Our Health

Archive for ఆగస్ట్ 13th, 2016|Daily archive page

ఫెటిషిజం .1.

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఆగస్ట్ 13, 2016 at 1:26 సా.

ఫెటిషిజం .1.

ఉదయం  లేవగానే , స్నానం చేసి , ఉతికి ,ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకుని , తాజాగా తయారయ్యాడు , ఆకాష్ !  వేడి ఇడ్లీలూ , సెగలొస్తున్న సాంబారూ తిని, హెల్మెట్ పెట్టుకుని , కాలేజీకి బయలు దేరాడు , తన ‘ పంచ కల్యాణి ‘ బైక్ మీద, ఒక యోధుడి లాగా  !
 బైక్ తో పాటుగా , తన మనసు కూడా ఉరకలు వేస్తూ ఉంది !  యవ్వనం లో తనలో వచ్చే మార్పులతో , తనకు తెలిసిన అమ్మాయిల్లో మార్పులు కూడా నిశితం గా పరిశీలిస్తున్నాడు ! వారితో మాట్లాడుతున్నా , వారి పొందులో , సరదా గా కాలం గడిపినా , ఎంతో ఆనందం గా ఉంటున్నాడు ! తనలో ఆత్మ విశ్వాసం కూడా ఎక్కువ గా శ్వాస తీసుకుంటుంది ! కానీ అప్పుడే ఎక్కువ  చనువు తీసుకో లేక పోతున్నాడు , ఏ ఒక్క అమ్మాయి తోనూ !
అది ఓ  వేసవి మధ్యాహ్నం, నాలుగు గంటలయి ఉంటుంది. కాలేజీ అయ్యాక , ఇంటికి వచ్చే దారి లో  ఒక దుకాణం ముందు ఆగాడు , దాహం గా  ఉంటే , కూల్ డ్రింక్ కోసం. డ్రింక్ సిప్ చేస్తూ ,యదాలాపం గా  కొన్ని గజాల దూరం లో , రోడ్డు కు ఆవల కనిపిస్తున్న  ఒక మేడ వైపు చూశాడు ! పిట్ట గోడ మీద రెండు వైపులా చక్కటి పూల కుండీలు , ఆ మధ్య ,  ఆరేసిన బట్టలు కనిపిస్తున్నాయి !  నారింజ రంగులో ఉన్న కమీజ్ , చిలక పచ్చ రంగులో సల్వార్ , ఆ పక్కనే ఒక ముదురు నీలం రంగు పరికిణీ , ఆకు పచ్చని ఓణీ , ఆ పక్క గా , రెండు తెల్లటి బ్రాలు ! అన్నీ , వీస్తున్న గాలికి , రెప రెప లాడుతున్నాయి , వెనకా ముందుకు ఊగుతున్నాయి ! అప్పటి దాకా ఓ చూపు చూసిన ఆకాష్ కళ్ళు , తెల్లటి బ్రాలు  కనిపించగానే , ఒక్క సారిగా తీక్షణం అయ్యాయి ! అదే పనిగా పరిశీలించ సాగాయి ! ఆ బ్రాలు పెద్దవి గా కనబడుతున్నాయి , తన కళ్ళు బైనాక్యులర్స్ కానప్పటికీ ! ” ఆ గాలి కాస్త ఎక్కువ అవకూడదూ ?! కనీసం ఒక్క బ్రా , ఎగిరి , ఆకాశం లో తేలి పోతూ , ఈ ఆకాష్ మీద పడ కూడదూ ?! “  అనుకుంటూ , అప్రయత్నం గా తన తలను కూడా ముందుకు ఊపుతున్న ఆకాష్ కు  కూల్ డ్రింక్ సీసా  లో స్ట్రా చేసిన శబ్దం తో తెలిసింది, ఆ సీసా  ఖాళీ అయి చాలా సేపయిందని !  ఇంటికి చేరుకున్నాడు ఆకాష్ , ఇప్పుడు బైక్ కన్నా , తన ఆలోచనలు వేగం గా కదలాడుతున్నాయి. తాను చూసిన ఆ పరికిణీ , సల్వార్ , కమీజ్ , ఓణీ , ప్రత్యేకించి , ఆ  తెల్లటి బ్రా లు ! అవి వేసుకునే ఆ అమ్మాయి ఎంత బాగుంటుందో ?! ,ఆమె  తన వయసుదే   అయి ఉంటుంది ! తనతో స్నేహం చేస్తుందా ?! ఇట్లా ఆకాష్ ఆలోచనలు పరి పరి విధాలు గా పోతున్నాయి !
అప్పటి నుంచి , క్రమం తప్పకుండా , రోజూ కూల్ డ్రింక్ తాగుతున్నాడు , అదే దుకాణం లో , ఆకాష్ ! తన కళ్ళు , తనకన్నా ఆతృత గా ఎదురింటి మేడ  వైపు పోతున్నాయి ! కొన్ని సార్లు , ఇంకో రంగుల బట్టలు ఆరేసి ఉంటున్నాయి ! కానీ ఆకాష్ కళ్ళు , ఎదో ఒక చోట ఆరేసి ఉన్న బ్రా ల మీదే ఉంటున్నాయి ! అవి కనిపించక పొతే , నిరాశ చెందుతున్నాడు ! కనిపిస్తే , ఎదో ఒక మత్తైన పరవశానికి లోనవుతున్నాడు , ఆకాష్ ! రాత్రుల్లో , ఆ దృశ్యం పదే  పదే   గుర్తుకు వస్తోంది ! తనలో కామ పరమైన ఆలోచనలు చెలరేగుతున్నాయి ! 
వచ్చే టపాలో  మిగతా సంగతులు ! 
%d bloggers like this: