాయింత్రం భోజనం లో కానీ , రాత్రి భోజనం లో కానీ తినకూడదు , మీ భాగస్వామి మీద మీకు బాగా కోపం వస్తే తప్ప ! 
కోడి గుడ్డు : అనేక  విటమిన్లూ , శక్తి నిచ్చే మాంస కృత్తులు , సమృద్ధి గా లభించే కోడి గుడ్డు ,  సంగమ సామర్ధ్యం పెంపొందించడమే కాకుండా , రతి సామర్ధ్యానికి , అనివార్య మయే  అనేక హార్మోనులకు  అవసరమయే , విటమిన్ B 5, విటమిన్ B 6 లు కూడా లభిస్తాయి కోడి గుడ్డు లో !  
కోడి గుడ్డు ను ఎట్లా తిన వచ్చు ? : సరిగా ఉడక పెట్టిన కోడి గుడ్డు ఒకటి రోజూ తినవచ్చు !   నూనె లో వేయించి చేసిన ఆమ్లెట్ రుచి కి బాగుంటుంది, కానీ పోషక పదార్ధాలు కొన్ని తక్కువ అవుతాయి , ఆ పధ్ధతి లో ! స్వచ్ఛ మైన శాకాహారులు  మిగతా పదార్ధాలను తీసుకోవచ్చు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: