Our Health

Archive for ఆగస్ట్, 2016|Monthly archive page

ఫెటిషిజం లక్షణాలు ! 3.

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఆగస్ట్ 20, 2016 at 11:27 ఉద.

ఫెటిషిజం లక్షణాలు !3.

మునుపటి టపాలో చెప్పుకున్నట్టు , ఫెటిషిజం అంటే , నిర్జీవ వస్తువులను చూసి లేదా , 
జనాంగాలు కాని ఇతర  భాగాలను చూసి కానీ , కామాతృత చెందడమూ , లేదా కామానుభూతులు ఎక్కువ కావడమూ ! 
అనేక భారత భాషల సినిమాలలో  స్త్రీ  నాభి స్థానాన్ని చూపడమూ , లేదా , కాలి వేళ్ళను , కామ పరం గా చూపుతూ ఉంటారు , అది ఈ కోవ కు చెందినదే !
సాధారణం గా మనం , ఈ చిత్రాలు చూసినా , సినిమా బయటకు రాగానే , ఆ యా సందర్భాలు , మన మెదడు లో నిక్షిప్తమై ఉండవు !  కానీ ఫెటిషిజం అనే మానసిక రుగ్మత ఉన్న వారు, ఆ సీనులు పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ , కామానుభూతి చెందుతూ ఉంటారు !
అంతే కాకుండా , ఈ రకమైన అనుభూతులు , కనీసం  ఆరు నెలలకు మించి కలుగుతూ ఉంటే , అపుడు ‘ వ్యవహారం ‘ తీవ్రమైందని అనుకోవాలి ! 
అంతే కాక , వీరు , ఈ మానసిక రుగ్మత వల్ల , తీవ్రమైన ఆందోళన కు గురవుతూ ఉంటారు ! వారు విద్యార్థులయితే , చదువు లో ఏకాగ్రత తప్పి , చదువు కుంటు పడుతుంది ! లేదా ఉద్యోగస్తులవుతే , ఉద్యోగం అవకతవకలు గా చేస్తూ , పై అధికారి నుంచి దండన ‘ స్వీకరిస్తారు ‘ !
ఇంకా సమస్య తీవ్రం గా ఉన్న వారు , చెప్పుల షాపు లో లేదా ,  బ్రాల షాపు లోనో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారు లేదా , వాటిలో ఉద్యోగం చేస్తూ , ‘ స్వాంతన ‘ చెందుతూ ఉంటారు !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

ఫెటిషిజం అంటే ? 2.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఆగస్ట్ 14, 2016 at 11:08 ఉద.

ఫెటిషిజం అంటే ? 2. 

 ‘ ఫెటికోస్ ‘ అనే పోర్చు గీస్  పదం నుంచి  పుట్టింది ‘ ఫెటిషిజం ‘  దీని నిర్వచనం : అదేపనిగా ఒక నిర్జీవ వస్తువు ను చూస్తూ కానీ , తాకుతూ కానీ , కామోద్రేకం పొందడం.  మానవులు యుక్త వయసు వచ్చినప్పటి నుంచీ , తమకు నచ్చిన , అందమైన స్త్రీలను చూసినప్పుడు , ఆకర్షింప బడి , వారి లో  , కామ భావనలు కలగడం , సహజమే , కానీ నిర్జీవ వస్తువులు  అంటే , లంగాలో, బ్రా లో , హ్యాండ్ బ్యాగు లో , లేదా హై హీల్ పాద రక్ష లో చూసినప్పుడు , కామానుభూతులు పొందడాన్ని  ‘ ఫెటిషిజం ‘ అంటారు !’  ఆ డ్రెస్ లో ఆ యువతి బాగుంటుంది , లేదా ,ఆ గెట్ అప్ లో అతడు బాగుంటాడు ‘ అనే భావనలు సహజం గా వచ్చేవే ! ఇక్కడ బట్టలు నిర్జీవమైన వస్తువులయినప్పటికీ , ఆ భావనలు వచ్చిన వారికి , ఫెటిషిజం ఉన్నట్టు కాదు ! ఫెటిషిజం తీవ్రం గా ఉంటే , వారు  , అంతకు ముందు ఏ ఏ వస్తువులయితే , తమకు కామోత్తేజం కలిగించాయో , ఆ వస్తువులు లేనిదే , కామ క్రియ లో పాల్గొన లేరు !వారికి ఆ వస్తువులు అందుబాటులో  ఉండక పొతే , కామ క్రియ అసాధ్యం అవుతుంది , భౌతికం గా ఏ అవయవ లోపమూ లేనప్పటికీ ! 
ఫెటిషిజం,  స్త్రీలకంటే , పురుషులలోనే ఎక్కువ గా కనబడుతుంది ! అరుదుగా స్త్రీలలో కూడా ఉంటుంది . అందుకు కారణాలు స్పష్టం గా తెలియలేదు , ఇప్పటి వరకూ !
ఫెటిషిజం లో రకాలు ఉంటాయా ?:
ఫెటిషిజం ప్రధానం గా రెండు రకాలు :
1. ఆకార ఫెటిషిజం( ఫార్మ్ ఫెటిషిజం )  :  ఈ రకమైన  ఫెటిషిజం ఉన్న వారు , ప్రత్యేకమైన ఆకారం లో ఉన్న వస్తువులను చూస్తేనే , కామోత్తేజం చెందుతారు ! ఉదాహరణకు ,  ఒక యువతి  , సాధారణ ఆకారం లో ఉన్న చెప్పులు వేసుకుంటే , పెద్దగా ఆకర్షింపబడరు , ఆ  యువతి అందం గా ఉన్నా కూడా ! ఇంకో యువతి  హై హీల్స్ వేసుకుని నడుస్తూ ఉంటే , కామోత్తేజం కలుగుతుంది , కేవలం ఆ హై హీల్స్ కనబడగానే , ఆ యువతి ని  పూర్తి గా చూడక పోయినా కూడా ! 
2. పదార్ధ  ఫెటిషిజం:  దీనిని మీడియా ఫెటిషిజం అని అంటారు . ఈ రకమైన ఫెటిషిజం ఉన్న వారు , స్త్రీలు ధరించే బట్టలు లేదా ఇతర వస్తువులు తయారు చేయబడ్డ పదార్ధం తో కామోత్తేజం చెందుతారు !
ఒక యువతి , ఉతికి , ఇస్త్రీ చేసిన నూలు (కాటన్ ) బట్టలు వేసుకుని కనిపిస్తే కానీ , లేదా ఇంకొందరు ,యువతి,    పట్టు వస్త్రాలు ధరిస్తే కానీ ,  జంతు చర్మం తో చేసిన జాకెట్ ధరిస్తే కానీ , అమితం గా ఉత్తేజం చెందుతారు !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు !
మీ స్పందనలూ , సందేహాలూ తెలపండి , ఏమైనా ఉంటే  ! 

ఫెటిషిజం .1.

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఆగస్ట్ 13, 2016 at 1:26 సా.

ఫెటిషిజం .1.

ఉదయం  లేవగానే , స్నానం చేసి , ఉతికి ,ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకుని , తాజాగా తయారయ్యాడు , ఆకాష్ !  వేడి ఇడ్లీలూ , సెగలొస్తున్న సాంబారూ తిని, హెల్మెట్ పెట్టుకుని , కాలేజీకి బయలు దేరాడు , తన ‘ పంచ కల్యాణి ‘ బైక్ మీద, ఒక యోధుడి లాగా  !
 బైక్ తో పాటుగా , తన మనసు కూడా ఉరకలు వేస్తూ ఉంది !  యవ్వనం లో తనలో వచ్చే మార్పులతో , తనకు తెలిసిన అమ్మాయిల్లో మార్పులు కూడా నిశితం గా పరిశీలిస్తున్నాడు ! వారితో మాట్లాడుతున్నా , వారి పొందులో , సరదా గా కాలం గడిపినా , ఎంతో ఆనందం గా ఉంటున్నాడు ! తనలో ఆత్మ విశ్వాసం కూడా ఎక్కువ గా శ్వాస తీసుకుంటుంది ! కానీ అప్పుడే ఎక్కువ  చనువు తీసుకో లేక పోతున్నాడు , ఏ ఒక్క అమ్మాయి తోనూ !
అది ఓ  వేసవి మధ్యాహ్నం, నాలుగు గంటలయి ఉంటుంది. కాలేజీ అయ్యాక , ఇంటికి వచ్చే దారి లో  ఒక దుకాణం ముందు ఆగాడు , దాహం గా  ఉంటే , కూల్ డ్రింక్ కోసం. డ్రింక్ సిప్ చేస్తూ ,యదాలాపం గా  కొన్ని గజాల దూరం లో , రోడ్డు కు ఆవల కనిపిస్తున్న  ఒక మేడ వైపు చూశాడు ! పిట్ట గోడ మీద రెండు వైపులా చక్కటి పూల కుండీలు , ఆ మధ్య ,  ఆరేసిన బట్టలు కనిపిస్తున్నాయి !  నారింజ రంగులో ఉన్న కమీజ్ , చిలక పచ్చ రంగులో సల్వార్ , ఆ పక్కనే ఒక ముదురు నీలం రంగు పరికిణీ , ఆకు పచ్చని ఓణీ , ఆ పక్క గా , రెండు తెల్లటి బ్రాలు ! అన్నీ , వీస్తున్న గాలికి , రెప రెప లాడుతున్నాయి , వెనకా ముందుకు ఊగుతున్నాయి ! అప్పటి దాకా ఓ చూపు చూసిన ఆకాష్ కళ్ళు , తెల్లటి బ్రాలు  కనిపించగానే , ఒక్క సారిగా తీక్షణం అయ్యాయి ! అదే పనిగా పరిశీలించ సాగాయి ! ఆ బ్రాలు పెద్దవి గా కనబడుతున్నాయి , తన కళ్ళు బైనాక్యులర్స్ కానప్పటికీ ! ” ఆ గాలి కాస్త ఎక్కువ అవకూడదూ ?! కనీసం ఒక్క బ్రా , ఎగిరి , ఆకాశం లో తేలి పోతూ , ఈ ఆకాష్ మీద పడ కూడదూ ?! “  అనుకుంటూ , అప్రయత్నం గా తన తలను కూడా ముందుకు ఊపుతున్న ఆకాష్ కు  కూల్ డ్రింక్ సీసా  లో స్ట్రా చేసిన శబ్దం తో తెలిసింది, ఆ సీసా  ఖాళీ అయి చాలా సేపయిందని !  ఇంటికి చేరుకున్నాడు ఆకాష్ , ఇప్పుడు బైక్ కన్నా , తన ఆలోచనలు వేగం గా కదలాడుతున్నాయి. తాను చూసిన ఆ పరికిణీ , సల్వార్ , కమీజ్ , ఓణీ , ప్రత్యేకించి , ఆ  తెల్లటి బ్రా లు ! అవి వేసుకునే ఆ అమ్మాయి ఎంత బాగుంటుందో ?! ,ఆమె  తన వయసుదే   అయి ఉంటుంది ! తనతో స్నేహం చేస్తుందా ?! ఇట్లా ఆకాష్ ఆలోచనలు పరి పరి విధాలు గా పోతున్నాయి !
అప్పటి నుంచి , క్రమం తప్పకుండా , రోజూ కూల్ డ్రింక్ తాగుతున్నాడు , అదే దుకాణం లో , ఆకాష్ ! తన కళ్ళు , తనకన్నా ఆతృత గా ఎదురింటి మేడ  వైపు పోతున్నాయి ! కొన్ని సార్లు , ఇంకో రంగుల బట్టలు ఆరేసి ఉంటున్నాయి ! కానీ ఆకాష్ కళ్ళు , ఎదో ఒక చోట ఆరేసి ఉన్న బ్రా ల మీదే ఉంటున్నాయి ! అవి కనిపించక పొతే , నిరాశ చెందుతున్నాడు ! కనిపిస్తే , ఎదో ఒక మత్తైన పరవశానికి లోనవుతున్నాడు , ఆకాష్ ! రాత్రుల్లో , ఆ దృశ్యం పదే  పదే   గుర్తుకు వస్తోంది ! తనలో కామ పరమైన ఆలోచనలు చెలరేగుతున్నాయి ! 
వచ్చే టపాలో  మిగతా సంగతులు ! 
%d bloggers like this: