Our Health

Archive for సెప్టెంబర్, 2016|Monthly archive page

ఫెటిషిజానికి చికిత్స ఏమిటి ? 5.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 16, 2016 at 7:55 సా.

ఫెటిషిజానికి చికిత్స ఏమిటి ? 5. 

Image result for Indian women in blouse

ఫెటిషిజం ఒక జిడ్డు లాంటి మానసిక రుగ్మత ! ఈ సమస్య ఉన్న వారికి చికిత్స చేయ వచ్చు ! కానీ ఒక రోజో , రెండు రోజులో చికిత్స చేయించుకుంటే సరిపోదు ! దీర్ఘకాలికం గా , అంటే , కొన్ని నెలలూ , సంవత్సరాల తరబడీ చేయించుకుంటే , ఆ చికిత్స కు ఫలితం ఉంటుంది !
సాధారణం గా చికిత్స , మానసిక చికిత్స అంటే సైకోథెరపీ , మంచి ఫలితాలను ఇస్తుంది !
కొన్ని రకాలైన మందులు కూడా , కొంత వరకూ , పదే  పదే వచ్చే , చెడు ఆలోచనలను తగ్గిస్తాయి !
ఫలితాలు చాలా బాగా ఉండాలనుకుంటే ,  సైకో థెరపీ తో పాటుగా , మందులు కూడా తీసుకోవాలి ! 
ఈ  సైకో థెరపీ కానీ మందులు కానీ , క్షుద్ర విద్యలు చేసే వారూ , చేత బడులు చేసే వారూ కాకుండా ,
అనుభవజ్ఞులైన  , స్పెషలిస్ట్ డాక్టర్ ల వద్ద తీసుకుంటే బాగుంటుంది !
ఈ కండిషన్ , ప్రధానం గా యువకులలో ఉంటుంది కాబట్టి , కొన్ని , కొన్ని ప్రత్యేకమైన కేసులలో
పురుష హార్మోను లను తగ్గించే మందులు కూడా పైన చెప్పిన చికిత్సా పద్ధతు లల్లో కలపడం జరుగుంది !
పదే పదే వచ్చే కామ పరమైన ఆలోచనలను , కొన్ని కొన్ని ఆర్డర్ ల ద్వారా ఆపడం , లేదా , ఆ ఆలోచనల దిశను మార్చడం ద్వారా  ఫెటిషిజం తీవ్రత ను క్రమేణా తగ్గించడం , సైకో థెరపీ లో ప్రధానం గా జరుగుతుంది !
కొన్ని ప్రత్యేక మైన , మొండి కేసుల్లో ,  కామ పరమైన ఆలోచనలు ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు , వాటిని వెంటనే ‘ చల్లార్చడానికి ‘ ఒక దుర్గంధమైన వాసన ను  పేషేంట్ ఉన్న గది లో ప్రవేశ పెట్టడం లాంటి చికిత్సలు కూడా చేస్తూ ఉంటారు !
ఫెటిషిజం అనే రుగ్మతను , దాని తీవ్రతనూ , గుర్తించడం , అందుకు తగిన చికిత్స తీసుకోవడం ,
నిపుణులైన వైద్యుల వద్దనే చేయాలి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

ఫెటిషిజం కారణాలు . 4.

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 3, 2016 at 7:10 సా.

ఫెటిషిజం కారణాలు . 4. 

 

Image result for Indian lady with bra
మునుపటి టపాల లో చూశాము కదా ,ఫెటిషిజం అంటే ఏమిటో , ఏ ఏ రకాలు గా అది ఉండ వచ్చో !
మరి,  ఈ మానసిక రుగ్మత కారణాలు కనుక  పరిశీలించి నట్టయితే , ఖచ్చితమైన కారణాలు శాస్త్రీయం గా తెలియలేదు !
కానీ , అనేక రకాలు గా పలు శాస్త్రజ్ఞులు ఈ పరిస్థితిని తమదైన రీతిలో విశ్లేషించి , వ్యాఖ్యానించారు !
కొందరు , చిన్నతనం , లేదా బాల్యం లో కలిగిన అనుభవాలు , కాల క్రమేణా మనసు లేదా మెదడు లో గట్టి పడి , ఈ రుగ్మత కు దారి తీస్తాయని అన్నారు !
ఉదాహరణకు : ప్రవీణ్ చిన్నప్పుడు , పక్కింటి యువతి  , తన వక్షోజాలను కప్పిన బ్రా ను అతి నిదానం గా ఊడ  తీసుకుని , తన అందాలను ఎదురు గా ఉన్న అద్దం లో చూసుకోవడం , చాటుగా , కిటికీ సందుల్లోంచి  చూశాడు !  యుక్త వయసు వచ్చే సరికి , ప్రవీణ్ కు   , క్రమేణా ,  ఎక్కడ బ్రా కు సంబంధించిన  ప్రకటనలు కానీ , లేదా , అసలు బ్రా లు కానీ కనబడితే నే , కామోత్తేజం చెందడం జరిగిపోతుంది , అప్రయత్నం గానే ! అంతే కాకుండా , తాను ఒంటరి గా ఉన్నప్పుడు , యువతి  లంగా కానీ , బ్రా కానీ , చూసిన దృశ్యం గుర్తుకు వచ్చినప్పుడల్లా , ‘ హస్త ప్రయోగం ‘ చేసుకోవడం కూడా !
మరి కొందరి  విశ్లేషణ ప్రకారం , తీవ్రమైన సామాజిక , సాంఘిక కట్టుబాట్ల వల్ల , తమ ఈడు అమ్మాయిలతో , వ్యక్తి గత సంబంధాలకు అవరోధం కలిగి , వారి లో నిగూఢ మై ఉన్న కామ కోరికలు , ఈ రకం గా బయటకు వస్తాయని !
ఈ పరిస్థితి , మతపరమైన , లేదా సంఘ పరమైన కట్టు బాట్లు , తీవ్రం  గా ఉన్న దేశాలలో , ( భారత దేశం కూడా ) ఉన్న యువతులకు , ప్రత్యేకించి యువకులకు కూడా వర్తిస్తుంది ! గత ఒకటి రెండు దశాబ్దాలలో ,  భారత దేశం లో కూడా , ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది  ! 
ప్రపంచీకరణ కూడా అందుకు ప్రధాన కారణం , అంతర్జాల విప్లవం తో పాటుగా !
యుక్త వయసు వస్తున్న యువకులకు తమ కామ సామర్ధ్యం మీద తమకు ఆత్మ విశ్వాసం తక్కువ గా , అంటే కాన్ఫిడెన్స్ తక్కువ గా ఉండడం , యువతులు  తమను ( కామ పరమైన  సంబంధం కోసం ) అంగీకరించరేమో అన్న అనుమానాలు కలుగుతూ ఉండడం , దానితో కూడా కలిగే ఆత్మ న్యూనతా భావం కూడా ఫెటిషిజానికి  కారణాలు గా పేర్కొంటారు శాస్త్రజ్ఞులు !   ఈ రోజుల్లో  వీరివి గా లభ్యం అవుతున్న నీలి వీడియో లలో , గంటల సేపు , నిరంతరాయం గా  కామ క్రీడ జరుపుతున్న పురుషులను చూడడం కూడా , ఇట్లా ఆత్మ న్యూనతా భావం , వారి కామ సామర్ధ్యం మీద వారికి కాన్ఫిడెన్స్ సన్నగిల్లడానికి ఒక కారణం ! 
వచ్చే టపాలో మరిన్ని సంగతులు ! 
%d bloggers like this: