Our Health

Archive for డిసెంబర్, 2014|Monthly archive page

2014 in review

In Our Health on డిసెంబర్ 30, 2014 at 8:05 ఉద.

The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.

Here’s an excerpt:

The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 28,000 times in 2014. If it were a concert at Sydney Opera House, it would take about 10 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

తినే ఆహారం తో, కామ వాంఛ ను అధికం చేసుకోవడం ఎట్లా ?3.

In Our Health on డిసెంబర్ 26, 2014 at 3:31 సా.

తినే ఆహారం తో, కామ వాంఛ ను అధికం చేసుకోవడం ఎట్లా ?3. 

Fig : ఫిగ్ లేదా తెలుగులో దానినే అత్తి పండు లేక అంజీరము అని కూడా అంటారు ! ( పై న ఉన్న చిత్రం చూడండి ! ) ఈ పండు లో,  కామ వాంఛ ను అధికం చేయడానికి అవసరమయే అనేక రకాల అమీనో యాసిడ్ లు  ( అంటే జీవ రసాయన పదార్ధాలు ) లభిస్తాయి !
మరి కామ వాంఛ కు  అమీనో యాసిడ్ లు ఎందుకు అవసరం ?
అమీనో యాసిడ్ లు అనేక రకాల రసాయన చర్యల తరువాత , నైట్రిక్ ఆక్సైడ్ గా మారుతాయి , మన శరీరం లో ! ఈ నైట్రిక్ ఆక్సైడ్  మార్మాంగాల  రక్త  నాళాలను వ్యాకోచింప చేసి ,  తద్వారా   వాటిని ఉత్తేజ పరుస్తుంది !  దానితో , మానసిక ఉత్తేజం కూడా కలిసి , కామ వాంఛ అధికం అవడమే కాకుండా ,  కామ క్రీడ లో ఉత్సాహం గా పాల్గొంటూ , అధికానందం కలుగుతుంది !  అత్తి పండు లో పొటాషియం , మెగ్నీషియం , ఇంకా అనేక రకాలైన యాంటీ ఆక్సిడెంట్ లు కూడా లభిస్తాయి ! అత్తి పండు లో  లభించే అనేక రసాయనాలు , మన శరీరం లో , ముఖ్యం గా  మన రక్తాన్ని   సమతుల్యం గా ఉంచడానికి ఉపయోగ పడతాయి ! అంటే మన రక్తం లో ఆమ్ల క్షారాల నిష్పత్తి , సమ పాళ్ళ లో ఉంచుతాయి ! 
Chillies : మిరపకాయ / మిరప పండు : ( పైన ఉన్న చిత్రం ) :  తెలుగు వారికి చిర పరిచితమైన మిరప కాయలూ , మిరప పళ్ళూ , కామ వాంఛ ను , అతి తక్కువ ధరలోనే అధికం చేయ గల అమూల్యమైన  ఆహారం !  వీటిలో ఉండే ,  క్యాప్సియాసిన్ అనే జీవ రసాయనం , మన శరీరం లో వివిధ కీలక అవయవాలలోనూ , మర్మాంగాల లోనూ , రక్త ప్రసరణ అధికం చేయడమే కాకుండా ,  కామ వాంఛ కూ , రతి క్రీడ కూ  ఎంతో అవసరమయే , కీలకమైన ఎండార్ఫిన్ లను  విడుదల చేయడం లో ప్రముఖ పాత్ర వహిస్తాయి ! అంతే కాకుండా  హృదయ స్పందనకూ , హృదయ ఆరోగ్యానికీ  ఎంతగానో ఉపయోగ పడతాయి మిరప కాయలూ , మిరప పళ్ళూ ! మెక్సికో దేశం లో సగటున  ప్రతి ఒక్కరూ ,  నెలకు ఒక కిలో కు పైగా మిరప కాయలను తింటారు ! ( వారి కామ వాంఛ ను కొలిచిన దాఖలాలు  కనబడలేదు ! ) 
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు ! 

తినే ఆహారం తో, కామ వాంఛ ను అధికం చేసుకోవడం ఎట్లా ?2.

In Our Health on డిసెంబర్ 20, 2014 at 11:08 ఉద.

తినే ఆహారం తో, కామ వాంఛ ను అధికం చేసుకోవడం ఎట్లా ?2.. 

3. అరటి పండు (  పై చిత్రం గమనించండి ): 
అనేక శతాబ్దాలు గా మన భారత దేశం లో జరిగే ఈ కార్యక్రమం లోనైనా , అరటి పండు ప్రధాన ఫలం గా కనబడడమే కాక ,  సంతాన సాఫల్యానికి అంటే ఫర్టిలి టీ  కి  ఒక సంకేతం గా ఉంది !
అరటి పండు లో బ్రోమలైన్ అనే ఎంజైమ్ లభిస్తుంది !  ఈ బ్రోమలైన్ అనే ఎంజైమ్ , కామ వాంఛ ను అధికం చేయడమే కాకుండా ,  వంధ్యత్వాన్ని కూడా నివారిస్తుంది ! బ్రోమలైన్ అనే ఎంజైమ్, ఇంకా , శరీర సహజ రోగ నిరోధక శక్తి ఎక్కువ గా ఉండడానికి కూడా సహకరిస్తుంది !  అంతే కాకుండా , ఈ బ్రోమలైన్ , ఆర్త్రైటిస్ అంటే కీళ్ళ నొప్పులు కూడా నివారిస్తుంది .  అరటి పండు లో లభ్యమయే , విటమిన్లు ( రైబో ఫ్లేవిన్ ) , ఖనిజాలు ( పొటాషియం ) అనేక జీవరసాయన చర్యలలో  ప్రముఖ పాత్ర  ప్రముఖ పాత్ర వహిస్తూ , నిరంతరం , శరీరాన్ని , ఆరోగ్యం గా ఉంచడమే కాకుండా , శరీరాన్ని శక్తివంతం గా ఉంచుతాయి !  అరటి పండు లో , కనీసం పది విటమిన్ లూ , పది ఖనిజాలూ , లభ్యం అవుతాయి , పిండిపదార్ధమూ , గ్లూకోజు తో సహా ! 
అరటి పండు ను ఎట్లా తినాలి ?:  కామ వాంఛ అధికం అవ్వాలనుకునే ప్రేయసీ ప్రియులు , అరటి పండును ముక్కలు గా కోసి  ఒకరి నగ్న శరీరం మీద ఉన్నవి ఇంకొకరు తింటే , బాగా ప్రయోజనం ఉంటుందని , కొన్ని అంతర్జాల సైట్ లలో సలహా ఇవ్వడం జరిగింది !  మరి ఎట్లా తినడం అనేది , ఎవరి ఇష్టం వారిది ! 
4. ఆస్పరాగస్ (  పై చిత్రం గమనించండి ):ఆస్పరాగస్  ఒక మొక్క లేత కాడ ! ఈ కాడ లో మన శరీరానికి అవసరమయే ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ పుష్కలం గా లభిస్తుంది !  
మరి ఫోలిక్ యాసిడ్ కూ ,  వాంఛ కూ సంబంధం ఏమిటి ? 
కామ వాంఛ అధికం కావడానికి అవసరమయే హిస్టమిన్ అనే జీవ రసాయనం తయారు కావడానికి , ఫోలిక్ యాసిడ్ అవసరం ఉంటుంది ! అంటే ఫోలిక్ యాసిడ్ తక్కువ గా  శరీరం లో ఉంటే ,  హిస్టమిన్ కూడా తక్కువ గా ఉత్పత్తి అయి , తద్వారా , కామ వాంఛ కూడా అంతంత మాత్రం గానే ఉంటుంది ! పురుషుల్లోనూ , స్త్రీలలోనూ కూడా ! 
ఆస్పరాగస్ ను ఎట్లా తినాలి ? : ఆస్పరాగస్ కాడలను లేతవి గా ఉన్నవి కొని , శుభ్రం గా , స్వచ్చమైన ( గోరువెచ్చటి ) నీటిలో కడిగాక ,  కొద్దిపాటి నీటిలో ( ఎక్కువ నీళ్ళ లో అయితే విటమిన్లు , మిగతా పోషక పదార్ధాలు అన్నీ ఆ నీటిలో కలిసి పోయి వృధా అవుతాయి )   , తగినంత సేపు ఉడికించి , సలాడ్ లలో కలుపు కోవడ మో , లేదా మిగతా కూరల్లో కలుపుకోవడమో చేసి , తినవచ్చు ! విదేశాలలో , ఈ ఆస్పరాగస్ విరివి గా లభ్యం అవుతుంది ! 
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు ! 

తినే ఆహారం తో, కామ వాంఛ ను అధికం చేసుకోవడం ఎట్లా ?1.

In Our Health on డిసెంబర్ 15, 2014 at 6:39 సా.
తినే ఆహారం తో, కామ వాంఛ ను అధికం చేసుకోవడం ఎట్లా ?1. 
మునుపటి టపాలలో , మనకు నిత్యం అవసరమయే అనేక రకాల విటమిన్లు , ఏ ఏ  సహజ మైన ఆహార పదార్ధాలలో లభిస్తాయో , ఆ యా విటమిన్లూ , ఖనిజాలూ , మన శరీరం లో లోపిస్తే , లేదా, ఉండ వలసిన దానికన్నా తక్కువ గా ఉంటే , కలిగే అనారోగ్యాల గురించి కూడా , వివరం గా తెలుసుకోవడం జరిగింది కదా ! 
ఇప్పుడు , కామ వాంఛ ను అధికం చేసే ,ఆ కొన్ని  సహజ ఆహార పదార్ధాల గురించి తెలుసుకుందాం ! 
ఈ సంగతి తెలుసుకోవడం ఎందుకు ? :  కామ కోరికలు, ప్రకృతి లో ,  అత్యంత సహజమైన కోరికలు !  నవీన మానవులు, అనేక మంది ,  అనేక కారణాల వల్ల , రతి లో సుఖం అనుభవించ లేక పోవడమే కాకుండా , అశాస్త్రీయ పద్ధతుల ద్వారా , ఆ కామ కోరికలను ఎక్కువ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ! బజారు లో దొరికే , అనేక రకాల మందులు కొంటూ , ఫలితాలు లేక పోగా , తమ ధనం కూడా వృధా చేసుకుంటున్నారు ! సహజం గా లభించే ఆహార పదార్ధాలను తీసుకుంటే , ఎక్కువ ఫలితాలు ఉండడమే కాకుండా , అవి తినే వారి ఆరోగ్యం కూడా అనేక రకాలు గా వృద్ధి చెందుతుంది ! అంటే , శారీరిక , మానసిక , కామ ఆరోగ్యాలు అన్నీ కూడా !   

1.కర్బూజా పండు: 

సహజ వయాగ్రా గా పేరు గాంచిన కర్బూజా పండు ( పై చిత్రం చూడండి )  లో  సిట్రుల్లిన్ అనే రసాయన పదార్ధం ఉంటుంది. ఈ సిట్రుల్లిన్  , శరీరం లోని రక్త నాళాలను వ్యాకోచింప చేసి , తద్వారా కామోద్దీపన ఎక్కువ చేస్తుంది ! అంటే , మిగతా భాగాల తో పాటుగా , మెదడూ , మర్మాంగాలలో  కూడా రక్త ప్రసరణ ఎక్కువ అయి ( ఆయా భాగాలలో ఉన్న రక్త నాళాలు వ్యాకోచించడం ద్వారా )  కూడా ! ఈ సిట్రుల్లిన్ ను  వ్యాపార పరం గా , వివిధ హెల్త్ ఫుడ్స్ లోనూ టానిక్ లలోనూ కలుపుదామని , వ్యాపారులు, శాస్త్ర వేత్తలూ , అనేక ప్రయత్నాలు చేసి విఫలం చెంది ,  కర్బూజా పండు ను సహజం గానే తింటే , ఈ సిట్రుల్లిన్ , అత్యధికం గా  శరీరానికి లభించి , తగిన ఫలితాలను ఇస్తుందని తేల్చారు ! 
కర్బూజా పండు ను ఎట్లా తినాలి ? :  పుడ్డింగ్ లో కానీ , కేకు లలో కానీ , తినేకన్నా , కర్బూజా పండు ను సహజం గానే ముక్కలు గా కోసి తినడం ఉత్తమం !  దాని ఔషధ గుణాలు కావాలనుకుంటే ! పైన చెప్పిన కారణాల వల్ల ! 

2. సెలరీ : సెలరీ  ఆకుపచ్చని కాడల లా కనిపిస్తుంది ! ( పైన ఉన్న చిత్రం చూడండి ) ! మన దేశం లో కూడా దొరుకుతుంది , కూరగాయల మార్కెట్ల లో ! విదేశాలలో , అన్ని సూపర్ మార్కెట్ లలోనూ కనిపిస్తుంది !  సెలరీ లో యాన్ డ్రో స్టిరోన్ అనే హార్మోను ఉంటుంది ! ఈ హార్మోను  ఫిరమోను లా పనిచేస్తుంది ! ఫిరమోను లు , స్త్రీలలోనూ , పురుషుల్లోనూ ఉంటాయి ! ప్రత్యేకించి , స్త్రీలోనూ , పురుషుల్లోనూ , వారి , వారి స్వేదం , అంటే, చెమట ద్వారా బయటకు వస్తాయి , శరీరం నుంచి  !  తద్వారా ,  ప్రతి స్త్రీకీ , పురుషుడి కీ ఒక ప్రత్యేక మైన వాసన కలిగిస్తాయి !  పరస్పర ఆకర్షణ కు కారణమవుతాయి ! ఫిరమొనులు  స్త్రీలలో నూ , పురుషుల్లోనూ ,  మెదడు మీద తమ ప్రభావం చూపి , వారిని కామ కేళి కు ప్రేరేపిస్తాయి ! అంటే , సెలరీ లో ఉండే యాన్ డ్రో స్టిరోన్  అనే హార్మోను , కామకేళి మొదలు పెట్టమని సంకేతాలిచ్చే సిగ్నల్ ! 
మరి సెలరీ ని ఎట్లా తినాలి ? : సెలరీ ని  పచ్చిగానే సలాడ్ లలో వేసుకుని తినాలి !   
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

