నీటి గండం నిజమేనా? 1.
మనం దాదాపు ప్రతి రోజూ , లేక కనీసం ప్రతి వారం , చూస్తూ ఉంటాం , లేదా చదువుతూ ఉంటాం , ఈ వార్తలు:
” క్వారీ లో పడి నలుగురి పిల్లల దుర్మరణం “
“ఈతకు వెళ్లిన ముగ్గురి స్నేహితుల మరణం “
” విహార యాత్ర లో విషాదం , చెరువులో దిగిన విద్యార్థుల మరణం “
” నది లో దిగిన ఆరుగురు గల్లంతు ” !
ఇంకా అనేక రకాలు గా , విషాద కర వార్తలు తరచూ మనకు తెలుస్తూ ఉంటాయి !
ఇక ఆ వార్తల విశ్లేషణ కూడా అనేక రకాలుగా చేస్తూ ఉంటాం మనం !
ఆ వార్తలు తెలుసుకుని బాధ పడినా కూడా ,
” వారికి ఆ రకం గా నీటి గండం ఉంది ” అనుకునో , లేదా ” వారికి ఈ భూమి మీద నూకలు చెల్లాయి ” అనో అనుకోవడం చేస్తూ ఉంటాం కూడా !
ఇక నవమాసాలూ మోసి కన్న తల్లి కీ , తల్లి తో పాటుగా, వారిని అల్లారు ముద్దుగా పెంచి , ప్రేమ తో చూసుకునే తండ్రి బాధ వర్ణనాతీతం !
మరి నీటి గండం నిజమేనా ?
ఎంత మాత్రమూ నిజం కాదు !
అది పచ్చి అబద్ధం !
‘వారికి నీటి గండం ఉంది , అట్లా ప్రాణాలు పోయాయి ‘ అని అనుకోవడం , కేవలం బ్రతికి ఉన్న ఆ మృతుల బంధువుల ఆత్మ తృప్తి తో , ముందుకు పోవడానికి మాత్రమే ఉపయోగ పడుతుంది ! కానీ యదార్ధం అది కాదు !
మరి నీటి వల్ల కలిగే ప్రమాదాలేంటో తెలుసుకుందాం మనం !
మిగతా విషయాలు వచ్చే టపాలో !