సీక్రెట్ కెమెరా లను కనుక్కోవడం ఎట్లా ?!
స్మోక్ డిటెక్టర్లు , పూల కుండీలు , పుస్తకాలూ, DVD కేస్ లూ , ఎలెక్ట్రిక్ ఔట్లెట్ లూ , టెడ్డీ బేర్స్ , మనం ముఖం చూసుకునే నిలువెత్తు అద్దాలూ , ఇట్లా అనేక రకాలైన వస్తువులలో, మోసగాళ్లు రహస్యం గా కెమెరాలు అమర్చ డం జరుగుతుంది !


ఒక స్క్రూ లో నూ , ఎయిర్ ఫ్రెషెనర్ లోనూ అమర్చిన రహస్య కెమెరా లను చూడవచ్చు పై చిత్రాలలో !
ఈమధ్యే , ఒక అమెరికన్ యువతి , ఒక పెద్ద హోటల్ గ్రూప్ మీద ఆరువందల కోట్లకు దావా వేసింది ! ఆమె ఒక స్టార్ హోటల్ లో నగ్నం గా ఉన్న వీడియో లను సీక్రెట్ గా చిత్రీకరించినందుకు !
ఈ రోజుల్లో , యువతులనూ , బాలికలనూ , సీక్రెట్ కెమెరాలు అమర్చి , వారి కదలికలనూ, బట్టలు వేసుకుంటున్న సమయం లోనూ , ఆడియో కానీ , వీడియో కానీ రహస్యం గా రికార్డు చేయడం,తరచు గా వింటూ ఉన్నాం ! బాలికలూ , యువతులూ నివశించే వసతి గృహాల్లో కూడా ఇట్లాటి నేరాలు జరుగుతున్నాయి !
ముఖ్యం గా తలిదండ్రులు , ఈ విషయాలు తెలుసుకొని, తగు జాగ్రత్తలు తీసుకోవడం, వారి పిల్లలను హెచ్చరించడం ఉత్తమం !
ఈ రహస్య ( సీక్రెట్ ) కెమెరాలను కనుక్కొని , వాటి నుంచి తప్పించుకోవాలంటే ఈ క్రింది పద్ధతులు ఉపయోగ పడతాయి !
1. మీరు ప్రవేశించిన గది ని , ఒకసారి నిశితం గా పరిశీలించండి ! మీరు ఒక్కరే , గది లో ఉంటే , ఆ గది లో లైట్లు ఆఫ్ చేయండి. గదిలో ఉన్న కర్టెన్లు కానీ , కిటికీలు కానీ మూసి వేయండి ( వెలుగు రాకుండా ).
అప్పుడు , గదిలో అన్ని కోణాల్లో పరిశీలించండి , ఎరుపు లైటు కానీ ఆకు పచ్చ లైటు కానీ , ఎక్కడ నుంచైనా మినుకు మినుకు మంటుందేమోఅని.
2. మీ తో ఉన్న మీ మొబైల్ ఫోన్ , అత్యంత విలువైనది , ఈ సీక్రెట్ కెమెరా లు కనుక్కోడానికి !
మీ మొబైల్ ఫోన్ , లేదా సెల్ ఫోన్ ను రెండు రకాలు గా ఉపయోగించ వచ్చు !
A . మీరు ప్రవేశించిన గది లో మూల మూలలా తిరుగుతూ , మీ స్నేహితులకు కానీ , కుటుంబ సభ్యుల కు కానీ ఫోన్ చేయండి ! అప్పుడు , మీరు ఉన్న గది లో కానక సీక్రెట్ కెమెరా ఉంటే , మీ ఫోన్ లో సిగ్నల్ సరిగా అందదు ( సీక్రెట్ కెమెరా ఉంటే , దానితోనూ , మీ సెల్ ఫోన్ తోనూ కలిగే signal interference వల్ల )!
B. మీదగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ కానీ ఐఫోన్ కానీ ఉంటే , సీక్రెట్ కెమెరా లను డెటెక్ట్ చేసే యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి . కనీసం ఒక వంద వరకూ ఇట్లాటి యాప్ లు ఉన్నాయి ! వాటిలో ఎక్కువ రేటింగ్ ఉన్న యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని , మీరు ప్రవేశించిన గది లో ఆన్ చేస్తే , అక్కడ సీక్రెట్ గా ఏర్పాటు చేసిన కెమెరా లను కనుక్కోవడం సులభం ! మీ ఫోన్ లో రెడ్ లైట్ ( ఎర్ర లైట్ ) ఫ్లాష్ అవుతుంది , కెమెరా ను కనుక్కున్నాక !
3. professional hidden camera detector: అధికారికం గా ఆమోదించ బడిన సీక్రెట్ కెమెరా డిటెక్టర్ లు మార్కెట్ లో అమ్ముతున్నారు . ఈ పరికరాన్ని కొని , మీరు ప్రవేశించిన గది లో ఆన్ చేస్తే , సీక్రెట్ కెమెరా లను వెంటనే పసి గడుతుంది !
4. మీరు ఉంటున్న గది లో మిర్రర్స్ అంటే అద్దాలు కనుక ఏర్పాటు చేసి ఉంటే , ఆ అద్దాలు , బయటకు నార్మల్ గా మనం ముఖం చూసుకునే అద్దాల లానే కనబడతాయి కానీ , వాటి వెనుక కూడా సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి ఉండ వచ్చు !
మరి మీరు చూస్తున్న అద్దం అసలైనదో , లేదా సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేసిన అద్దమో ఈవిధం గా తెలుసుకోవచ్చు :
ఆ అద్దం మీద మీ వేలు గోరు తో ( 90 డిగ్రీలలో ) టచ్ చేస్తే , మీ గోరు కూ, అద్దానికి మధ్య gap కనుక ఉంటే , అది అసలైన అద్దం !
మీ వేటి గోరు కనుక , అట్లా కాకుండా , వేటి గోరు ప్రతిబింబాన్ని, డైరెక్ట్ గా , gap లేకుండా టచ్ చేస్తూ ఉంటే , ఆ అద్దం అసలైనది కాదని గ్రహించాలి !
5. మీదగ్గర టార్చ్ లైట్ ఉంటే , దాన్ని ఆన్ చేసి , మీరు ప్రవేశించిన గది లో అన్ని వైపులా ఫ్లాష్ చేస్తే , మినుకు మినుకు మంటున్న సీక్రెట్ కెమెరాల లైట్లు కనిపిస్తాయి !
మీ మొబైల్ (సెల్ ) ఫోన్ లో ఉన్న ఫ్లాష్ లైట్ తో కూడా ఇదే విధం గా , సీక్రెట్ కెమెరా లను కనుక్కోవచ్చు !
గమనిక : అత్యంత శక్తి వంతమైన , అత్యంత విలువైన సీక్రెట్ కెమెరాలు , ఒక ప్రత్యేకమైన సిగ్నల్స్ ను పంపిస్తాయి , వాటిని కనుక్కోవడం చాలా కష్టం ! కానీ , సామాన్యం గా , సీక్రెట్ కెమెరాలను అమర్చే మోసగాళ్లంతా , చవక రకం కెమెరాలు ఏర్పాటు చేస్తారు ! అందువల్ల , పైన చెప్పిన పద్ధతుల్లో వాటిని కనుక్కోవడం సాధ్యమే !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !