ఫెటిషిజం లక్షణాలు !3.
మునుపటి టపాలో చెప్పుకున్నట్టు , ఫెటిషిజం అంటే , నిర్జీవ వస్తువులను చూసి లేదా ,
జనాంగాలు కాని ఇతర భాగాలను చూసి కానీ , కామాతృత చెందడమూ , లేదా కామానుభూతులు ఎక్కువ కావడమూ !
అనేక భారత భాషల సినిమాలలో స్త్రీ నాభి స్థానాన్ని చూపడమూ , లేదా , కాలి వేళ్ళను , కామ పరం గా చూపుతూ ఉంటారు , అది ఈ కోవ కు చెందినదే !
సాధారణం గా మనం , ఈ చిత్రాలు చూసినా , సినిమా బయటకు రాగానే , ఆ యా సందర్భాలు , మన మెదడు లో నిక్షిప్తమై ఉండవు ! కానీ ఫెటిషిజం అనే మానసిక రుగ్మత ఉన్న వారు, ఆ సీనులు పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ , కామానుభూతి చెందుతూ ఉంటారు !
అంతే కాకుండా , ఈ రకమైన అనుభూతులు , కనీసం ఆరు నెలలకు మించి కలుగుతూ ఉంటే , అపుడు ‘ వ్యవహారం ‘ తీవ్రమైందని అనుకోవాలి !
అంతే కాక , వీరు , ఈ మానసిక రుగ్మత వల్ల , తీవ్రమైన ఆందోళన కు గురవుతూ ఉంటారు ! వారు విద్యార్థులయితే , చదువు లో ఏకాగ్రత తప్పి , చదువు కుంటు పడుతుంది ! లేదా ఉద్యోగస్తులవుతే , ఉద్యోగం అవకతవకలు గా చేస్తూ , పై అధికారి నుంచి దండన ‘ స్వీకరిస్తారు ‘ !
ఇంకా సమస్య తీవ్రం గా ఉన్న వారు , చెప్పుల షాపు లో లేదా , బ్రాల షాపు లోనో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారు లేదా , వాటిలో ఉద్యోగం చేస్తూ , ‘ స్వాంతన ‘ చెందుతూ ఉంటారు !

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !