Our Health

Archive for ఆగస్ట్ 14th, 2016|Daily archive page

ఫెటిషిజం అంటే ? 2.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఆగస్ట్ 14, 2016 at 11:08 ఉద.

ఫెటిషిజం అంటే ? 2. 

 ‘ ఫెటికోస్ ‘ అనే పోర్చు గీస్  పదం నుంచి  పుట్టింది ‘ ఫెటిషిజం ‘  దీని నిర్వచనం : అదేపనిగా ఒక నిర్జీవ వస్తువు ను చూస్తూ కానీ , తాకుతూ కానీ , కామోద్రేకం పొందడం.  మానవులు యుక్త వయసు వచ్చినప్పటి నుంచీ , తమకు నచ్చిన , అందమైన స్త్రీలను చూసినప్పుడు , ఆకర్షింప బడి , వారి లో  , కామ భావనలు కలగడం , సహజమే , కానీ నిర్జీవ వస్తువులు  అంటే , లంగాలో, బ్రా లో , హ్యాండ్ బ్యాగు లో , లేదా హై హీల్ పాద రక్ష లో చూసినప్పుడు , కామానుభూతులు పొందడాన్ని  ‘ ఫెటిషిజం ‘ అంటారు !’  ఆ డ్రెస్ లో ఆ యువతి బాగుంటుంది , లేదా ,ఆ గెట్ అప్ లో అతడు బాగుంటాడు ‘ అనే భావనలు సహజం గా వచ్చేవే ! ఇక్కడ బట్టలు నిర్జీవమైన వస్తువులయినప్పటికీ , ఆ భావనలు వచ్చిన వారికి , ఫెటిషిజం ఉన్నట్టు కాదు ! ఫెటిషిజం తీవ్రం గా ఉంటే , వారు  , అంతకు ముందు ఏ ఏ వస్తువులయితే , తమకు కామోత్తేజం కలిగించాయో , ఆ వస్తువులు లేనిదే , కామ క్రియ లో పాల్గొన లేరు !వారికి ఆ వస్తువులు అందుబాటులో  ఉండక పొతే , కామ క్రియ అసాధ్యం అవుతుంది , భౌతికం గా ఏ అవయవ లోపమూ లేనప్పటికీ ! 
ఫెటిషిజం,  స్త్రీలకంటే , పురుషులలోనే ఎక్కువ గా కనబడుతుంది ! అరుదుగా స్త్రీలలో కూడా ఉంటుంది . అందుకు కారణాలు స్పష్టం గా తెలియలేదు , ఇప్పటి వరకూ !
ఫెటిషిజం లో రకాలు ఉంటాయా ?:
ఫెటిషిజం ప్రధానం గా రెండు రకాలు :
1. ఆకార ఫెటిషిజం( ఫార్మ్ ఫెటిషిజం )  :  ఈ రకమైన  ఫెటిషిజం ఉన్న వారు , ప్రత్యేకమైన ఆకారం లో ఉన్న వస్తువులను చూస్తేనే , కామోత్తేజం చెందుతారు ! ఉదాహరణకు ,  ఒక యువతి  , సాధారణ ఆకారం లో ఉన్న చెప్పులు వేసుకుంటే , పెద్దగా ఆకర్షింపబడరు , ఆ  యువతి అందం గా ఉన్నా కూడా ! ఇంకో యువతి  హై హీల్స్ వేసుకుని నడుస్తూ ఉంటే , కామోత్తేజం కలుగుతుంది , కేవలం ఆ హై హీల్స్ కనబడగానే , ఆ యువతి ని  పూర్తి గా చూడక పోయినా కూడా ! 
2. పదార్ధ  ఫెటిషిజం:  దీనిని మీడియా ఫెటిషిజం అని అంటారు . ఈ రకమైన ఫెటిషిజం ఉన్న వారు , స్త్రీలు ధరించే బట్టలు లేదా ఇతర వస్తువులు తయారు చేయబడ్డ పదార్ధం తో కామోత్తేజం చెందుతారు !
ఒక యువతి , ఉతికి , ఇస్త్రీ చేసిన నూలు (కాటన్ ) బట్టలు వేసుకుని కనిపిస్తే కానీ , లేదా ఇంకొందరు ,యువతి,    పట్టు వస్త్రాలు ధరిస్తే కానీ ,  జంతు చర్మం తో చేసిన జాకెట్ ధరిస్తే కానీ , అమితం గా ఉత్తేజం చెందుతారు !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు !
మీ స్పందనలూ , సందేహాలూ తెలపండి , ఏమైనా ఉంటే  ! 
%d bloggers like this: