తినే ఆహారం తో, కామ వాంఛ ను అధికం చేసుకోవడం ఎట్లా ?1.

మునుపటి టపాలలో , మనకు నిత్యం అవసరమయే అనేక రకాల విటమిన్లు , ఏ ఏ సహజ మైన ఆహార పదార్ధాలలో లభిస్తాయో , ఆ యా విటమిన్లూ , ఖనిజాలూ , మన శరీరం లో లోపిస్తే , లేదా, ఉండ వలసిన దానికన్నా తక్కువ గా ఉంటే , కలిగే అనారోగ్యాల గురించి కూడా , వివరం గా తెలుసుకోవడం జరిగింది కదా !
ఇప్పుడు , కామ వాంఛ ను అధికం చేసే ,ఆ కొన్ని సహజ ఆహార పదార్ధాల గురించి తెలుసుకుందాం !
ఈ సంగతి తెలుసుకోవడం ఎందుకు ? : కామ కోరికలు, ప్రకృతి లో , అత్యంత సహజమైన కోరికలు ! నవీన మానవులు, అనేక మంది , అనేక కారణాల వల్ల , రతి లో సుఖం అనుభవించ లేక పోవడమే కాకుండా , అశాస్త్రీయ పద్ధతుల ద్వారా , ఆ కామ కోరికలను ఎక్కువ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ! బజారు లో దొరికే , అనేక రకాల మందులు కొంటూ , ఫలితాలు లేక పోగా , తమ ధనం కూడా వృధా చేసుకుంటున్నారు ! సహజం గా లభించే ఆహార పదార్ధాలను తీసుకుంటే , ఎక్కువ ఫలితాలు ఉండడమే కాకుండా , అవి తినే వారి ఆరోగ్యం కూడా అనేక రకాలు గా వృద్ధి చెందుతుంది ! అంటే , శారీరిక , మానసిక , కామ ఆరోగ్యాలు అన్నీ కూడా !
1.కర్బూజా పండు:
సహజ వయాగ్రా గా పేరు గాంచిన కర్బూజా పండు ( పై చిత్రం చూడండి ) లో సిట్రుల్లిన్ అనే రసాయన పదార్ధం ఉంటుంది. ఈ సిట్రుల్లిన్ , శరీరం లోని రక్త నాళాలను వ్యాకోచింప చేసి , తద్వారా కామోద్దీపన ఎక్కువ చేస్తుంది ! అంటే , మిగతా భాగాల తో పాటుగా , మెదడూ , మర్మాంగాలలో కూడా రక్త ప్రసరణ ఎక్కువ అయి ( ఆయా భాగాలలో ఉన్న రక్త నాళాలు వ్యాకోచించడం ద్వారా ) కూడా ! ఈ సిట్రుల్లిన్ ను వ్యాపార పరం గా , వివిధ హెల్త్ ఫుడ్స్ లోనూ టానిక్ లలోనూ కలుపుదామని , వ్యాపారులు, శాస్త్ర వేత్తలూ , అనేక ప్రయత్నాలు చేసి విఫలం చెంది , కర్బూజా పండు ను సహజం గానే తింటే , ఈ సిట్రుల్లిన్ , అత్యధికం గా శరీరానికి లభించి , తగిన ఫలితాలను ఇస్తుందని తేల్చారు !
కర్బూజా పండు ను ఎట్లా తినాలి ? : పుడ్డింగ్ లో కానీ , కేకు లలో కానీ , తినేకన్నా , కర్బూజా పండు ను సహజం గానే ముక్కలు గా కోసి తినడం ఉత్తమం ! దాని ఔషధ గుణాలు కావాలనుకుంటే ! పైన చెప్పిన కారణాల వల్ల !
2. సెలరీ : సెలరీ ఆకుపచ్చని కాడల లా కనిపిస్తుంది ! ( పైన ఉన్న చిత్రం చూడండి ) ! మన దేశం లో కూడా దొరుకుతుంది , కూరగాయల మార్కెట్ల లో ! విదేశాలలో , అన్ని సూపర్ మార్కెట్ లలోనూ కనిపిస్తుంది ! సెలరీ లో యాన్ డ్రో స్టిరోన్ అనే హార్మోను ఉంటుంది ! ఈ హార్మోను ఫిరమోను లా పనిచేస్తుంది ! ఫిరమోను లు , స్త్రీలలోనూ , పురుషుల్లోనూ ఉంటాయి ! ప్రత్యేకించి , స్త్రీలోనూ , పురుషుల్లోనూ , వారి , వారి స్వేదం , అంటే, చెమట ద్వారా బయటకు వస్తాయి , శరీరం నుంచి ! తద్వారా , ప్రతి స్త్రీకీ , పురుషుడి కీ ఒక ప్రత్యేక మైన వాసన కలిగిస్తాయి ! పరస్పర ఆకర్షణ కు కారణమవుతాయి ! ఫిరమొనులు స్త్రీలలో నూ , పురుషుల్లోనూ , మెదడు మీద తమ ప్రభావం చూపి , వారిని కామ కేళి కు ప్రేరేపిస్తాయి ! అంటే , సెలరీ లో ఉండే యాన్ డ్రో స్టిరోన్ అనే హార్మోను , కామకేళి మొదలు పెట్టమని సంకేతాలిచ్చే సిగ్నల్ !
మరి సెలరీ ని ఎట్లా తినాలి ? : సెలరీ ని పచ్చిగానే సలాడ్ లలో వేసుకుని తినాలి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !