క్రితం టపాలో ఆల్కహాల్ పాయిజనింగ్ అంటే ఏమిటో తెలుసుకున్నాం కదా !ఇప్పుడు ఆల్కహాల్ ఒకే సారి అతిగా తాగిన వారిలో కనిపించే లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం !
ఈ విషయాలు తెలుసుకోవడం మీకు మద్యం తాగే అలవాటు లేక పోయినా కూడా , మీరు తెలుసుకుంటే , మీ స్నేహితులను కానీ , లేదా అతిగా తాగిన అపరిచిత వ్యక్తులు కానీ , మీకు తారస పడితే , మీరు వారి ప్రాణాలను క్షించ గలుగుతారు !
క్రితం టపాలో చెప్పుకున్నట్టు , ఆల్కహాల్ తాగిన వారికి , ఆ తాగిన ఆల్కహాల్ ప్రమాద కరం గా మారడం అనేక విషయాల మీద ఆధార పడి ఉంటుంది ! ఇక లక్షణాల గురించి చెప్పుకుంటే , మీకు ఆ అతిగా తాగిన వ్యక్తి ,
1. వికారం గా కడుపు లో తిప్పిన వారి లాగా ప్రవర్తించడం , లేదా వాంతులు చేసుకోవడం ,
2. మతి స్థిమితం కోల్పోయినట్టు అంటే కంఫ్యూస్ అయినట్టు ఉండడం ,3. కళ్ళు తిరిగి పడి పోబోతున్నట్టు ఉండడం కానీ,
4. లేదా పడి పోవడం గానీ జరగొచ్చు !
5. అంతే కాకుండా వారికి మూత్ర విసర్జన మీద కంట్రోలు తప్పి వారు వేసుకున్న ప్యాంట్ లో కానీ ధోవతి లో గానీ , లేదా జీన్ ప్యాంట్ లో కానీ మూత్ర విసర్జన చేసుకుని , ఆ తడి ప్రాంతాలు బయటి వారికి స్పష్టం గా కనబడడం కానీ జరగ వచ్చు !
6. ఇంకో ప్రమాద సంకేతం ఏమిటంటే వారి శ్వాస తీసుకోవడం కష్టం అవడం ! ఈ లక్షణం కనబడడానికి కారణం : అతిగా తాగితే , మన దేహం లో ప్రవేశించిన మద్యం శాతం ఎక్కువ అయి , అన్నవాహిక కూ , శ్వాసనాళానికీ మధ్య కవాటం గా పని చేసే నాలుక వెనుక భాగం బలహీనం అవుతుంది . అప్పుడు నోటిలో ఉండే ( వాంతి మిగతా ద్రవాలు ) నేరుగా శ్వాసనాళం ద్వారా ఊపిరి తిత్తులలో ప్రవేశిస్తాయి ! ఆ పరిస్థితి ని గొంతుకు ఏదైనా పదార్ధం అడ్డం పడడం తో పోల్చుకోవచ్చు !ఇక వీరి రక్త పరీక్ష చేసి చూస్తే , మద్యం శాతం ఎక్కువ గా ఉండడం తో పాటుగా , వారి రక్తం లో చక్కర శాతం చాలా తక్కువ గా అయి , ఆ పరిస్థితి మెదడు లోని నాడీ కణాలు నశించే ప్రమాదం ఉంటుంది !
వచ్చే టపాలో మరి సహాయం చేసే వారి కర్తవ్యం ఏమిటో కూడా తెలుసుకుందాం ! అంటే ప్రధమ చికిత్స !
ఈ విషయం మీద మీకు వచ్చే క్లిష్టమైన సందేహాలూ , ప్రశ్నలూ తెలియచేయండి !