అనుమానం, పెనుభూతం ! 4. మరి చికిత్స మాటేంటి ?

In Our Health on డిసెంబర్ 6, 2014 at 9:53 సా.

అనుమానం, పెనుభూతం ! 4. మరి చికిత్స మాటేంటి ?

క్రితం టపాలలో , అనుమానం , పెనుభూతం గా మారితే, మనుషులలో కనబడే మార్పుల గురించి తెలుసుకున్నాం కదా ! మరి చికిత్స మాటేంటి ?
మానసిక సమస్యలకు , సామాన్యం గా  రెండు రకాల చికిత్సా పద్ధతులుంటాయి !  కనబడే ఆ మానసిక రుగ్మత  పూర్వా పరాలు  కనుక్కొని , వాటికి  కారణాలు వెదకడం లో మానసిక వైద్యుల పాత్ర ఎంతగానో ఉంటుంది !  మానసిక రుగ్మతలు ఉన్న వ్యక్తి , బాగా తెలివి గల వారైతే ,  కేవలం వారి ఆలోచనలనూ , అనుభవాలనూ విశ్లేషించి , వాటి పరిష్కార మార్గాలను చెప్పి , ఆ రకమైన ఆలోచనా ధోరణులను  సమూలం గా మార్చ గలిగే సామర్ధ్యం మానసిక వైద్యులకు ఉంటుంది ! 
చాలా సందర్భాలలో , ఇట్లా మార్చగలిగే అవకాశం , కొన్ని మందులు కూడా కలిపితే హెచ్చుతుందీ , త్వరగా చికిత్సా ఫలితాలు కనబడతాయీ కూడా ! 
మొండికి బడ్డ , తీవ్రమైన అనుమానాలు , అంటే పెనుభూతాల తో సతమత మవుతున్న వారితో ఎట్లా ప్రవర్తించాలి ? 
ఇది కష్టమైన పనే , ప్రత్యేకించి , మానసిక రోగాల మీద ఏ రకమైన జ్ఞానమూ లేని వారికి  !  తీవ్రమైన ‘ అనుమానాలతో ‘ అంటే పారనోయియా తో బాధ పడుతూ ఉండే వారు కొందరు , చీటికీ మాటికీ , విసుగు ప్రదర్శిస్తూ ఉంటారు !  సద్విమర్శలు ఎవరైనా బాగు కోరేవారు చేసినా  కూడా , తీవ్రం గా రియాక్ట్ అవుతారు ! మనసులో మాట , ధైర్యం గానూ , స్వేచ్చ గానూ , బయటకు చెప్పుకోవడానికి  జంకుతూ , చాలా  రహస్యం గా ఉంటారు ! చాలా త్వరగా  కోపోద్రేకులవుతూ ఉంటారు ! ఇట్లాంటి లక్షణాలు ప్రదర్శించే వారితో , జాగ్రత్త గా వ్యవహరించాలి ! అంతే కాకుండా , వారికి చికిత్స చేయడం కూడా ఎంతో శ్రమ తో కూడుకున్నదే కాక , సమయం కూడా పడుతుంది ! 
యాంగ్జైటీ ను తగ్గించే పద్ధతులూ , రిలాక్స్ అయ్యే పద్ధతులూ కూడా , వీరికి ఎంతగానో ఉపయోగ పడతాయి ! ఈ లక్షణాలున్న వారిని , ముందుగా , మానసిక వైద్యుల దగ్గరకు తీసుకు వెళ్లి , పరీక్ష చేయించడం ఉత్తమం !  వీరికి వీరి తల్లి దండ్రులూ , బంధువులూ , స్నేహితులూ ఇచ్చే సహకారం కూడా ఎంతో ఉపయోగ పడుతుంది ! అంతే కాకుండా , వారి చికిత్స లో ప్రముఖ పాత్ర వహిస్తారు , వీరందరూ ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
%d bloggers like this: